కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ ఈనెల 22వ తేదీన జరగనుంది. ఈ మేరకు వరంగల్ రీజినల్ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రీజినల్ కోఆర్డినేటర్, కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనుండగా 14,323మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ పరీక్ష కోసం 23 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 36 మంది పరిశీలకులను నియమించామని శ్రీనివాసులు తెలిపారు. అలాగే, మధ్యాహ్నం 2-30నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరగనుండగా, 6,669మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని వివరించారు. ఈ పరీక్ష కోసం పది కేంద్రాలు ఏర్పాటు చేయగా, 18 మంది పరిశీలకులను నియమించామని తెలి పారు. కాగా, విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని శ్రీనివాసులు వివరించారు.
ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
Published Tue, May 20 2014 2:45 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement