ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల! | JNTU Released EMCET Schedule | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల!

Published Wed, Sep 2 2020 6:35 PM | Last Updated on Wed, Sep 2 2020 6:35 PM

JNTU Released EMCET Schedule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌కి సోమవారం జేఎన్‌టీయూ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో  మొత్తం 102 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణలో 79, ఏపీ 23 కేం‍ద్రాలలో పరీక్షను నిర్వహించన్నారు.   మొత్తం 1,43,165 అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. గురువారం నుంచి సెప్టెంబర్‌ 7 వ తేదీ వరకు  www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని జేఎన్‌టీయూ కన్వీనర్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ శానిటైజర్‌ వాడాలని ఆయన సూచించారు. 

చదవండి: 16 నుంచి ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement