రేపు విశాఖలో ‘వంచన వ్యతిరేక దీక్ష’ | YSRCP to conduct Hunger Strike against cheating in Vishaka | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 29 2018 3:49 PM | Last Updated on Tue, Jul 24 2018 1:12 PM

YSRCP to conduct Hunger Strike against cheating in Vishaka - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రేపు (సోమవారం) విశాఖపట్నంలో ‘వంచన వ్యతిరేక దీక్ష’ను నిర్వహిస్తోంది. విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాల ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్న ఈ దీక్షలో హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలుచేయని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు ఈ దీక్ష జరగనుంది. ఈ దీక్షలో పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సమన్వయకర్తలు కూడా పాల్గొంటారు. నలుపు చొక్కా లేదా టీ ష‌ర్ట్‌ ధ‌రించి వైఎస్సార్‌సీపీ నేతలు నిరాహార దీక్షలో కూర్చుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement