ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు గడువు కోరిన తెలంగాణ | telangana government files Petition in supreme court over eamcet counselling | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు గడువు కోరిన తెలంగాణ

Published Mon, Sep 26 2016 8:31 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు గడువు కోరిన తెలంగాణ - Sakshi

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు గడువు కోరిన తెలంగాణ

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎంసెట్‌ పరీక్ష నిర్వహణ ఆలస్యమవడం వల్ల అడ్మిషన్ల ప్రక్రియకు మరో నెల రోజుల పాటు గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. సెప్టెంబరు 30 నాటికి కౌన్సిలింగ్‌ ప్రక్రియ పూర్తికావాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరికొంత గడువు కోరింది.

తెలంగాణలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైతే తమపై ప్రభావం చూపుతుందని, తమకూ కొంత సమయం అవసరం అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఎన్టీయార్‌ హెల్త్‌వర్శిటీ, ప్రయివేటు కళాశాలలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఏపీలో ఇదివరకే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఒకవేళ తెలంగాణలో సీటొస్తే అక్కడికి వెళ్లిపోతారని, తద్వారా ఏపీలో సీట్లు ఖాళీగా ఉంటాయని పిటిషన్లలో పేర్కొన్నారు. బుధవారం ఈ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement