గోవాలో రికార్డు స్థాయిలో ఎన్నికల పోలింగ్ | record polling in goa assembly elections | Sakshi
Sakshi News home page

గోవాలో రికార్డు స్థాయిలో ఎన్నికల పోలింగ్

Published Sat, Feb 4 2017 12:00 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

గోవాలో రికార్డు స్థాయిలో ఎన్నికల పోలింగ్ - Sakshi

గోవాలో రికార్డు స్థాయిలో ఎన్నికల పోలింగ్

ఢిల్లీ : గోవా అసెంబ్లీ ఎన్నికలకు రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు అవుతోంది.  మధ్యాహ్నం 12 గంటలకు 40 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పంజాబ్‌లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు 25 శాతం పోలింగ్ నమోదైంది.

2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో ఆప్,  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పనాజిలో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ గోవాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు అవుతుందని..విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. జలదంర్‌లోని 66వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement