వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు | Intermediate exams will conduct Separately in Telangana, Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు

Published Fri, Sep 19 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు

వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు

  • ఇంటర్ బోర్డు సన్నాహాలు 
  •   తెలంగాణ, ఏపీలకు వేరుగా ప్రశ్నపత్రాలు 
  •   రెండు ప్రభుత్వాలకు బోర్డు ప్రతిపాదనలు
  •  
     వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరుగా, వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నుంచి అనుమతి కోరుతూ  ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపింది. 
     
     సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరుగా, వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నుంచి అనుమతి కోరుతూ  ప్రతిపాదనలను పంపించింది. దీంతో ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీ పరిస్థితి గందరగోళంలో పడింది. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల ఎత్తివేతకు ఏపీ సర్కార్ ఆలోచనలు చేస్తోంది.దీనికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు ఆ సర్కార్‌నుంచి ఇంతవరకు ఇంటర్ బోర్డుకు రాలేదు. వురోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత లేదు. దీంతో ఇంటర్‌బోర్డు యుథావిధిగా మెుదటి ఏడాది పరీక్షల నిర్వహణకు సిద్ధవువుతోంది.  పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీలను కూడా ప్రకటించింది.
     
     ఒక రాష్ట్రం ఇస్తే.. 
     రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్  వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులకు పదేళ్లపాటు ఉమ్మడిగా ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఎంసెట్ ర్యాంకును ఖరారు చేసేప్పుడు విద్యార్థి సాధించిన ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు. దానిని కలుపుకొని తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఈ పరిస్థితుల్లో రెండు  రాష్ట్రాల విద్యార్థులకు ఒకే ప్రశ్నపత్రం ద్వారా ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తే వెయిటేజీలో ఇబ్బంది ఉండదు. విడిగా పరీక్షలు నిర్వహిస్తే మాత్రం వెయిటేజీ ఖరారులో సమస్యలు తప్పవని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్రం సులభమైన ప్రశ్నలను ఇస్తే, మరో రాష్ట్రానికి చెందిన వారు ఎంసెట్ ర్యాంకుల్లో  నష్టపోక తప్పదని అంటున్నారు.
     
      ప్రశ్నపత్రాలు ఒకేలా ఉండకపోవచ్చు! 
     ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఒకే ఇంటర్మీడియెట్ బోర్డు సేవలు అందిస్తోంది. ఈ బోర్డు నేతృత్వంలోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు రూపొందించినా ఒక రాష్ట్రంలోని కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉండొచ్చు. కొన్ని సులభంగా ఉండొచ్చు. రెండూ సవూనంగా ఉన్నాయని చెప్పడానికి శాస్త్రీయ విధానమంటూ ఉండదు.  ఇక కావాలని ఒక రాష్ట్రం ప్రశ్నపత్రాలను సులభంగా ఇస్తే గందరగోళం తలెత్తుతుంది. ప్రశ్న పత్రాలు కఠినంగా వచ్చిన రాష్ట్రంలోని విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది. ఈ ప్రభావం ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాల పై  పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు వచ్చిన వారికే ఓపెన్ కోటాలో అగ్రశ్రేణి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి.
     
     మూల్యాంకనమప్పుడే అనుమానాలు..
     మెున్నటి మార్చి/ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం విషయంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఒక ప్రాంతం విద్యార్థుల జవాబు పత్రాలను మరో ప్రాంతంలో మూల్యాంకన ం చేయించవద్దని లెక్చరర్లే పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కావాలని తక్కువ మార్కులు వేస్తారనే అనుమానాలు రెండు వైపుల నుంచీ వ్యక్తం అయ్యాయి. దీంతో ఏప్రాంత విద్యార్థుల జవాబు పత్రాలను ఆప్రాంతంలోనే మూల్యాంకనం చేయించారు. మూల్యాంకనం విషయంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక ప్రశ్న పత్రాలు వేర్వేరుగా ఇస్తే వచ్చే మార్కులకు శాస్త్రీయత ఎలా ఉంటుందని సందేహాలు వ్యక్తం అవుతున్నారుు. వాటి ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఎలా ఇస్తారు? అనే వాదనలు వస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీని తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలోనూ దానిని ఎత్తివేసే అంశంపై పరిశీలన జరుపుతున్నట్లు తెలిసింది.
     
     ఎంసెట్‌ను రద్దు చేస్తే..?
     ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ను రద్దు చేసే అంశంపై ఆలోచనలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ దానికి ప్రత్యామ్నాయాలు ఏంటనే అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల విధానం అమలు చేయాల్సి ఉన్నందున రద్దు సాధ్యం కాకపోవచ్చనే భావన నెలకొంది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రవేశాల నిర్వహణకు దోహదంగా ఉన్న ఎంసెట్‌కు ప్రత్యామ్నాయం అధికారులకు కనిపించడం లేదు. ఏపీ అధికారులైతే ఈ విషయంలో లోతుగా పరిశీలన జరుపుతున్నారు. ఎంసెట్‌ను రద్దు చేస్తే.. ఉమ్మడి ప్రవేశాలకోసం రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన ప్రశ్న పత్రాలతో పరీక్షలు నిర్వహించాలి. ఒకవేళ అదీ చేసినా, మూల్యాంకనంలో తేడాలు వస్తాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెయిటేజీ రద్దు, ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజులు గడిస్తేనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
     
     ప్రథమ సంవత్సర పరీక్షలు రద్దు ? 
     జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ పరీక్ష విషయుంలో గందరగోళం లేకుండా ఉండేందుకు ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షలను ఎత్తివేయూలని గతంలోనే ఆలోచనలు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కొంత సంసిద్ధతను వ్యక్తం చేసింది. తెలంగాణ విద్యా శాఖ వర్గాలు కూడా ఎత్తివేస్తే బాగానే ఉంటుందని భావించారుు. తద్వారా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తరహాలో కేవలం ద్వితీయ సంవత్సరానికే (12వ తరగతి) పరీక్షలు నిర్వహిస్తే సవుస్యలు రావని యోచించారుు. ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా పర్సంటైల్ నిర్ధారణలో రాష్ట్ర విద్యార్థుల విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇతర రాష్ట్రాలు, సీబీఎస్‌ఈలో కేవలం 12వ తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుని పర్సంటైల్ నిర్ధారిస్తుండగా, వునదగ్గర రెండేళ్ల మార్కులను తీసుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏటా ఆందోళనలు తప్పడం లేదు. అందుకే ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను ఎత్తివేసి, 12వ తరగతికి సమానమైన ద్వితీయ సంవత్సర పరీక్షలనే నిర్వహించేంచాలన్న డివూండ్లు వచ్చారుు. కాని ఇంతవరకు ప్రభుత్వాలనుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. దీంతో ఈసారికి పరీక్షలు నిర్వహించేందుకే ఇంటర్‌బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement