రేపటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ | AP EMCET Web Counseling Dates Have Been Declared | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్

Published Thu, Oct 22 2020 6:55 PM | Last Updated on Thu, Oct 22 2020 7:01 PM

AP EMCET  Web Counseling Dates Have Been Declared - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి : రేపటి నుంచి ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో వెబ్ కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా
రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయ‌గా, గిరిజన విద్యార్ధుల కోసం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. 

రేపు (అక్టోబ‌ర్ 23)న  ఒకటో ర్యాంక్ నుంచి 20వేల వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నుండ‌గా, 
24న 20,001 ర్యాంక్ నుంచి 50వేల వ‌ర‌కు 
25న 50,001 ర్యాంక్ నుంచి 80వేల వరకు 
26న 80,001 ర్యాంక్ నుంచి 1.10లక్షల వరకు 
27న 1,10,001 నుంచి చివరి ర్యాంక్‌ వరకు వెబ్ కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement