విద్యార్థుల సమస్యను రాజకీయం చేయొద్దు: గంటా
న్యూఢిల్లీ: 1956 స్థానికత వివాదం, ఎంసెట్ కౌన్సిలింగ్ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. దేశరాజధానిలో రాజ్‌నాథ్‌సింగ్, అనిల్ గోస్వామి, వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీలను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యను రాజకీయం చేయొద్దు అని అన్నారు.
1956 స్థానికతకు ప్రామాణికంగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 371 డి, ఆరుసూత్రాలు నాలుగేళ్లు ఎక్కడ నివసిస్తే అక్కడే స్థానికుడిగా గుర్తించాలనే నిబంధనలున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తామని హోంమంత్రి హామీఇచ్చారని మంత్రి గంటా అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.