బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ రాలేదనే అసంతృప్తితో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరుతున్నారు. తాజాగా కమలం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కూడా పార్టీని వీడారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ శెట్టర్ హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఈసారి కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం యువ నాయకులకు అవకాశం ఇవ్వాలని ఈయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు. అయినా అధిష్ఠానం మాత్రం టికెట్ కేటాయించలేదు.
క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తనను చివరకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని జగదీశ్ చెప్పుకొచ్చారు. లింగాయత్ వర్గానికి చెందిన ఈయన ఎన్నికల ముందు పార్టీని వీడటం బీజేపీకి కచ్చితంగా నష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా.. జగదీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. టికెట్ ఖరారు చేసుకున్నాకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..
Comments
Please login to add a commentAdd a comment