సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఎన్జీఓ జేఏసీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో శనివారం నుంచి జిల్లా అధికారులు పాల్గొని సంఘీభావం తెలుపుతారని జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్వో రామిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఎన్జీఓ జేఏసీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో శనివారం నుంచి జిల్లా అధికారులు పాల్గొని సంఘీభావం తెలుపుతారని జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్వో రామిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నల్లబ్యాడ్జీలు ధరించి ఎన్జీవోల నిరాహారదీక్ష శిబిరంలో కూర్చుంటామని పేర్కొన్నారు.
19వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా అధికారులు, గెజిటెడ్ అధికారులు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద సమావేశమవుతామని తెలిపారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. 20న మధ్యాహ్న సమయంలో ప్రదర్శన, 21న జిల్లా అధికారుల పెన్‌డౌన్, 22న జిల్లా అధికారులంతా మాస్ క్యాజువల్ లీవ్‌లో వెళ్లనున్నట్టు ప్రకటించారు. దశలవారీగా జిల్లా అధికారులు జేఏసీకి కార్యాచరణ ప్రణాళికతో మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.