వచ్చేనెల 6కు టీ ఎంసెట్ కౌన్సిలింగ్ వాయిదా | telangana eamcet postponed to next month | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 6కు టీ ఎంసెట్ కౌన్సిలింగ్ వాయిదా

Published Fri, Jun 12 2015 5:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

telangana eamcet postponed to next month

హైదరాబాద్:ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ వచ్చేనెలకు వాయిదా పడింది. ఈ మేరకు శుక్రవారం విచారించిన హైకోర్టు ఎంసెట్ కౌన్సిలింగ్ ను వచ్చే నెల ఆరవ తేదీకి వాయిదా వేసింది. జూలై 6 వ తేదీన కౌన్సిలింగ్ మొదలుపెట్టి 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

 

దీంతో పాటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వెలుగుచూసిన లోపాలను సవరించుకోవాలంటూ 24 గంటలు గడువు ఇచ్చిన జేఎన్టీయూ నోటీసుల అంశంపై దాఖలైన పిటిషన్ ను కూడా హైకోర్టు విచారించింది. ఈ నెల 20వ తేదీ వరకూ ఆ కాలేజీ యజమాన్యులకు హైకోర్టు గడువు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement