
9న పోలవరం వ్యతిరేక దినం : కోదండరామ్
హైదరాబాద్: ఈ నెల 9న పోలవరం వ్యతిరేక దినంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు టి.జేఏసీ కన్వీనర్ కోదండరామ్ వెల్లడించారు. శనివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ.. ఎంసెట్ కౌన్సెలింగ్లో ఉన్నత విద్యామండలి తన పరిధిని దాటి వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నేపథ్యంలో ఏర్పడిన గందరగోళానికి ఉన్నత విద్యామండలే కారణమని ఆయన విమర్శించారు. రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.