జేఎన్‌టీయూ, న్యూస్‌లైన్ : అనంతపురంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు రెండో రోజు మంగళవారం కూడా అడ్డుకున్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రాలకు సమైక్యవాదులు ఉదయం ఆరు గంటలకే చేరుకుని కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులను వెనక్కు పంపించేశారు.
మొదటి రోజు జరగనందున కనీసం రెండో రోజైనా జరుగుతుందనే ఆశతో కౌన్సెలింగ్ వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. పాలిటెక్నిక్ కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో కౌన్సెలింగ్‌కు ప్రిన్సిపాల్ మాత్రమే హాజరయ్యారు. ఎస్కేయూలో కౌన్సెలింగ్ కేంద్రానికి తాళం వేసి.. విద్యార్థులను వెనక్కు పంపారు.
ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమ్మెలో ఉన్నారని.. ఒక్కడితో కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యం కాదన్నారు. కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకుంటున్నారన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామని, అక్కడి నుంచి నిర్ణయం రాగానే మొదలు పెడతామన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు కౌన్సెలింగ్ తేదీలు పత్రికల్లో ప్రకటించే వరకు కౌన్సెలింగ్‌కు రావద్దన్నారు.
రెండో రోజూ ఎంసెట్ కౌన్సెలింగ్ బంద్
Published Wed, Aug 21 2013 3:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement