ఫీజు రీయింబర్స్ మెంట్ పై గవర్నర్ ను కలుస్తాం: రావెల
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన స్ధానికత సక్రమంగా లేదని ఆంధ్రప్రదేశ్ గిరిజన, సాంఘీక సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు అన్యాయం కలిగించే రీతిలో ఉందని ఆయన అన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు న్యాయం చేసేందుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుస్తామని ఆయన అన్నారు. విభజన బిల్లు ఆధారంగా విద్యార్ధులకు న్యాయం చేయాలని రావెల సూచించారు.