రాష్ట్రపతి దృష్టికి స్థానికత అంశం: రావెల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చిస్తారని ఏపీ సాంఘీకశాఖమంత్రి రావెల కిషోర్‌బాబు మీడియాకు తెలిపారు.
శనివారం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి 1956 వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని రావెల అన్నారు. ఈ వివాదంపై త్వరలో ప్రధాని మోడీకి లేఖ రాస్తారన్నారు. స్థానికతపై కోర్టును కూడా ఆశ్రయిస్తామని రావెల కిషోర్ బాబు తెలిపారు.