భవితకు పునాది.. ప్రాజెక్ట్ వర్క్ | Practical Orientation Project work | Sakshi
Sakshi News home page

భవితకు పునాది.. ప్రాజెక్ట్ వర్క్

Published Tue, Sep 27 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

భవితకు పునాది.. ప్రాజెక్ట్ వర్క్

భవితకు పునాది.. ప్రాజెక్ట్ వర్క్

 అకడమిక్ దశలోనే క్షేత్రస్థాయి నైపుణ్యాలు, ప్రాక్టికల్‌ఓరియంటేషన్‌కు పునాదులు వేస్తుంది ప్రాజెక్ట్ వర్క్.ప్లేస్‌మెంట్స్‌లో రాణించాలంటే ప్రాజెక్ట్ వర్క్‌తోస్కిల్స్ పెంపొందించుకోవాలి. మొత్తం మీద ఇంజనీరింగ్ విద్యార్థుల ఉజ్వల భవితకుప్రాజెక్ట్ వర్క్ బాట వేస్తుంది. ప్రస్తుతంవిద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌కుసిద్ధమవుతున్న క్రమంలోనిపుణుల సలహాలు..
 
 ఇంజనీరింగ్ విద్యార్థులు మూడేళ్లపాటు తరగతి గదిలో నేర్చుకున్న సబ్జెక్టును ప్రాక్టికల్‌గా అన్వయించేందుకు సరైన మార్గం ప్రాజెక్ట్ వర్క్. ఆయా ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు, సమస్యలపై ప్రాజెక్టు వర్క్‌తో అవగాహన పెంపొందించుకోవచ్చు. కొత్త సమస్యలు, వాటికి సరైన పరిష్కారాలు, నూతన ఆవిష్కరణల గురించి తెలుసుకోవచ్చు. లెర్నింగ్ బై డూయింగ్‌కు కూడా అవకాశం కల్పిస్తుంది. ఇంతటి కీలకమైన ప్రాజెక్ట్ వర్క్‌కు విద్యార్థులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. అలా కాకుండా డమ్మీ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెడితే అది విద్యార్థుల కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
 
 మూడో ఏడాది నుంచే అన్వేషణ
 బీటెక్ నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు మూడో సంవత్సరం నుంచే దానిపై కసరత్తు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిమాండ్ ఉన్న అంశాలు, కంపెనీల్లో ప్రాజెక్ట్ చేయడానికి అవకాశాలు, లేదా వ్యక్తిగతంగా చేయడం ఎలా? సీనియర్లు ఎలాంటి ప్రాజెక్టులు చేస్తున్నారు?  ఇలా వివిధ అంశాలను పరిశీలించాలి. దీంతో ప్రాజెక్టు ప్రారంభించేనాటికి కొంత అవగాహన వస్తుంది.
 
 అంశం ఎంపిక
 ప్రస్తుతం సంబంధిత రంగంలో ఎదురవుతున్న వాస్తవ సమస్యలను పరిష్కరించేలా ప్రాజెక్ట్ వర్క్ అంశాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. సమస్య పరిష్కార మార్గం ఆధారంగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తే మెరుగ్గా ఉంటుందనే ఆలోచనతో ఆసక్తి లేని అంశాన్ని ఎంపిక చేసుకోవడం సరికాదు. ఆసక్తితోపాటు భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. కంపెనీలు అభ్యర్థిని రిక్రూట్ చేసుకునేటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేయడంలో చూపిన నిబద్ధతను, సృజనాత్మక ఆలోచన విధానాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
 
 వ్యక్తిగత ప్రాజెక్టులు
 కంపెనీల్లో లైవ్ ప్రాజెక్ట్‌లకు వీలుకాకుంటే.. స్వయంగా తామే ఏదైనా ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. దీన్నే  individual project work అంటారు. ఇందులో ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు కలిసి బృందంగా  ఏర్పడి, ఎంచుకున్న అంశంపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సమన్వయం ఉన్న అభ్యర్థులు జట్టుగా ఏర్పడితే మంచిది. ప్రాజెక్టు అంశంపై వీరు అధ్యాపకుల సలహాలు తీసుకోవాలి.
 
 ప్రాజెక్ట్ వర్క్ కార్యాచరణ
 అంశానికి సంబంధించి సమస్యను రాసుకోవడం  సమస్య పరిష్కారానికి ఉపయోగపడే మార్గాలను గుర్తుంచుకోవడం ఠి పరిష్కార మార్గాలను కార్యాచరణలో పెట్టేందుకు అనుసరించాల్సిన విధానాలు ఠి కార్యాచరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం
 
 ప్రాజెక్ట్ వర్క్- అనుసరించాల్సిన అంశాలు
 ఏదైనా అంశాన్ని ఎంపిక చేసుకున్న విద్యార్థులు.. అప్పటికే దానిపై నిపుణులు ప్రచురించిన రీసెర్చ్ పేపర్లు, జర్నల్స్ చదవాలి. దీంతో ఆ అంశానికి సంబంధించిన తాజా పరిణామాలు, సమస్యలు, కొత్త ఆవిష్కరణలు తదితర అంశాలపై అవగాహన వస్తుంది. దీంతో తమ ప్రాజెక్ట్ వర్క్ మరింత వినూత్నంగా ఉండేలా చూసుకోవచ్చు. ఉదాహరణకు సీఎస్‌ఈ బ్రాంచ్ విద్యార్థులకు డేటా అనలిటిక్స్.. ఇండస్ట్రీ కోణంలో హాట్ టాపిక్‌గా మారింది.రిపోర్ట్ రూపకల్పన: ప్రాజెక్ట్ వర్క్ అంశం ఎంపికలో ఎంత అప్రమత్తంగా ఉన్నారో.. రిపోర్ట్ రూపకల్పన, థీసిస్ ప్రజెంటేషన్‌లోనూ అంతే శ్రద్ధ వహించాలి. ఒక క్రమ పద్ధతిలో ప్రాజెక్ట్ వర్క్ రిపోర్ట్ (థీసిస్) ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్ట్ టైటిల్ నుంచి రిఫరెన్సెస్ వరకు అన్నీ ఒక క్రమ పద్ధతిలో నివేదించాలి.
 
  టైటిల్ పేజ్  ఠి సర్టిఫికెట్ (ప్రాజెక్ట్ గైడ్ ఇచ్చేది)
 సినాప్సిస్  ఎకనాలెడ్జ్‌మెంట్స్  ఇండెక్స్ (కంటెంట్స్ టేబుల్)  ఇంట్రడక్షన్ (చాప్టర్-1) ఠి లిటరేచర్ - (చాప్టర్-2)  డిజైన్ మెథడాలజీ (చాప్టర్ -3) ఠి ఫలితాల విశ్లేషణ (చాప్టర్ -4)  రిఫరెన్సెస్
 
 ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి డిమాండింగ్ లేదా హాట్ టాపిక్స్ కోణంలో ఆలోచించడం మంచిది. వ్యక్తిగత సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుంటే, కొన్ని సందర్భాల్లో వాటిని ఎంపిక చేసుకున్న విద్యార్థులకు సరైన గైడ్ లేక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందువల్ల విద్యార్థులు ముందుగా తమ ఆసక్తిని, ఆ తర్వాత గైడ్ సదుపాయాన్ని తెలుసుకోవాలి. ఈ రెండింటి విషయంలో సానుకూలత లేకపోతే అకడమిక్‌గా ఆసక్తి ఉన్న కోర్ అంశాల్లో ప్రాజెక్ట్ వర్క్‌కు సిద్ధం కావాలి. ఎలాంటి అంశమైనా కచ్చితమైన పరిష్కారం ఉండేలా చూసు
 కోవాలి.    - ప్రొ॥ఇ.శ్రీనివాస్‌రెడ్డి,
     డీన్, సీఎస్‌ఈ, ఏఎన్‌యూసీఈ.

 
కంపెనీల్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న విద్యార్థులకు సంస్థ నిపుణులతో కలసి పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మంచి పనితీరు కనబరచడం ద్వారా సంస్థను ఆకట్టుకొని, అందులోనే జాబ్ ఆఫర్ సైతం అందుకోవచ్చు. కంపెనీల్లో లైవ్ ప్రాజెక్ట్‌కు అవకాశం లభించిన విద్యార్థులు ఉత్సాహంగా పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డమ్మీ లేదా ఫేక్ ప్రాజెక్టుల వైపు వెళ్లొద్దు. క్యాంపస్ ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్‌పైనే ఉంటాయనే విషయం గుర్తించాలి.    - ప్రొ॥వి.ఉమామహేశ్వర రావు,
     ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఓయూసీఈ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement