ఎంసెట్ కన్వీనర్, మంత్రుల ఫ్లెక్సీ దహనం
Published Thu, Jul 28 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
బెల్లంపల్లి : ఎంసెట్ పేపర్ లీకేజీ నిందితులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీ బొమ్మల దహనం చేశారు. బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా కల్వర్టు వద్ద ఎంసెట్ కన్వీనర్ రమణరావు, విద్యా, వైద్య శాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్షా్మరెడ్డిల ఫ్లెక్సీ బొమ్మలను కాల్చివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఎంసెట్ పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రధాన నిందితుడు రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి సహకరించిన విద్యార్థులను మినహాయించి మిగతా విద్యార్థులకు కౌన్సెలింగ్ చేసి సీట్లు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కష్ణదేవరాయులు, బాగ్ కన్వీనర్ ఎన్.మురళీశ్రావణ్, కళాశాల ఇన్‌చార్జి హిమవంత్, నాయకులు అఖిల్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement