- ఇంజినీరింగ్ కళాశాల, బ్రాంచ్‌లు మార్చుకునేందుకు వీలు
- ఎంసెట్ కౌన్సెలింగ్‌లో చివరి అవకాశం
ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ చివరి దశకు చేరుకుంది. ఆది, సోమవారాల్లో ఆప్షన్లు మార్పునకు మరో అవకాశం ఉంది. గతంలో ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు సైతం మళ్లీ అదనపు సమాచారం ఉంటే మార్చుకోవచ్చు. 22న ఎలాట్‌మెంట్ల ప్రకటన ఉంటుంది. విద్యార్థుల పూర్వపు పాస్‌వర్డ్, లాగిన్ ఐడీతో ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చు. దాదాపుగా విద్యార్థులు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చు కున్నారు. ఈనెల 6 నుంచి 15 వరకు ఎంసెట్-2016 కౌన్సెలింగ్ శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రలో జరగ్గా, 2,825 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 1 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ శనివారంతో ముగిసింది. షెడ్యూల్ మేరకు ఉన్నత విద్యామండలి విద్యార్థులు కళాశాలలు, ఆప్షన్లు మార్పునకు మరో అవకాశం కల్పించింది.
విద్యార్థుల పునరాలోచనకు అవకాశం
గతంలో అవగాహనతో విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకుంటే మార్పులు అవసరం లేకున్నా, గతంలో అవగాహన లేకుండా కళాశాల, బ్రాంచ్‌లు ఎంచుకుంటే మాత్రం విద్యార్థులు మార్పులు చేయడం మంచిది. ప్రస్తుతం కొత్తగా కొన్ని ప్రభుత్వ కళాశాలలు సైతం కౌన్సెలింగ్ జాబితాలో చేరాయి. ప్రభుత్వ కళాశాలలకు ర్యాంకు బట్టి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. 10వేల లోపు ర్యాంకు విద్యార్థులు ఎటువంటి కళాశాలు ఎంచుకున్నా రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థులకు సమస్య ఉండదు.
కామన్ ఫీజు దాటిన కళాశాలలు ఎంచుకునే విద్యార్థులు ఆర్థిక స్థోమత పరిగణలోకి తీసుకొని కళాశాల ఎంపిక చేసుకుంటే మంచిది. ప్రస్తుతం విద్యార్థులు ట్రెండ్ బట్టి సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ట్రిఫుల్‌ఈ, సివిల్ బ్రాంచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుం ఉన్న ట్రెండ్ విద్యార్థి రిలీవ్ అయిన నాలుగేళ్ల తరువాత కొనసాగుతుందని చెప్పలేం. మార్పులు ఉంటాయి. ఎంచుకున్న బ్రాంచ్‌లో నిష్ణాతులైన విద్యార్థులు మాత్రమే మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. కళాశాల మార్పులు చేసుకునే విద్యార్థులు గత ప్రవేశాలు, పూర్వపు విద్యార్థుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటే నష్టపోయో అవకాశాలు తక్కువ.
ఆప్షన్లు మార్పునకు అవకాశం
విద్యార్థులు ఆది, సోమవారాల్లో ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చు. అవసరం లేదంటే మార్పునకు అవసరం లేదు. గతంలో ఇచ్చిన ఆప్షన్లు సరిచూసుకోవచ్చు. ఆప్షన్ల మార్పునకు ఇది చివరి అవకాశం.
- మేజర్ కె.శివకుమార్, సహాయ కేంద్రం ఇన్‌చార్జి.
ఆప్షన్ల మార్పునకు అవకాశం
Published Sun, Jun 19 2016 11:07 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
Advertisement