ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎంసెట్ పరీక్ష గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు 3,545 మంది హాజరుకానున్నారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిని నియమించారు. వీరితోపాటు రూట్ అధికారులను, ప్రత్యేక పరీశీలకులను నియమించినట్లు ఎంసెట్ రీజినల్ కో-ఆర్డినేటర్ నాగేందర్ తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి గంట ముందుగానే అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. హాల్‌లోకి అనుతించబోమని స్పష్టం చేశారు. అన్‌లైన్ పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని పరీక్ష కేంద్రంలో అందజేయాలన్నారు.
మూడు పరీక్ష కేంద్రాలు..
ఆదిలాబాద్ పట్టణంలోని నలంద, విద్యార్థి, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ కోసం మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,805మంది పరీక్షకు హాజరు కానున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్, మెడిసిన్ కోసం ఇవే మూడు కేంద్రాలలో 1,740 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు క లుగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు రీజినల్ కో-అర్డినేటర్ తెలిపారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సేవలు ఏర్పాటు చేశారు.
రేపు ఐసెట్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశం కోసం శుక్రవారం ఐసెట్ పరీక్ష జరగనుంది. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్ష జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వ హించబడుతుందని ఐసెట్ పరీక్ష నిర్వహణ రీజినల్ కో ఆర్డి నేటర్ అశోక్ తెలిపారు. ఈ పరీక్షకు 349 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమై నా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబడదన్నారు. అభ్యర్థు లు బాల్ బ్లాక్ పాయింట్ పెన్, హల్‌టికెట్, పరీక్ష ప్యాడ్ వెం ట తెచ్చుకోవాలన్నారు.
హాల్ టికెట్‌పై ఫొటో లేకపోతే రెం డు పాస్‌పోర్టు సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాని, సెల్‌ఫో న్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవన్నారు.పరీక్ష నిర్వహాణ కోసం ఒక సీఎస్, అబ్జర్‌వర్, యూనివర్సిటీ అబ్జర్వర్‌లను నియమించినట్లు తెలిపారు.
అభ్యర్థులకు సూచనలు
ఎంసెట్ పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి కంటే ఒక గంట ముందుగా చేరుకోవాలి.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు.
పరీక్ష కేంద్రం లోపలికి సెల్‌ఫోన్లు, పేజర్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
నీలి, నలుపు రంగు బాల్ పాయింట్ పెన్ను, హాల్ టికెట్‌ను వెంట తెచ్చుకోవాలి.
హల్ టికెట్‌పై ఫొటో లేకపోతే రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలను వెంట తెచ్చుకోవాలి.
నేడు ఎంసెట్.. రేపు ఐసెట్..
Published Thu, May 22 2014 1:54 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement