రావెల సుశీల్ కారు సీజ్ | ravela Sushil car Siege | Sakshi
Sakshi News home page

రావెల సుశీల్ కారు సీజ్

Published Fri, Mar 11 2016 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

రావెల సుశీల్ కారు సీజ్

రావెల సుశీల్ కారు సీజ్

బంజారాహిల్స్: ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు రావెల సుశీల్(24) పోలీసు కస్టడీ గురువారం కూడా కొనసాగింది. ఆయనను బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజైన గురువారం కూడా ఘటన వివరాలపై విచారించారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రావెల కిశోర్ తన కారులో వెళ్తూ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఫాతిమా బేగం అనే యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

కాగా,  ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు జైలులో ఉన్న  ఆయనతో పాటు డ్రైవర్ రమేష్‌ను తమ కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు వీరు ప్రయాణించిన కారు(ఏపీ 07 సీకే 1777)ను సీజ్ చేశారు. ఈ కారు నారాయణ స్వామి అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయి ఉందని పోలీసులు విచారణలో తెలిసింది.  కొద్ది రోజులు వాడుకోవడానికి తన బంధువైన నారాయణ స్వామి నుంచి కారును తీసుకున్నట్లు సుశీల్ దర్యాప్తులో వెల్లడించారు. కాగా, ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement