samaikandhara
-
దీక్షలు విజయవంతం
మడకశిర, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా నాలుగు రోజులుగా పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయని మడకశిర నియోజకవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు ఎల్ఎం మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దీక్షల్లో వీరు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్,టీడీపీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు కృషి చేస్తుండగా, వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర కోసం పోరాడుతోందన్నారు. వైఎస్ జగన్ చేస్తున్న సమైక్య పోరాటానికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. నాలుగు రోజులుగా చేస్తున్న దీక్షలు విజయవంతమయ్యాయని వారు తెలిపారు. ఈ దీక్షలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఓంకార్‌స్వామి, కొంకల్లు హనుమంతరాయప్ప, సోమనాథ్, మాదన్న, హనుమంతరాయప్ప, శెట్టూరు మండల మహిళా విభాగం కన్వీనర్ మంజుళమ్మ తదితరులు పాల్గొన్నారు. నాలుగో రోజు కొనసాగిన రిలే దీక్షలు రాయదుర్గంరూరల్: రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజు కూడా కొనసాగాయి. స్థానిక వినాయక సర్కిల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో శుక్రవారం పార్టీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి దీక్షలను ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ మహిలా విభాగం నాయకురాళ్లు అనూరాధ, సాఫియా ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 25 మంది మహిళలు దీక్షలో పాల్గొన్నారు. వీరికి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పీఎస్ మహేష్, రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల కన్వీనర్లు మల్లికార్జున, అశ్వర్థరెడ్డి తదితరులు సం ఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విభజన వాదుల దిష్టి బొమ్మలను దహ నం చేసిన అనంతరం, వారు మాట్లాడు తూ సమైక్యరాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమని, విడిపోతే రెండు ప్రాంతాలు తీవ్రం గా నష్టపోతాయని తెలిపారు. సమైక్యం కోరుకున్నందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దారుణమన్నారు. విభజన పాపం టీడీపీదే గుంతకల్లు: రాష్ట్ర విభజన జరిగితే ఆ పాపం టీడీపీకే దక్కుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎన్. భీమలింగప్ప తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ స్థానిక మునిసిపల్ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ నాయకులు డి.బాబయ్య, పి.లక్ష్మినారాయణ రెడ్డి, డి.మోహన్, బి. లాలెప్ప తదితరులు రిలే దీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన బిల్లుపై చర్చకు ముందే సమైక్య తీర్మానం చేయాలని పట్టుబట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడానికి కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వెనుకాడలేదన్నారు. ఈ రెండు పార్టీలను తెలుగు ప్రజలు క్షమించరన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో వైఎస్ఆర్సీపీ వెన్నంటి అన్ని పార్టీలు నడవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రవుంలో సేవాదళ్ వుండల కన్వీనర్ జయురామిరెడ్డి, మైనార్టీ నాయుకులు గఫూర్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల జేఏసీ సదస్సుకు వితరణ
కడప రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధన కోసం న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన స్థానిక కేఎస్ఆర్ కల్యాణమండపంలో జరిగే సదస్సుకు సమైక్యాంధ్ర జేఏసీ జిల్లా కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి వితరణ ఇచ్చారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఎదుట దీక్షలు చేపడుతున్న శిబిరాన్ని శుక్రవారం సింగారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈనెల 24వ తేది కడప కేఎస్ఆర్ కల్యాణ మండపంలో జరిగే సీమాంధ్ర న్యాయవాదుల సదస్సుకు రూ.10వేలు విరాళాన్ని కడప బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి న్యాయవాదులు పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర కోసం పోరాడుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. తమవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం ఈనెల 24వ తేదిన సీమాంధ్ర న్యాయవాదులు నిర్వహించే సదస్సు జయప్రదం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాదుల జేఏసీ నాయకులుపాల్గొన్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
వైవీయూ, న్యూస్‌లైన్ : జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా అవార్డులు పొందిన జిల్లాకు చెందిన ఉర్దూ ఉత్తమ ఉపాధ్యాయులకు యునెటైడ్ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఉమా) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం నగరంలోని డీసీఈబీ సమావేశ మందిర ప్రాంగణంలో ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశానికి నిర్ధేశకులు ఉపాధ్యాయులేనన్నారు. మంత్రి తనయుడు అషఫ్ ్రమాట్లాడుతూ వచ్చేయేడాది కూడా సమైక్యాంధ్రలోనే అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఉమా అధ్యక్షుడు షంషుద్దీన్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి అవార్డులు పొందడం గొప్పవిషయమన్నారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఎస్.ఏ. హకీం, ఇర్షాద్‌అహ్మద్, అఫ్జల్‌బాషా, అంజద్‌అలీలను అతిథులు దుశ్శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పర్యవేక్షకుడు ఫరూఖ్‌అహ్మద్, ఉమా ఉపాధ్యక్షుడు మహబూబ్‌ఖాన్, సభ్యులు దేవదానం, ఖాదర్, గౌస్‌పీర్, మహబూబ్‌బాషా, ఇంతియాజ్, సుకుమార్, చాన్‌బాషా పాల్గొన్నారు. -
కిరణ్, చంద్రబాబు కళ్లు తెరవాలి: జగన్
హైదరాబాద్: సమైక్య రాష్ట్రం విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని విజ్ఞప్తి చేశారు. తన నివాసం లోటస్‌పాండ్‌లో ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను అడ్డుకోకపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రం ఎడారి అవుతుందని హెచ్చరించారు. చదువుకున్నవారు హైదరాబాద్ వస్తే ప్రతి పిల్లవాడు చంద్రబాబును, కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టేపరిస్థితి వస్తుందన్నారు. కేబినెట్ నోట్ తయారు కాకముందే శాసనసభను సమావేశపరిచి సమైక్యరాష్ట్రం తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు. ఈరోజు తాము మరోసారి గవర్నర్ నరసింహన్‌ను కలిసినట్లు చెప్పారు. శాసనసభను సమావేశపరచమని కోరినట్లు తెలిపారు. కేబినెట్ నోట్‌కు ముందే అసెంబ్లీని సమావేశపరిచి, సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఇదివరకే కోరామని చెప్పారు. కానీ తమ రోదన అరణ్యరోదనే అయిందన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళతారు. విభజించండి అని నిరాహార దీక్ష చేస్తారు. ఈ పేరుతో ఆయన అక్కడ ఎంతమందిని కలిశారో తెలియదన్నారు. ఇది మన ఖర్మ అన్నారు. అదే సమయంలో ఇక్క డ కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలను ఒక్కొక్కరిని కలుస్తారు. వారిని బెదిరించి సమ్మె విరమించే ప్రయత్నాలు చేస్తారు. మొన్నటిదాకా సమైక్యత అన్న కేంద్ర మంత్రులు, ఎంపిలు ఇప్పుడు ప్యాకేజీలు అడిగే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ఉద్యమాన్ని వీరు ఎందుకు నీరు గారుస్తున్నారో అర్ధం కావడంలేదంటున్నారు. వీళ్ల తీరు చూస్తుంటే.. వీళ్లు మనుషులేనా అని అనిపిస్తోందన్నారు. సోనియాకు దిగ్విజయ్ సింగ్ కుడి భుజమైతే, కిరణ్ ఎడమ భుజం అన్నారు. సమైక్య ఉద్యమం తగ్గిపోయిందని ఒకవైపు దిగ్విజయ్ అంటారు, మరోవైపు ఉద్యమం నుంచి ఒక్కొక్కరినీ తప్పించేలా కిరణ్ వ్యవహరిస్తారని విమర్శించారు. యూపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ తనకు కుమారుడిని ప్రధానిని చేయడానికి రాష్ట్రాన్ని విభజించడానికి సిద్దపడ్డారని విమర్శించారు. ఆమె మన అందరి పిల్లల జీవితాతో ఆడుకుంటున్నారన్నారు. చంద్రబాబు అడ్డగోలుగా ఆమెకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. సోనియాకు కావలసిన విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ఎంత చెబితే అంతే. ఆమె చెప్పిన విధంగా చేస్తారని చెప్పారు. కిరణ్, చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని కోరారు. కలిసిరండని విజ్ఞప్తి చేశారు. సమైక్యతకు అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం మూడు పార్టీలని తెలిపారు. ఇప్పటికై చంద్రబాబు సిగ్గుతెచ్చుకొని ఈ మూడు పార్టీలతో కలవాలని పిలుపు ఇచ్చారు. ఆ మూడు నాలుగు, అయిదు పార్టీలు అవ్వాలని అన్నారు. ఈ నెల 26న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యమ బాటను ఉద్ధృతం చేస్తాం, చివరిదాకా పోరాడుతామని చెప్పారు. సమైక్య శంఖారావానికి ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. రేపు సిఎం ఇంటి వద్ద తమ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారని చెప్పారు. స్పీకర్‌ను కలుస్తారన్నారు. సమైక్యత అంటే మూడు ప్రాంతాలను కలిపి ఉంచాలి. సమైక్యం అంటే అందులో తెలంగాణ ఉంటుంది, రాయలసీమ ఉంటుంది, కోస్తాంధ్ర ఉంటుంది అని వివరించారు. 3 ప్రాంతాలకూ న్యాయం జరిగేలా తాను ముదుంటానని చెప్పారు. అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలను పూర్తిగా పక్కననపెట్టమని సలహా ఇచ్చారు. వ్యవస్థల్లో నిజాయితీని తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమ రాజీనామాలు, తమ పార్టీలో చేరినవారి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామని చెప్పారు. రేపు ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డితో తాను మరో లేఖను పంపిస్తున్నానన్నారు. కోర్టు అడ్డంకుల వల్ల ఢిల్లీకి రాలేకపోయానని, రాజీనామాను ఆమోదించాలని అందులో కోరతానని చెప్పారు. ఎంపి లగడపాటి రాజగోపాల్ ఏదో అన్నారని తాను మాట్లాడటం మొదలు పెడితే బాగుండదన్నారు. -
కిరణ్, చంద్రబాబు కళ్లు తెరవాలి
-
రోగులకు సమ్మె చీకట్లు
చీరాల, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విద్యుత్ జేఏసీ చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరడంతో కరెంట్ కష్టాలు తీవ్రమయ్యాయి. రోజూ ఉదయం 6 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. అలాగే రాత్రుళ్లు మధ్యమధ్యలో కరెంట్ తీయడంతో చేతివృత్తులు, చిరువ్యాపారులు, వ్యాపార సముదాయాలు, వైద్యశాలలు, మంచినీటి కేంద్రాలు, రైతులు, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో డీజిల్ కొరతతో జనరేటర్లు నిలిపి వేశారు. అత్యవసర వార్డుల్లో ఉన్న ఇన్వర్టర్లు సైతం పని చేయడం లేదు. గర్భిణులు, బాలింతల కోసం ఏర్పాటు చేసిన సీమాంక్ సెంటర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ఉన్న బాలింతలు, పసి పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. గదుల్లోకి గాలి రాకపోవడంతో ఉక్కపోత, ఊపిరి ఆడకపోవడంతో బాలింతలు, చిన్న పిల్లలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. దీంతో వార్డుల్లో ఉండాల్సిన వారు ఆరుబయటకు వచ్చి చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రోగుల పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది. ప్రభుత్వ వైద్యశాలల్లోని వార్డుల్లో ఉండలేక చాలా మంది రోగులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ చీరాల ఏరియా వైద్యశాలే దిక్కు. పేదలు, మధ్య తరగతి వారు నిత్యం వివిధ రకాల చికిత్సల కోసం చీరాల ఏరియా వైద్యశాలకు వస్తుంటారు. వంద పడకల ఆస్పత్రయినా చీరాల ఏరియా వైద్యశాలలో ప్రసూతి, కాన్పుల విభాగం, చిన్న పిల్లలకు ఐసీయూకేర్ యూనిట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పలు రకాల శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు రోగులకు ప్రత్యేకంగా వార్డు సదుపాయాలున్నాయి. పదుల సంఖ్యలో వైద్యులు, వందల సంఖ్యలో వివిధ విభాగాల సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. ధర్మాస్పత్రయినా చీరాల ఏరియా వైద్యశాలలో వసతులు మాత్రం ఆశించిన మేర రోగులకు అందడం లేదు. విద్యుత్ సమస్య ప్రధానంగా వేధిస్తోంది. విద్యుత్ కోతలతో జనరేటర్ ఉన్నప్పటికీ దాన్ని వినియోగించకపోవడంతో శస్త్ర చికిత్సలు, కాన్పులు చేయడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలను కూడా సక్రమంగా అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలానే వ్యవసాయ సీజన్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల ద్వారా వరి సాగవుతోంది. అయితే విద్యుత్ సరఫరా లేక రైతులు సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. -
సమైక్యాంధ్రపై మాట్లాడే అర్హత టీడీపీ నాయకులకు లేదు
ధర్మవరంఅర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం 60 రోజులుగా ఉధృతంగా జరుగుతున్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా డ్రామాలు అడుతున్నారని, వారికి సమైక్యాంధ్ర గురించి మాట్లాడే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్‌హక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విధంగా జేఏసీ నాయకులు సమైక్య రాష్ట్రం కోసం లేఖ తెస్తే తొలి సంతకం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదే విధంగా సంతకం చేయాలని డిమాండ్ చేశారు.ఇకనైనా సమైక్య రాష్ట్రం కోసం లేఖ ఇచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సమైక్య ఉద్యమాన్ని ముందుకు నడిపిద్దాం కనగానపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గ సమన్వకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నియోజకవర్గంలోని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో వారు పర్యటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. కనగానపల్లిలో శంకరనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమతం మేరకు అక్టోబర్ 2నుంచి నవంబర్ 1 వరకు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. అక్టోబర్ 2 నుంచి ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ నిరాహార దీక్షలతో పాటు ధర్నాలు, బైకు ర్యాలీలు చేపడతామన్నారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కమిటీ సభ్యుడు అంకెలక్ష్మన్న, యూత్ కన్వీనర్ ముకుందనాయుడు, కనగానపల్లి సొసైటీ అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి, మండల కన్వీనర్ నాగముని, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందే
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో చేసిన ఏకగ్రీవ తీర్మానంతో కూడిన పుస్తకాన్ని మంగళవారం ఎన్జీవోల దీక్షా శిబిరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌పీవీ జిల్లా చైర్మన్ సీకేబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో గత వారంలో జిల్లావ్యాప్తంగా 1366 పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారన్నారు. క్షేత్ర స్థాయిలోని ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేశారన్నారు. దీన్ని పుస్తక రూపంలో తయారు చేసి కేంద్ర, రాష్ట్ర పెద్దలకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, భారత ప్రధాని మన్మోహన్సింగ్, డిఫెన్స్ మినిస్టర్ ఏకే ఆంటోని, రాష్ట్ర గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కాపీలు పంపనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ చంద్రమౌళి, రవాణా శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ రవికుమార్, ఎస్‌ఆర్‌పీవీ కన్వీనర్లు కృష్ణమనాయుడు, విజయసింహారెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
కదం తొక్కుతున్న సమైక్యవాదులు
సాక్షి, అనంతపురం : సమైక్యవాదులు అవిశ్రాంతంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. లక్ష్యం చేరే వరకు పోరుబాటను వీడేది లేదని ఎలుగెత్తి చాటుతున్నారు. 48వ రోజైన సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగాఉద్యమాన్ని హోరెత్తించారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోనూ బలోపేతం చేయాలని సమైక్యాంధ్ర సంయుక్త జేఏసీ కన్వీనర్, డీఆర్ఓ హేమసాగర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, తహశీల్దార్లు, ఆర్ఐలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. నగరంలో మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ప్లకార్డులు మెడలో వేసుకుని భిక్షాటన చేశారు. జాక్టో, నీటి పారుదల, పీఏసీఎస్, పంచాయతీరాజ్, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీలు, బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నగరంలోని ఉపాధ్యాయులు తపోవనం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు రోడ్లపైనే విద్యాబోధన చేసి నిరసన తెలిపారు. 48 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయులకు జర్నలిస్టు జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఎస్కేయూలో విద్యార్థుల రిలే దీక్షలు 48వ రోజూ కొనసాగాయి. ఆకుతోటపల్లికి చెందిన వందలాది మంది మహిళలు గ్రామం నుంచి ఎస్కేయూ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ రాస్తారోకో చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు సైతం ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామాంజినేయులు డిమాండ్ చేశారు. ఊరూ వాడ తగ్గని జోరు ధర్మవరంలో ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో సమైక్యాంధ్ర జేఏసీ కో-కన్వీనర్ డాక్టర్ సుమంత్‌కుమార్ గుండెపోటుతో మరణించారు. సమంత్ కుమార్ మృతదేహాన్ని పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉంచి సమైక్యవాదులు నివాళులర్పించారు. పట్టణంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జేఏసీ నాయకులు రోడ్డుపై టీ అమ్ముతూ నిరసన తెలిపారు. గిరిజన మహిళలు రోడ్లపై నృత్యాలు చేశారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించి... వాహనాలను అడ్డుకున్నారు. గుత్తిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. రూ.28,402 వసూలైంది. జేఏసీ ఆధ్వర్యంలో కరిడికొండ వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. న్యాయవాదులు జాతీయ రహదారిపై మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ నాయకుల వాహనాలకు దారి ఇవ్వలేదన్న ఉద్దేశంతో వారు.. జేఏసీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికులు పొర్లుదండాలు పెట్టారు. పామిడిలో సమైక్యవాదులు రోడ్డుపైనే ఆసనాలు వేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు జలదీక్ష చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల ప్రదర్శన, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు రహదారిపై ఆందోళన చేశారు. కదిరిలో చర్చి ఫాదర్లు, క్రెస్తవులు రిలే దీక్షలు చేపట్టారు. రోడ్డుపైనే ఆటా పాట నిర్వహించారు. కదిరి చెరువులో సమైక్యవాదులు జలదీక్ష చేపట్టారు. తలుపులలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు ‘సమైక్యాంధ్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మడకశిరలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. అమరాపురంలో ఉపాధ్యాయులు గడ్డి తింటూ, పుట్టపర్తిలో సమైక్యవాదులు ఎద్దులబండి లాగి నిరసన తెలిపారు. పెనుకొండలో స్కూటర్ ర్యాలీ, గోరంట్ల, సోమందేపల్లిలో ర్యాలీలు చేపట్టారు. రాయదుర్గంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు.‘కేసీఆర్ వికృతరూపం’ నాటికను ప్రదర్శించారు. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. కణేకల్లులో ఎన్జీవోలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. రాప్తాడులో ఉపాధ్యాయులు వినూత్న నిరసన తెలిపారు. ఆత్మకూరులో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కల్లూరు, గార్లదిన్నెలో సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, మునిసిపల్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య సంఘీభావం తెలిపారు. పెద్దవడుగూరులో జేఏసీ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉరవకొండలో విద్యార్థులు రోడ్లపైనే చదువుతూ నిరసన తెలిపారు. గడేహోతూరు, చిన్నహోతూరు గ్రామస్తులు ఉరవకొండకు చేరుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. సమైక్యవాదులు జేసీ దివాకరరెడ్డి బస్సులను అడ్డుకున్నారు. కొనకొండ్లలో పీహెచ్సీ వైద్యులు రోడ్డుపైనే వైద్య పరీక్షలు నిర్వహించి నిరసన తెలిపారు. జీడీపల్లిలో జేఏసీ నాయకులు జలదీక్ష చేశారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. -
ప్రతిధ్వనిస్తున్న.. సమైక్య నినాదం
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: రోజులు గడుస్తున్న కొద్దీ ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమ నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంది. సమైక్యమే తమ శ్వాస.. ఊపిరి అంటూ విభిన్నరూపాల్లో సమైక్యవాదులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల వైఖరిని తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్జీవో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక లోకంతో పాటు పార్టీలకతీతంగా అన్ని వర్గాలు స్వచ్ఛందంగా సమైక్యసమరంలో పాల్గొంటున్నాయి. 47వ రోజు ఆదివారం కూడా సమైక్య ఆందోళనలతో ‘అనంత’ అట్టుడికింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. పాలన పూర్తిగా స్తంభించిపోయినా సమైక్యమే తమ అభిమతమంటూ సమరోత్సాహంతో ముందుకు పోతున్నారు. ‘తెలుగు తేజం’ యాత్రతో ‘అనంత’లో అడుగుపెట్టిన లోకసత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణకు సమైక్యవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలతో పాటు పొలిటికల్, నాన్‌పొలిటికల్ జేఏసీ నేతలు భారీ సంఖ్యలో జేపీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. భారీగా పోలీసు బలగాలు మోహరించినా ఇరువర్గాల నడుమ తోపులాట జరిగింది. సుమారు మూడు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రత గుర్తించిన జేపీ.. చివరికి జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదం చేశారు. అంతేకాకుండా తెలుగుతేజం యాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని పంచాయతీరాజ్ జేఏసీ నేతలు ఇంజనీర్స్‌డేను జిల్లా పరిషత్ ఎదురుగా చేపట్టిన రిలేదీక్షా శిబిరంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ, డీఈ, ఏఈలను ఘనంగా సన్మానించారు. మునిసిపల్ ఉద్యోగ జేఏసీ రిలేదీక్ష కొనసాగిస్తూ... సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు మంచి బుద్ధి ప్రసాదించి ఉద్యమంలో పాల్గొనేలా చేయాలని కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. ముస్లింలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రిలేదీక్షల్లో పాల్గొన్న వారికి సంఘీభావం ప్రకటించారు. జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జాక్టో, హంద్రీ-నీవా ఉద్యోగులు, వాణిజ్యపన్నులశాఖ జేఏసీ, మెడికల్ జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు రిలేదీక్షలు కొనసాగించారు. ధర్మవరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల రిలేదీక్ష 47వ రోజూ కొనసాగింది. సమైక్యవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముదిగుబ్బ, పామిడి, పుట్టపర్తి, రొద్దం, గుత్తి, అమడగూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల రిలేదీక్షలు కొనసాగాయి. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ, ఉద్యోగ సంఘాల జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి. సమైక్యాంధ్ర నినాదాలతో రజకులు రోడ్డుపైనే దుస్తులు ఉతికి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో వివిధ సంఘాల నేతలు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగిస్తూ సమైక్య ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయులు దీక్షలలో కొంత మంది శీర్షాసనం వేసి, మరికొందరు ఖోఖో ఆడి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఓడీ చెరువులో సమైక్యవాదులు బైక్ ర్యాలీతో పాటు రాస్తారోకో నిర్వహించారు. పెనుకొండలో ఆర్డీఓ, తహశీల్దార్లు, వీఆర్వోలు రిలే దీక్షలకు కూర్చుని సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగించారు. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు రిలేదీక్షలు కొనసాగించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు గోరంట్లలో సమైక్యసెగ తాకింది. సోమందేపల్లిలో సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై నాగినాయుని చెరువు పంచాయతీకి చెందిన ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. రాయదుర్గంలో మహిళా ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేశారు. ఎల్ఐసీ ఏజెంట్లు రిలే దీక్ష లో పాల్గొన్నారు. వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించారు. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా శింగనమల, కనగానపల్లిలో సమైక్యవాదులు జలదీక్ష చేశారు. రాప్తాడులో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు పొర్లుదండాలతో నిరసన తెలిపారు. పుట్లూరు, గార్లదిన్నె మండలం కల్లూరులో ప్రజలు సమైక్యర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో ముస్లింలు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారంగా ఏర్పడి సమైక్యవాదాన్ని వినిపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, ముస్లింలు రిలే దీక్షలు చేశారు. హిందీ పరీక్షలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తాడిపత్రి సమీపంలోని పెన్నానదిలో అధికారులు, సిబ్బంది నిరసన తెలిపారు. యాడికిలో స్థిరపడ్డ రాజస్తాన్వాసులు సమైక్యాంధ్ర నినాదాలతో రిలేదీక్షలు చేశారు. ఉరవకొండలో రిలేదీక్షలు కొనసాగుతుండగా, ఆర్టీసీ జేఏసీ నేతలు ఉరవకొండ నుంచి పెన్నహోబిళం వరకు పాదయాత్ర చేశారు. -
పల్లెవాణి ఢిల్లీలో ప్రతిధ్వనించాలి
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పల్లె ప్రాంతాలకు తీసుకెళ్లి గ్రామీణులను మమేకం చేసినప్పుడే కేంద్రం దిగి వస్తుందని అభిప్రాయపడిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులందరూ, ముఖ్యంగా ఉపాధ్యాయులు గ్రామ సభలు నిర్వహించి విభజన వల్ల మనకు జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం స్థానిక జిల్లాపరిషత్ సమావేశ భవనంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 46 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా పాలకుల్లో స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంలో భాగంగా జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 16వ తేదీన సర్పంచు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. చేసిన తీర్మానాలను 8 ప్రతులుగా చేసి దేశ ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌కు వేర్వేరుగా పోస్ట్ చేయాలన్నారు. మిగతా ఒక తీర్మాన ప్రతిని పంచాయతీ రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు. మండల స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాయలసీమతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అత్యంత వెన కబాటుతో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసిన తర్వాతే విభజన గురించి ఆలోచించాలని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో సూచించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాల సమస్య తీవ్ర రూపం దాల్చుతుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో కూడా రాయలసీమ ప్రజలు తీవ్ర నష్టాలకు గురవుతారన్నారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేద్దాం కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని డీఆర్ఓ వేణుగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమావేశానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈశ్వర్, జెడ్పీ డిప్యూటి సీఈఓ జయరామిరెడ్డి, ఏఓ భాస్కర్‌నాయుడు, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి, పీఆర్ మినిస్ట్రీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దస్తగిరిబాబు, ఈఓఆర్డీల సంఘం నాయకులు ఏలీషా, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు తిమ్మన్న, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, అన్ని శాఖల ఉద్యోగులు హాజరయ్యారు. -
20 నుంచి మార్కెటింగ్ శాఖ జేఏసీ నిరవధిక సమ్మె
విజయవాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మె చేపడుతోంది. శనివారం కృష్ణాజిల్లా గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో 13 జిల్లాలకు చెందిన మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులు, సీఎంఎఫ్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ ఉద్యోగుల సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ రామాంజనేయులు (కడప జేడీ) మాట్లాడుతూ, ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మె చేయడానికి సమావేశం తీర్మానించిందన్నారు. ఎన్జీఓలు ఎప్పటివరకు బంద్ నిర్వహిస్తారో అప్పటివరకు మార్కెటింగ్ శాఖ జేఏసీ నిరవధిక సమ్మెలో కొనసాగుతుందన్నారు. ఈ నెల 17వ తేదీన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు, ప్రిన్సిపల్ కార్యదర్శికి నిరవధిక సమ్మె నోటీసులను అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చే వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యాలయాలను మూసివేసి, విధులను బహిష్కరిస్తామన్నారు. 26 మందితో జేఏసీ 26 మంది ఉద్యోగులతో ఏర్పడి న జేఏసీ చైర్మన్‌గా కడప జేడీ రామాంజనేయులు, కో- చైర్మన్లుగా ఆర్. లక్ష్మణుడు (వైజాగ్ జేడీ), డెప్యూటీ డెరైక్టర్ సుధాకర్ (వైజాగ్), రామ్మోహన్‌రెడ్డి (అనంతపురం కార్యదర్శి), కె. జయశేఖర్ (విజయవాడ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), కన్వీనర్‌గా డెప్యూటీ డెరైక్టర్ ఎం. దివాకరరావు (విజయవాడ), కో-కన్వీనర్లుగా శ్రీనివాస్, శ్రీధర్, దాస్, చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, కిశోర్, గోవిందులతోపాటు ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరు చొప్పున కార్యవర్గ సభ్యులుంటారు. -
తిరునగరిలో సమైక్య భేరి
తిరుపతి నగరం శుక్రవారం సమైక్య నినాదాలతో హోరెత్తింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లక్ష గళ సమైక్య భేరి మోగింది. జై సమైక్యాంధ్ర నినాదంఢిల్లీని తాకేలా ఉద్యమకారులు గర్జించారు. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. సాక్షి, తిరుపతి: సమైక్యగళంతో తిరునగరి అట్టుడికింది. ఉద్యమ వేడి ఢిల్లీని తాకేలా కుల, మత భేదం లేకుండా లక్షగళ ఘోషతో సమైక్య నినాదాన్ని వినిపించారు. వేర్పాటువాదాన్ని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. ఐక్యకార్యాచరణ సమితి, సాప్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో లక్షగళ సమైక్య భేరి మోగింది. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు. వివిధ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, యజమానులు తరలివచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు శాఖల అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కళాకారులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు లక్ష గళ సమైక్యభేరికి హాజరయ్యారు. ఉదయం 9గంటల నుంచి సమైక్యవాదులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. కళాకారులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. విద్యార్థులు వివిధ వేషధారణలో వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనలు చేశారు. పుంగనూరు నుంచి వచ్చిన చిన్నారులు కోలాటాలు అడుతూ జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కార్వేటినగరం సంస్థానం సంప్రదాయాలతో కళాకారులు కత్తులు చేతబట్టి ప్రదర్శన చేశారు. మిన్నంటిన జై సమైక్యాంధ్ర నినాదాలు లక్షగళ సమైక్య భేరిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు జై సమైక్యాంధ్ర నినాదాలతో గర్జించారు. జ్వోతి ప్రజ్వలన అనంతరం ఒక్కొక్కరు ప్రసంగిస్తూ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేర్పాటు వాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్య భేరికి కొందరు విద్యార్థులు భారీ జాతీయ జెండాతో హాజరయ్యారు. మరికొందరు సమైక్యాంధ్ర టోపీలు పెట్టుకుని తరలిరావడం కనిపించింది. రైల్యేస్టేషన్, గాంధీరోడ్డు, భవానీ నగర్, లీలామహల్, తుడా కూడలి సమైక్యవాదులతో కిక్కిరిసిపోయాయి. సమైక్య భేరికి హాజరైన వారికి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. రెండుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సమైక్య భేరికి కాంగ్రెస్ నేత అడ్డుచక్రం తిరుపతిలో శుక్రవారం చేపట్టిన లక్ష గళ సమైక్య భేరిని కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ నియోజకవర్గ నేత ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళా గ్రూపు సభ్యులెవరూ సమైక్య భేరిలో పాల్గొనకూడదని హుకుం జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే మహిళా సభ్యులు ఉద్యమంలో పాల్గొనలేదనే ప్రచారం సాగింది. తన మాట వినకుండా పాల్గొంటే ఇంటి పట్టాలు, రుణాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ నాయకుడ్ని తిరుపతికి రాకుండా అడ్డుకోవాలని సమైక్యవాదులకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సాప్స్ జేఏసీ నాయకులు అశోక్‌రాజు, కేఎల్.వర్మ, శేషగిరిరావు, మహ్మద్ఫ్రీ, సింధూజ, దినకర్, ఆనంద నాయుడు, శ్రీనివాస చౌదరి, హరినాథ్‌శర్మ, రంజిత్‌కుమార్, కేవీ.రత్నం, వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మా గుండెలతో చలిమంట వేసుకుంటారా? తెలుగుజాతిని విభజన పేరుతో విడగొట్టి మండుతున్న మా గుండెలతో చలి మంటేసుకుంటారా?. చిన్నారులు, వయోవృద్ధులు సైతం రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు తప్పించుకుని తిరుగుతుండడం బాధాకరం. వేర్పాటువాదుల స్వార్థానికి తెలుగుజాతిని రెండు ముక్కలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ధన, రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్న వారిని తరిమితరిమి కొడతాం. - సాప్స్ జేఏసీ తిరుపతి కన్వీనర్ డాక్టర్ సుధారాణి తెలంగాణలోనూ ఎక్కువ మంది సమైక్యాంధ్రే కోరుతున్నారు సీమాంధ్రతోపాటు తెలంగాణలోనూ అత్యధికంగా సమైక్యాం ధ్రను కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఈ విషయం తెలుస్తుంది. విభజన వల్ల ఇరు ప్రాంతాల వారు నష్టపోతారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. - ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఆర్డీవో రామచంద్రారెడ్డి విభజనతో విద్యార్థుల భవిత అంధకారమే రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 17 సెంటర్ యూనివర్సిటీలు, ఐఐటీ, త్రిపుల్ ఐటీ, మెడికల్ కళాశాలలు వంటి ఉన్నత విద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రం ముక్కలైతే సీమాంధ్ర విద్యార్థులకు ఉన్నత విద్య, టెక్నికల్ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాలకులు రాష్ట్ర సమైక్యతను ప్రకటించాలి. - ఎన్.విశ్వనాథరెడ్డి, రాయలసీమ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రజాప్రతినిధులు అడ్డుకోకపోవడం సిగ్గుచేటు తెలుగుజాతి, సీమాంధ్ర ప్రజల ఉనికికే ప్రమాదకరంగా మారిన విభజనను ప్రజాప్రతినిధులు అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధులు గల్లీకొస్తే ఢిల్లీ దాక తరిమికొట్టాలి. సమైక్య ప్రకటన వచ్చేవరకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. - సాప్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం యుద్ధ వాతావరణం సృష్టించడం బాధాకరం ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని విభజిస్తూ యుద్ధ వాతావరణం సృష్టిస్తుండడం బాధాకరం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విభజన పేరుతో చిచ్చురేపిన నాయకులకు బుద్ధి వచ్చేలా ఉద్యమం ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ అలుపెరగని పోరాటాలకు సిద్ధం కావాలి. - సాప్స్ ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి భవిష్యత్తు తరాల కోసమే ఉద్యమం సీమాంధ్రలో ఉద్యోగులు టీఏ, డీఏల కోసమే లేక వ్యాపారాల కోసమే ఉద్యమాలు చేయడం లేదు. భవిష్యత్తు తరాల కోసం రోడ్డుపైకి వచ్చారు. ఈవిషయాన్ని గుర్తించి ప్రజాప్రతినిధులు వారికి అండగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు. -జేఏసీ నేతలు విశ్వనాథ్‌రెడ్డి, రమేష్‌బాబు, కేఎస్.వాసు, వేంకటేశ్వర్లు -
సమైక్య స్ఫూర్తి
సాక్షి, కర్నూలు: సమైక్యాంధ్ర సాధన కోసం.. నెల రోజులుగా సాగుతున్న ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోంది. లక్షల మంది రోడ్లపైకి వచ్చి సమైక్య స్ఫూర్తి చాటుతున్నారు. తమ లక్ష్యం నెరవేరే వరకు ఎంతదాకానైనా పారాడేందుకు సిద్ధమేనన్న సంకేతాలను పాలకులకు పంపుతున్నారు. గత నెల 30న రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన విషయం విదితమే. అప్పటి నుంచి ప్రారంభమైన ఉద్యమం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువకులు, వృద్ధులు, చిన్నారులు.. అన్ని వర్గాలను కలిపింది. ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ తగిలేలా చేసింది. జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగులు శుక్రవారం స్థానిక బిర్లాగేట్ పూలే సర్కిల్లో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ముందుగా సంక్షేమభవన్ ఉద్యోగులతో కలిసి సర్కిల్లో మానవహారం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద సామూహిక రిలేదీక్షలో పాల్గొంటున్న ఉద్యోగులకు సంఘీభావం తెలుపడానికి వెళ్లిన ఎమ్మెల్సీ సుధాకర్ బాబు చేదు అనుభవం ఎదురైంది. రాజీమానాలు ఆమోదించుకుని వచ్చాకే మాట్లాడాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సీమాంధ్ర నేతల చిత్రపటాలకు చీర, సారెలతో సీమంతం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదోనిలో రాజకీయ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో సామూహిక రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు రోడెక్కి సమైక్య నినాదంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు పోస్టు కార్డులతో వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ దీక్షల్లో పాల్గొన్నారు. ముస్లీం, మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలో చేపట్టిన 48 గంటల బంద్ మొదటి రోజు బంద్ విజయవంతం అయింది. రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహరదీక్షలు జరిగాయి. ఆత్మకూరులో రజక వృత్తి సంఘం ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రహదారిపై దుస్తులు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. గాడిదలకు కేసీఆర్ మాస్క్‌ను ధరించి నిరసన వ్యక్తం చేశారు. కొలిమిగుండ్ల మండలంలో బెలుంగుహల సమీపంలో లారీ యాజమానుల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో ట్రాన్స్‌కో ఉద్యోగులు గుర్రాలపై స్వారీ చేస్తూ స్టేషన్ నుంచి బస్టాండు వరకు ర్యాలీ చేసి.. అనంతరం 18 మంది దీక్షలు చేపట్టారు. ఎమ్మిగనూరులో క్యాబర్సి శ్రీనివాసులు అనే వ్యక్తి సోమప్ప సర్కిల్లో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. దీక్షకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వై.రుద్రగౌడ్‌లు సంఘీభావం తెలిపారు. నంద్యాలలో ఆర్టీసీ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. పంచాయతీ రాజ్, విద్యుత్‌శాఖ, జేఏసీ, సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో రహదారిపై విద్యార్థినులకు పాఠాలు బోధించారు. -
జన హోరు
జిల్లా అంతటా సమైక్య నినాదం మార్మోగుతోంది. సమైక్య సెగ 30 రోజులుగా రగులుతూనే ఉంది. గురువారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, రోడ్డు దిగ్బంధాలు, వంటా-వార్పులతో ఊళ్లన్నీ హోరెత్తుతున్నాయి. లక్ష జన గర్జనతో కదిరి దద్దరిల్లింది. సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. పట్టణాలు, గ్రామాలు సమైక్య నినాదంతో మార్మోగుతున్నాయి. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో జేఏసీ ఆధ్వర్యంలో ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ నిర్వహించారు. ఈ గర్జనలో సమైక్య నినాదాలు మిన్నంటాయి. జై సమైక్యాంధ్ర అంటూ లక్ష గొంతులు నినదించాయి. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర, జిల్లా నాయకులు రమణారెడ్డి, జయరామప్ప, శంకర్‌తో పాటు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశం, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, డీఆర్డీఏ ఏపీడీ రామ్మూర్తిలతో పాటు కదిరి పరిసర ప్రాంతాల్లోని పది మండలాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్దారెడ్డి, ఖాసీంఖాన్, బావుద్దీన్, టీడీపీ నాయకులు అత్తార్‌చాంద్‌బాషా, దేవానంద్ వేదికపైకి వచ్చి నిలబడ్డారు. అయితే కొంతమంది న్యాయవాదులు జోక్యం చేసుకుని రాజకీయ పార్టీల నాయకులు వేదిక నుంచి కిందకు దిగాలని పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ దశలో ఆర్డీఓతో పాటు డీఎస్పీ దేవదానం, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ తబ్రేజ్ తమ సిబ్బందితో వేదికపై ఉన్న అందర్నీ కిందకు దింపేశారు. ఆ తరువాత జేఏసీ నాయకులను మాత్రమే అనుమతించారు. ఇదే వేదికపై ప్రసంగించిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి రవితేజ.. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల వైఖరిని తూర్పారబట్టారు. ఒకానొక దశలో వీరంతా జనంలోకి వస్తే.. దేంతో బుద్ధి చెబుతారని ప్రశ్నించగా... కొంత మంది యువకులు చెప్పులను చూపించారు. దీంతో మరోసారి గందరగోళం ఏర్పడింది. వేదిక ముందున్న వివిధ పార్టీల నాయకులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ ముగిసిన వెంటనే రవితేజను పోలీసులు వాహనంలో ఎక్కించుకుని పట్టణం దాటించారు. వాడవాడలా ఆందోళనలు అనంతపురంలో సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పశు సంవర్థక శాఖ ఉద్యోగులు సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి.. అక్కడ దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పీఆర్, జాక్టో, ఆర్ట్స్ కళాశాల, నీటిపారుదల, ఆర్అండ్బీ, ఐకేపీ, న్యాయవాదులు, ఆర్టీసీ, విద్యుత్‌శాఖ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నుంచి టౌన్ బ్యాంకు ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు నిలుపుదల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలేదీక్ష 29వ రోజుకు చేరింది. జేఏసీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి.. జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. బత్తలపల్లిలో సమైక్యవాదులు బంద్ నిర్వహించారు. తాడిమర్రిలో సమైక్యవాదులు బైక్ ర్యాలీ చేశారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ యూత్ విభాగంలో మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో జేఏసీ, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. రోడ్లపై వంటా-వార్పు చేపట్టారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు బస్సు యాత్ర చేపట్టారు. లేపాక్షిలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి.. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మడకశిరలో అంగన్వాడీ కార్యకర్తలు, జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయులు సర్వమత ప్రార్థనలు చేశారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకుల రిలేదీక్ష కొనసాగుతోంది. కొత్తచెరువులో అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఓడీసీలో రాస్తారోకో నిర్వహించి.. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నాయకుల రిలే దీక్ష కొనసాగుతోంది. సోమందేపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో చేశారు. రొద్దం, గోరంట్ల మండలాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష చేపట్టారు. రాయదుర్గంలో కేంద్ర ప్రభుత్వ తీరును కుంభకర్ణుడితో పోలుస్తూ.. ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిలేదీక్ష కొనసాగుతోంది. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక నూతన కమిటీ ఏర్పాటు చేశారు. కాగా సమైక్యాంధ్ర కోరుతూ.. ఆర్టీసీ కండక్టర్ నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గొడుగులతో ప్రదర్శన నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ రోడ్లపై చిత్త ఊడ్చి నిరసన తెలిపారు. ఐటీఐ విద్యార్థులు, విద్యుత్‌శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో విద్యుత్ శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ నాయకుడు రాజేష్ 48 గంటల దీక్ష చేపట్టారు. రాప్తాడులో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. నార్పలలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో రిలేదీక్ష చేపట్టారు. తాడిపత్రిలో క్రైస్తవులు శిలువ మోస్తూ.. ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రపై జేఏసీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర గీతాలాపన చేశారు. యాడికిలో జేఏసీ నాయకులు, వాల్మీకి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నేతలు చలో రాజ్‌భవన్ కార్యాక్రమం చేపట్టారు. ఉరవకొండలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. రోడ్డుపైనే తెలుగు భాషా దినోత్సవం జరిపారు. -
ప్రజా ఉద్యమం
సాక్షి ప్రతినిధి,నెల్లూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగిసిపడుతోంది. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 28వ రోజూ నిరసనలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారం దీక్షలు, రాస్తారోకోలు, వంటావార్పులు, వినూత్న ప్రదర్శనలు జరిగాయి. నెల్లూరులో వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ ఉద్యోగులు సంయుక్తంగా ప్రదర్శన నిర్వహించారు. మత్స్యకారులు వలలతో రాగా, రైతులు ట్రాక్టర్లతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇరిగేషన్ సిబ్బంది ముత్తుకూరు గేటు సెంటర్లో, న్యాయవాదులు జిల్లా కోర్టు సమీపంలో వంటావార్పు చేశారు. నక్కలోళ్ల సెంటర్లో జిల్లా మేదర సంఘం చేపట్టిన రిలే దీక్షలను మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఏనుగుపట్టాభిరామిరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎన్జీఓ భవన్లో రాష్ట్ర సమైక్య పోరాటవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ తులసిరెడ్డి హాజరయ్యారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ముత్తుకూరు బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహారదీక్షకు జిల్లా అధికారుల సంఘం సంఘీభావం తెలిపింది. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండులో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు నిర్వహించారు. వాకాడు మండలంలోని కల్లూరు అడ్డ రోడ్డు వద్ద వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉదయశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారో కో చేశారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో విద్యార్థులు నిరసన తెలిపా రు. టీపీగూడూరు మండలం చెన్నపల్లిపాళెం హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శన, రాస్తారోకో చేశారు. పొదలకూరులో ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. నేలటూరులోని ఏపీ జెన్కో విద్యుత్ ప్రాజెక్టు గేటు వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. సూళ్లూరుపేట జేఏసీ, కాంగ్రెస్ నేతలు కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియాగాంధీ మనసు మారాలని హోమం చేశారు. నాయుడుపేట విద్యుత్ సబ్‌డివిజన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పెళ్లకూరులో ఉ పాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. తడ మండలం చేనిగుంట వద్ద గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వారికి మద్దతు తెలిపారు. కా వలి మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, పొదుపు మహిళలు ర్యాలీ నిర్వహిం చారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్ విద్యార్థులు నోటికి నల్లగుడ్డలను కట్టుకొని మౌనప్రదర్శన చేశారు. కోవూరు ఎన్జీఓ హోమ్‌లో పంచాయతీ కార్యాదర్శులు, బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు ఎదుట ఉపాధ్యాయులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. వెంకటగిరిలో జేఏీ స ఆధ్వర్యంలో పాత బస్టాండు నుంచి కాశీపేట వరకు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. ఉదయగిరిలోని ఉపాధ్యా య, ఉద్యోగ, కార్మిక, జేఏసీ ఆధ్వర్యం లో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయగిరి బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నా యి. వీరికి టైలర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. మేకపాటి వెంకురెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు పంచాయతీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.మెరిట్స్ కళాశాల బీటెక్ చివ రి సంవత్సర విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలను కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి ప్రారంభించారు. వింజమూరు బస్టాండ్ సెంటరులో 21వ రోజూ రిలే దీక్షలు కొనసాగాయి. కలిగిరి పంచాయతీ బ స్టాండ్‌లో జరుగుతున్న ఉపాధ్యాయ జేఏసీ దీక్షలకు రాజన్నదళ వ్యవస్థాపకుడు ఎం.చిరంజీవరెడ్డి సంఘీభావం తెలిపారు. -
సమైక్యాంధ్రపై త్వరితంగా నిర్ణయం తీసుకోవాలి
రాయదుర్గం,న్యూస్‌లైన్: సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడకుండా రాజకీయ నాయకులు సమైక్యాంధ్రపై త్వరిత గతిన నిర్ణయం తీసుకోవాలని కన్నడ సినీ నటుడు ప్రేమ్‌కుమార్ కోరారు. సోమవారం ఆయన తన బంధువుల వివాహానికి రాయదుర్గం విచ్చేశాడు. ఈ సందర్భంగా అక్కడి చేరుకున్న సమైక్య రాష్ట్ర పరిరక్షణ సంఘం చైర్మన్ లక్ష్మీనారాయణ, నాయకులతో కలసి ఆయన సమైక్యాం ధ్రకు మద్దతు తెలిపారు. అనంతరం జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశం ఒక్కటిగా ఉండాలని, ఈ దిశగా రాష్ట్రాలు సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. గత 27 రోజులుగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఆందోళన చేస్తున్నారని, దీంతో అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. 30న శత్రువు చిత్రం విడుదల తాను నటించిన శత్రువు సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుందని ప్రేమ్‌కుమార్ చెప్పారు. ఇప్పటి వరకు తాను 18 చిత్రాల్లో నటించానని, వాటిలో నెనపెరలి, జతెజతెయలి, పల్లకి, చార్మినార్, చంద్ర, తదితర చిత్రాలు హిట్‌ను ఇచ్చాయన్నారు. తన తల్లిదండ్రులు బసప్ప, శంకుతల రాయదుర్గంలో పుట్టి పెరిగారని, తన బంధువులు ఇక్కడ ఉన్నారని చెప్పారు -
సమస్తం సమైక్యం
సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 23వ రోజు గురువారం మరింత ఉధృతమైంది. గుంటూరులో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సూళ్లూరుపేట సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం ప్రసన్న దీక్షకు సంఘీభావం తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలోని బోగ్యంవారిపల్లికి చెందిన యువకులు తిమ్మారెడ్డిపల్లి సెంటర్లో రాస్తారోకో, ధర్నా నిర్వహించి దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీరికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. కావలిలో జరిగిన ఆందోళనలో సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థి జేఏసీ, ఎన్జీఓ అసోసియేషన్, గెజిటెడ్ ఆఫీసర్లతోపాటు పలు రాజకీయపార్టీలు జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. ఉపాధ్యాయుల సమ్మెతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. నెల్లూరులో పెన్నా వంతెనపై సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు, ఆర్టీసీ ఎదుట ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. కస్తూర్బా కళాక్షేత్రంలో గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు నర్తకిసెంటర్లో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. విద్యుత్‌భవన్ ఎదుట విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు, పంచాయతీరాజ్‌శాఖలోని ఉద్యోగులందరూ జెడ్పీ కార్యాలయం ఎదుట ముఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకుని దీక్ష చేపట్టారు. కావలిలో ఆర్టీసీ ఉద్యోగ సంఘ జేఏసీ ఆధ్వర్యాన హైర్ బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు బొమ్మ సెంటర్లోని శిబిరంలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏరియా వైద్యశాల సెంటర్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో, ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉపాధ్యాయ సంఘాలు, ఆర్డీఓ కార్యాలయం వద్ద రెవెన్యూ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ కావలి పీజీ సెంటర్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ట్రంకురోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సంఘీభావం తెలిపారు. పలుచోట్ల జరుగుతున్న రిలేదీక్షల్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. రాత్రి స్థానిక ఏరియా వైద్యశాల వద్ద కోలాటం, నృత్యాలు ప్రమిదలతో నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో పాఠశాల విద్యార్థులు లక్ష్మీప్రియ థియేటర్ నుంచి వైఎస్సార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో, బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీస్‌స్టేషన్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. కలిగిరి ఆర్టీసీ బస్టాండు సమీపంలో వికలాంగులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విరమింపజేశారు. వరికుంటపాడులో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. గూడూరు జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులు, దివిపాళెం ఉన్నత పాఠశాల విద్యార్థులు పాటలకు నృత్యాలు వేస్తూ రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని నినదించారు. ఆర్టీసీ కార్మికులు నోటికి గుడ్డలు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. జర్నలిస్టులు ఎసై ్స బూట్లు తుడిచి సమైక్యానికి మద్దతు తెలపాలని కోరారు. కోట క్రాస్‌రోడ్డులో విద్యార్థి జేఏసీ నాయకులు చేపట్టిన నిరవధిక దీక్షలు రెండవ రోజూ కొనసాగాయి. చిట్టమూరు మండలం కొత్తగుంటలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టి మానవహారం ఏర్పాటు చేశారు. చిల్లకూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల జేఏసీ నిరసన తెలిపారు. పొదలకూరులో టీచర్లు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మనుబోలులో జాతీయ రహదారిపై విద్యార్థులు, గ్రామస్తులు రాస్తారోకో చేసి, మానవహారం నిర్వహించారు. నేలటూరులోని ఏపీ జెన్కో విద్యుత్ ప్రాజెక్టు ప్రధాన గేటు వద్ద విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండు గ ంటలకు పైగా ధర్నా చేశారు. ఆత్మకూరులో మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో వికలాంగులు, విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మండలంలోని కరటంపాడులో సర్పంచ్ దొరస్వామి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. -
బాబు డ్రామా బయటపడింది
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆడుతున్న డ్రామా బయటపడిందని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరులోని మైథిలీ థియేటర్ ఎదుట వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయన చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మొదటి నుంచి రెండు కళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారన్నారు. తెలంగాణ ఇస్తే తప్పేంటి అని ఆయన వ్యాఖ్యానించి సీమాంధ్రుల మనోభావాల మీద దెబ్బకొట్టారన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజలు, ఉద్యోగులు, నాయకులు రోడ్డెక్కి పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్ర విభజనకు మొగ్గుచూసి తెలంగాణపై ప్రేమచాటుకున్నారన్నారు. ఆయన రెండు నాలుకల బాబు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విసుగెత్తిన అన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌కు అండగా నిలవ డం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. బాబును తరిమి తరిమి కొడుతారు సీమాంధ్ర బస్సు పర్యటనకు వస్తే చ ంద్రబాబును ప్రజలు తరిమి తరిమి కొడుతారని ఎమ్మెల్యే ప్రసన్న అన్నారు. తెలంగాణ ఇస్తే తప్పేంటన్న చంద్రబాబు సీమాంధ్ర పర్యటనకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఆందోళనతో ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ సమయంలో వారి మనస్సుల్లోని జ్వాలాగ్ని చంద్రబాబును తిరిగి వెళ్లేంతవరకు తరుముతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద యగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేకే రెడ్డి, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ కోవూరు, ఇందుకూరుపేట మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌రెడ్డి, మావులూరి శ్రీనివాసులు రెడ్డి, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణయ్య, నాయకులు కలువ బాలశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ సంఘాల మద్దతు కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దీక్షకు మద్దతు తెలిపేందుకు ప్రజలు, సంఘాలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఇందుకూరుపేట మండలంలో వైఎస్సార్సీపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు దీక్షలో పాల్గొన్నారు. జిల్లా ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలాల మైనార్టీ నాయకులు, పొదుపులక్ష్మి గ్రూపుల సభ్యులు, విద్యార్థి జేఏసీ నాయకులు, ఐదు మండలాల ఎంపీడీఓలు, కోవూరు మండల ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, గీతాంజలి, బ్రహ్మయ్య, బ్రహ్మాస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు , కోవూరు టీఎంసీ కళాశాల విద్యార్థులు, న్యాయవాదులు, కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళశాల విద్యార్థులు, చక్కెర కర్మాగారం ఉద్యోగ సంఘాలు, ఎలక్ట్రికల్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు ప్రసన్నకు సంఘీభావం ప్రకటించారు. -
కౌన్సెలింగ్‌కు మళ్లీ బ్రేక్
భానుగుడి (కాకినాడ), న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వరుసగా మూడోరోజూ ఆటంకం తప్పలేదు. జేఎన్టీయూ కాకినాడలో ఈ నెల 19న ప్రారంభమైన కౌన్సెలింగ్ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత మూడురోజులుగా యూనివర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న విద్యార్థుల తల్లితండ్రులు బుధవారం సహనాన్ని కోల్పోయారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్ నిర్వహణకు అంగీకరించాలంటూ ఆందోళనకు దిగారు. ‘వీసీ డౌన్‌డౌన్..కలెక్టర్ దిగిరావాలి..కౌన్సెలింగ్ జరిపించాలి’ అంటూ జేఎన్టీయూకేలోని కౌన్సెలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నినాదాలు చే శారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వారి ఆందోళన కొనసాగింది. ఒక దశలో జేఎన్టీయూ జేఏసీ సభ్యులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాదులాట జరిగింది. పోలీసుల జోక్యంతో అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఆర్డీఓ జవహర్లాల్ నెహ్రూ ఇరువర్గాలతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. విద్యార్ధులు జేఎన్టీయూ ప్రాంగణంలో పెద్దగా నినాదాలు చేయడంతో వాతావరణం వేడెక్కింది. జేఎన్టీయూకే జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ నిర్వహించేది లేదని, రెండురోజుల పాటు ఉద్యోగులంతా పెన్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి నిర్ణయం జేఎన్టీయూకే వీసీ చేతుల్లో లేదని, కౌన్సెలింగ్‌ను జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తున్నందున ప్రస్తుత పరిస్థితిని వారికి విన్నవించి స్పష్టమైన ప్రకటన చేసేలా చర్యలు చూస్తామని జేఏసీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమం లో వెయ్యిమందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సర్పవరం ఎస్హెచ్ఓ వైఆర్కే శ్రీని వాస్ పరిస్థితిని సమీక్షించారు. ఇం త భారీస్థాయిలో నిరసన కార్యక్ర మం జరిగినా ఉన్నతాధికారులెవ రూ స్పందించక పోవడంపై తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు. బొమ్మూరు పాలిటెక్నిక్‌లోనూ నిలిచిన కౌన్సెలింగ్ రాజమండ్రి రూరల్ : బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ మూడవరోజు బుధవారం నిలిచిపోయింది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాలనుంచి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్నారు. అయితే కళాశాల లెక్చరర్లు తాము కౌన్సెలింగ్ విధులు నిర్వహించలేమని తేల్చి చెప్పేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ విలియం క్యారీ వద్దకు వచ్చి అడిగినప్పటికీ తాత్కాలిక సిబ్బందితో కౌన్సెలింగ్ చేయిస్తే వచ్చే ఇబ్బందులను వారికి వివరించారు. పాలిటెక్నిక్ కళాశాల రెగ్యులర్ లెక్చర ర్లు విధులు నిర్వహిస్తేనే కౌన్సెలింగ్ నిర్వహించాలని, తాత్కాలిక అధ్యాపకులతో నిర్వహించి ఏమైనా పొరపాటు జరిగితే తమపై తగు చర్యలు తీసుకుంటామని ఎంసెట్ కన్వీనర్ హెచ్చరించారని తెలిపారు. రాజమండ్రి ఇన్చార్జి ఆర్డీఓ నరసింహమూర్తి వచ్చి లెక్చరర్లతో మాట్లాడినా ప్రయోజనం లే కుండా పోయింది. తల్లిదండ్రులు, విద్యార్థులు మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచి చూసి చివరకు నిరాశతో వెనుదిరిగారు. కాగా బొ మ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో స మైక్యాంధ్ర ఉద్యమం అయ్యేవరకు కౌన్సెలింగ్ జరిగే అవకాశం లేదని కళాశాల వర్గాలే పేర్కొంటున్నాయి. -
రెండో రోజూ ఎంసెట్ కౌన్సెలింగ్ బంద్
జేఎన్టీయూ, న్యూస్‌లైన్ : అనంతపురంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు రెండో రోజు మంగళవారం కూడా అడ్డుకున్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రాలకు సమైక్యవాదులు ఉదయం ఆరు గంటలకే చేరుకుని కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులను వెనక్కు పంపించేశారు. మొదటి రోజు జరగనందున కనీసం రెండో రోజైనా జరుగుతుందనే ఆశతో కౌన్సెలింగ్ వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. పాలిటెక్నిక్ కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో కౌన్సెలింగ్‌కు ప్రిన్సిపాల్ మాత్రమే హాజరయ్యారు. ఎస్కేయూలో కౌన్సెలింగ్ కేంద్రానికి తాళం వేసి.. విద్యార్థులను వెనక్కు పంపారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమ్మెలో ఉన్నారని.. ఒక్కడితో కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యం కాదన్నారు. కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకుంటున్నారన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామని, అక్కడి నుంచి నిర్ణయం రాగానే మొదలు పెడతామన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు కౌన్సెలింగ్ తేదీలు పత్రికల్లో ప్రకటించే వరకు కౌన్సెలింగ్‌కు రావద్దన్నారు. -
సోనియా, బాబు డ్రామాలను ప్రజలు నమ్మరు
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేశామని టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను మభ్యపెడుతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇవ్వాలని తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఆమరణ నిరాహారదీక్ష మంగళవారానికి రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు చేసిన రాజీనామాలు చెల్లవన్నారు. తనతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశామన్నారు. రాజీనామాలు చేశామని చెబుతూ, ప్రారంభోత్సవాల్లో ఎలా పాల్గొంటున్నారని ఆయన దుయ్యబట్టారు. కేవలం తెలుగుతల్లిని, ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. సీఎం కిరణ్, చంద్రబాబునాయుడు, పురందేశ్వరి, ఎంపీలు, కేంద్ర మంత్రులు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి ఉద్యమానికి తరలిరావాలని డిమాండ్ చేశారు. తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకుంటే ,నేడు నకిలీ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు సోనియాగాంధీకి మద్దతిచ్చి రాష్ట్ర విభజనకు సహకరించారని ఆరోపించారు. తెలుగుజాతి తనదని, రాష్ట్రం ఒక్కటిగా ఉండాలన్న ఎన్టీ రామారావు కుమార్తెగా పుట్టిన పురందేశ్వరి తన పదవికి రాజీనామా చేసి తెలుగుజాతి గౌరవాన్ని నిలిపి తండ్రికి తగిన కుమార్తెగా నిలవాలన్నారు. నాడు ఇందిరాగాంధీ ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రజాభీష్టం మేరకు రాష్ట్ర విభజన చేయకుండా గొప్ప నాయకురాలిగా నిలిచారన్నారు. రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర , రాష్ట్ర మంత్రులు గంగిరెద్దులతో సమానమని ప్రసన్న అభివర్ణించారు. నేడు సోనియాగాంధీ తెలుగుప్రజల రక్తాన్ని తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనానికి రాష్ట్ర విభజన చేస్తోందన్నారు. దీనికి డ్రామాలు వేయడంలో ఆరితేరిన చంద్రబాబునాయుడ్ని ఉపయోగించుకుందన్నారు. వైఎస్సార్సీపీని విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదు రాష్ట్ర విభ జన విషయంలో ఏకపక్షం తగదని తొలుత నుంచి వైఎస్సార్సీపీ చెబుతూనే ఉందని ప్రసన్న అన్నారు. కేసీఆర్ విజయనగరం నుంచి వచ్చిన వ్యక్తి అని, అతనిది తెలంగాణ కాదని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులను విమర్శించే అర్హత కేసీఆర్‌కు, ఆయన కుమారుడు కేటీఆర్‌కు లేదన్నారు. దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, పాశం సునీల్‌కుమార్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నాపా వెంకటేశ్వర్లునాయుడు, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి ఉన్నారు. -
ఎన్జీఓ జేఏసీకి అధికారుల సంఘం మద్దతు
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఎన్జీఓ జేఏసీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో శనివారం నుంచి జిల్లా అధికారులు పాల్గొని సంఘీభావం తెలుపుతారని జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్వో రామిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నల్లబ్యాడ్జీలు ధరించి ఎన్జీవోల నిరాహారదీక్ష శిబిరంలో కూర్చుంటామని పేర్కొన్నారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా అధికారులు, గెజిటెడ్ అధికారులు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద సమావేశమవుతామని తెలిపారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. 20న మధ్యాహ్న సమయంలో ప్రదర్శన, 21న జిల్లా అధికారుల పెన్‌డౌన్, 22న జిల్లా అధికారులంతా మాస్ క్యాజువల్ లీవ్‌లో వెళ్లనున్నట్టు ప్రకటించారు. దశలవారీగా జిల్లా అధికారులు జేఏసీకి కార్యాచరణ ప్రణాళికతో మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.