‘నారాయణ, శ్రీచైతన్యపై’ అనుమానం
హిమాయత్‌నగర్: ఎంసెట్–2 లీక్ వ్యవహారంలో నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కూడా విచారణ జరపాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్.ప్రదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య డిమాండ్ చేశారు. వందలోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులలో ఆ విద్యాసంస్థలకు చెందిన వారు కూడా ఉన్నారని ఆరోపించారు.
నారాయణగూడ ఫ్లైఓవర్ కింద పీడిఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, మహేష్ పాల్గొన్నారు.