ఓ మైనారిటీ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి నిర్భయ చట్టం కింద కేసులో బుక్కయిన మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్, అతని కారు డ్రైవర్ రమేష్‌లు ఆదివారం బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు. షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్న వీరు కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు. ఈ నెల 3న బంజారాహిల్స్ అంబేద్కర్ నగర్‌లో ఓ మహిళా టీచర్ నడుచుకుంటూ వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న రావెల సుశీల్ ఆమె పట్ల అసభ్యకరంగా వ్యవహరించి, కారులో లాగేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పోలీసుల ముందు హాజరైన రావెల సుశీల్
Published Sun, Mar 20 2016 5:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement