ఫీజు రీయింబర్స్‌మెంట్ కు సంబంధించిన స్థానికత అంశంపై స్పష్టత వచ్చాకే ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఆలోచన చేసే అవకాశం ఉందని తెలంగాణ విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
నాలుగు రోజుల్లోగా సుప్రీంకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ కు సంబంధించిన స్థానికత అంశంపై స్పష్టత వచ్చాకే ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఆలోచన చేసే అవకాశం ఉందని తెలం గాణ విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్ విషయంలో అంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే పరి స్థితి లేదని పేర్కొన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అం శం తేలాకే దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుం టామని వెల్లడించాయి. మరోవైపు ఎంసెట్ ప్రవేశాలు పూర్తి చేయడం, తరగతులను ప్రారంభించే అంశంపై గడువు కోరుతూ నాలుగు రోజుల్లోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చే యనున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఈ పిటిషన్‌పై న్యాయశాఖ పరిశీలన జరుపుతోందన్నారు. అది పూర్తి కాగానే కోర్టులో దాఖలు చేస్తామన్నారు. వీలైతే శుక్రవారం, లేదంటే సోమ, మంగళవారాల్లో ఈ పిటిషన్‌ను వేయనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కౌన్సెలింగ్, ప్రవేశాల ప్రక్రియ అంతా ఈనెల 29వ తేదీలోగా పూర్తి చేయాలి. ఆగస్టు 1వ తేదీనుంచి తరగతులను ప్రారంభించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. పైగా ఇతర అనేక సమస్యలున్నందున ప్రవేశాల పూర్తికి గడువును కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్లు తెలిపారు.