సాక్షి ప్రతినిధి,నెల్లూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగిసిపడుతోంది. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 28వ రోజూ నిరసనలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారం దీక్షలు, రాస్తారోకోలు, వంటావార్పులు, వినూత్న ప్రదర్శనలు జరిగాయి. నెల్లూరులో వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ ఉద్యోగులు సంయుక్తంగా ప్రదర్శన నిర్వహించారు. మత్స్యకారులు వలలతో రాగా, రైతులు ట్రాక్టర్లతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇరిగేషన్ సిబ్బంది ముత్తుకూరు గేటు సెంటర్‌లో, న్యాయవాదులు జిల్లా కోర్టు సమీపంలో వంటావార్పు చేశారు. నక్కలోళ్ల సెంటర్‌లో జిల్లా మేదర సంఘం చేపట్టిన రిలే దీక్షలను మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ప్రారంభించారు.
ఏనుగుపట్టాభిరామిరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎన్‌జీఓ భవన్‌లో రాష్ట్ర సమైక్య పోరాటవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ తులసిరెడ్డి హాజరయ్యారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ముత్తుకూరు బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహారదీక్షకు జిల్లా అధికారుల సంఘం సంఘీభావం తెలిపింది. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండులో ఆర్‌టీసీ కార్మికులు రిలే దీక్షలు నిర్వహించారు. వాకాడు మండలంలోని కల్లూరు అడ్డ రోడ్డు వద్ద వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఉదయశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారో కో చేశారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో విద్యార్థులు నిరసన తెలిపా రు.
టీపీగూడూరు మండలం చెన్నపల్లిపాళెం హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శన, రాస్తారోకో చేశారు. పొదలకూరులో ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. నేలటూరులోని ఏపీ జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టు గేటు వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. సూళ్లూరుపేట జేఏసీ, కాంగ్రెస్ నేతలు కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియాగాంధీ మనసు మారాలని హోమం చేశారు. నాయుడుపేట విద్యుత్ సబ్‌డివిజన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పెళ్లకూరులో ఉ పాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. తడ మండలం చేనిగుంట వద్ద గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వారికి మద్దతు తెలిపారు. కా వలి మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, పొదుపు మహిళలు ర్యాలీ నిర్వహిం చారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్ విద్యార్థులు నోటికి నల్లగుడ్డలను కట్టుకొని మౌనప్రదర్శన చేశారు. కోవూరు ఎన్‌జీఓ హోమ్‌లో పంచాయతీ కార్యాదర్శులు, బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు ఎదుట ఉపాధ్యాయులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. వెంకటగిరిలో జేఏీ స ఆధ్వర్యంలో పాత బస్టాండు నుంచి కాశీపేట వరకు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. ఉదయగిరిలోని ఉపాధ్యా య, ఉద్యోగ, కార్మిక, జేఏసీ ఆధ్వర్యం లో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయగిరి బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నా యి.
వీరికి టైలర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. మేకపాటి వెంకురెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు పంచాయతీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.మెరిట్స్ కళాశాల బీటెక్ చివ రి సంవత్సర విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలను కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి ప్రారంభించారు. వింజమూరు బస్టాండ్ సెంటరులో 21వ రోజూ రిలే దీక్షలు కొనసాగాయి. కలిగిరి పంచాయతీ బ స్టాండ్‌లో జరుగుతున్న ఉపాధ్యాయ జేఏసీ దీక్షలకు రాజన్నదళ వ్యవస్థాపకుడు ఎం.చిరంజీవరెడ్డి సంఘీభావం తెలిపారు.
ప్రజా ఉద్యమం
Published Wed, Aug 28 2013 4:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement