‘కొలువుల కొట్లాట’ను మరోరోజు పెట్టుకోండి | police referred to the TJAC | Sakshi
Sakshi News home page

‘కొలువుల కొట్లాట’ను మరోరోజు పెట్టుకోండి

Published Wed, Nov 22 2017 3:16 AM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM

police referred to the TJAC

హైదరాబాద్‌: కొలువుల కొట్లాట సభను ఈ నెల 30న కాకుండా మరోరోజు పెట్టు కోవాలని టీజేఏసీ సభ్యులకు పోలీసులు సూచించారు. టీజేఏసీ ఈ నెల 30న సరూర్‌నగర్‌ ఎల్బీ స్టేడియంలో కొలువుల కొట్లాట సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో మంగళవారం టీజేఏసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సభకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, స్పోర్ట్స్‌ అథారిటీ వారు అనుమతి ఇచ్చారని, ఎల్‌బీనగర్‌ డీసీపీ మాత్రం వర్కింగ్‌ డే కాకుండా సెలవు రోజున  నిర్వహించుకోవాలని సూచించారని వారు సీపీకి తెలిపారు. సీపీ కూడా 30న కాకుం డా మరో రోజున సభను పెట్టుకోవాలని వారికి సూచించారు. సీపీని కలసినవారిలో టీజేఏసీ ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, వెంక ట్‌రెడ్డి, శర్మ, చల్మారెడ్డి తదితరులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement