ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలి: దేవినేని ఉమ
విజయవాడ: ఎంసెట్ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పు చూసైనా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ అన్నారు. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌తో ఆడుకోవడం తగదని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 371 (డి) ప్రకారం పదేళ్లపాటు అమలులో ఉంటుందనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి దేవినేని ఉమ గుర్తు చేశారు.