సమైక్య రాష్ట్రం విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని విజ్ఞప్తి చేశారు. తన నివాసం లోటస్పాండ్లో ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను అడ్డుకోకపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రం ఎడారి అవుతుందని హెచ్చరించారు. చదువుకున్నవారు హైదరాబాద్ వస్తే ప్రతి పిల్లవాడు చంద్రబాబును, కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టేపరిస్థితి వస్తుందన్నారు. కేబినెట్ నోట్ తయారు కాకముందే శాసనసభను సమావేశపరిచి సమైక్యరాష్ట్రం తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు. ఈరోజు తాము మరోసారి గవర్నర్ నరసింహన్ను కలిసినట్లు చెప్పారు. శాసనసభను సమావేశపరచమని కోరినట్లు తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ వెళతారు. విభజించండి అని నిరాహార దీక్ష చేస్తారు. ఈ పేరుతో ఆయన అక్కడ ఎంతమందిని కలిశారో తెలియదన్నారు. అదే సమయంలో ఇక్క డ కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలను ఒక్కొక్కరిని కలుస్తారు. వారిని బెదిరించి సమ్మె విరమించే ప్రయత్నాలు చేస్తారు. మొన్నటిదాకా సమైక్యత అన్న కేంద్ర మంత్రులు, ఎంపిలు ఇప్పుడు ప్యాకేజీలు అడిగే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ఉద్యమాన్ని వీరు ఎందుకు నీరు గారుస్తున్నారో అర్ధం కావడంలేదంటున్నారు. యూపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ తనకు కుమారుడిని ప్రధానిని చేయడానికి రాష్ట్రాన్ని విభజించడానికి సిద్దపడ్డారని విమర్శించారు. ఆమె తమ పిల్లల జీవితాతో ఆడుకుంటున్నారన్నారు. చంద్రబాబు అడ్డగోలుగా ఆమెకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. సోనియాకు కావలసిన విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ఎంత చెబితే అంతే. ఆమె చెప్పిన విధంగా చేస్తారని చెప్పారు. కిరణ్, చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని కోరారు. కలిసిరండని విజ్ఞప్తి చేశారు. సమైక్యతకు అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం మూడు పార్టీలని తెలిపారు. ఇప్పటికై చంద్రబాబు సిగ్గుతెచ్చుకొని ఈ మూడు పార్టీలతో కలవాలని పిలుపు ఇచ్చారు. ఆ మూడు నాలుగు, అయిదు పార్టీలు అవ్వాలని అన్నారు. ఈ నెల 26న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ సభకు అందరూ తరలిరావాలని పిలుపు ఇచ్చారు. రేపు సిఎం ఇంటి వద్ద తమ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారని చెప్పారు. స్పీకర్ను కలుస్తారన్నారు. సమైక్యత అంటే తెలంగాణ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాలకు న్యాయం చేయని అర్ధం అన్నారు. తమ రాజీనామాలు, తమ పార్టీలో చేరినవారి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లడానికి అడ్డంకులు ఉన్నందున రాజమోహన రెడ్డి ద్వారా మరో లేఖ పంపి తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటానని చెప్పారు. ఎంపి లగడపాటి రాజగోపాల్ ఏదో అన్నారని తాను మాట్లాడటం మొదలు పెడితే బాగుండదన్నారు.
Published Thu, Oct 17 2013 3:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement