న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరగనుంది. ఫిబ్రవరి 7న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రెండో విడత అభ్యర్థుల జాబితాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. నాలుగు రోజుల క్రితం కాషాయ కండువా కప్పుకున్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీకి ఢిల్లీలో పార్టీ ప్రచార బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించే అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపించటం లేదు. సమావేశం అనంతరం గానీ లేదా మంగళవారం ఉదయం ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని ప్రకటించే అవకాశం ఉంది. తదుపరి సీఎం అభ్యర్థిగా ఇటీవలే పార్టీలో చేరిన కిరణ్ బేడీ పేరు ప్రకటించే అవకాశం ఉందని చిత్రీకరించడంతో, చాలామంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు.