డుంబ్రిగుడ : మండలంలోని బిల్లాపుట్టు జంక్షన్‌వద్ద శనివారం మధ్యాహ్నం గంజాయి తరలిస్తూ ఇంజినీరింగ్ విద్యార్థులు డుంబ్రిగుడ పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్నంలోని రెండు, చెన్నయ్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు కె.దిలీప్‌కుమార్,రాజ్‌వర్దన్, గణేష్‌కుమార్, మురళీరతన్‌లను సుమారు 3 కిలోల గంజాయితో పట్టుకున్నామని అరకు సీఐ సింహాద్రినాయుడు తెలిపారు. కొంత కాలంగా వీరు ఈ ప్రాంతానికి వచ్చి గంజాయి కొనుగోలు చేసి తరలిస్తున్నారన్నారు.
ఆయా కళాశాలల్లోని విద్యార్థులు చందాలుగా డబ్బులు పోగుచేసుకుని తెచ్చి మన్యంలోని మారుమూల గ్రామాల్లో గంజాయి కొనుగోలు చేస్తున్నారన్నారు. మత్తుకు బానిస అవుతున్నారని చెప్పారు. పూర్తి దర్యాప్తు అనంతరం విద్యార్థులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. డుంబ్రిగుడ ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
40 కిలోలు స్వాధీనం
పాడేరు:మండలంలోని కుమ్మరిపుట్టు యూత్ ట్రైనింగ్ సెం టర్ పరిసరాల్లోని పొదల్లో తరలించడానికి దాచి పెట్టిన 40 కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్‌వీఎస్ ప్రసాద్ శనివారం స్వాధీనం చేసుకున్నారు. రవాణా కోసం ఇక్కడ గంజాయి సిద్ధం చేసినట్టు అందిన ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. గంజా యి దొరికింది. నిందితులను గుర్తించాల్సి ఉంది. ఈ తనిఖీల్లో స్థానిక ఎక్సైజ్ ఎస్‌ఐ జ్ఞానేశ్వరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గంజాయితో చిక్కిన ఇంజినీరింగ్ విద్యార్థులు
Published Sun, Sep 20 2015 12:03 AM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM
Advertisement
Advertisement