మడకశిర, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా నాలుగు రోజులుగా పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయని మడకశిర నియోజకవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు ఎల్‌ఎం మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దీక్షల్లో వీరు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్,టీడీపీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు కృషి చేస్తుండగా, వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర కోసం పోరాడుతోందన్నారు. వైఎస్ జగన్ చేస్తున్న సమైక్య పోరాటానికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. నాలుగు రోజులుగా చేస్తున్న దీక్షలు విజయవంతమయ్యాయని వారు తెలిపారు. ఈ దీక్షలో స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఓంకార్‌స్వామి, కొంకల్లు హనుమంతరాయప్ప, సోమనాథ్, మాదన్న, హనుమంతరాయప్ప, శెట్టూరు మండల మహిళా విభాగం కన్వీనర్ మంజుళమ్మ తదితరులు పాల్గొన్నారు.
నాలుగో రోజు కొనసాగిన రిలే దీక్షలు
రాయదుర్గంరూరల్: రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజు కూడా కొనసాగాయి. స్థానిక వినాయక సర్కిల్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో శుక్రవారం పార్టీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి దీక్షలను ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ మహిలా విభాగం నాయకురాళ్లు అనూరాధ, సాఫియా ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 25 మంది మహిళలు దీక్షలో పాల్గొన్నారు.
వీరికి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పీఎస్ మహేష్, రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల కన్వీనర్లు మల్లికార్జున, అశ్వర్థరెడ్డి తదితరులు సం ఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విభజన వాదుల దిష్టి బొమ్మలను దహ నం చేసిన అనంతరం, వారు మాట్లాడు తూ సమైక్యరాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమని, విడిపోతే రెండు ప్రాంతాలు తీవ్రం గా నష్టపోతాయని తెలిపారు. సమైక్యం కోరుకున్నందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దారుణమన్నారు.
విభజన పాపం టీడీపీదే
గుంతకల్లు: రాష్ట్ర విభజన జరిగితే ఆ పాపం టీడీపీకే దక్కుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎన్. భీమలింగప్ప తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ స్థానిక మునిసిపల్ కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ నాయకులు డి.బాబయ్య, పి.లక్ష్మినారాయణ రెడ్డి, డి.మోహన్, బి. లాలెప్ప తదితరులు రిలే దీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన బిల్లుపై చర్చకు ముందే సమైక్య తీర్మానం చేయాలని పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడానికి కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వెనుకాడలేదన్నారు. ఈ రెండు పార్టీలను తెలుగు ప్రజలు క్షమించరన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో వైఎస్‌ఆర్‌సీపీ వెన్నంటి అన్ని పార్టీలు నడవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రవుంలో సేవాదళ్ వుండల కన్వీనర్ జయురామిరెడ్డి, మైనార్టీ నాయుకులు గఫూర్ తదితరులు పాల్గొన్నారు.
దీక్షలు విజయవంతం
Published Sat, Jan 11 2014 2:48 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement
Advertisement