
ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సాక్షి, వరంగల్ రూరల్: ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని చెన్నారావుపేటలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక జయముఖి ఇంజనీరింగ్ కాళాశాలలో రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.
ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. మనోజ్, రజనీకాంత్ అనే విద్యార్ధులు గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.