గర్ల్‌ఫ్రెండ్‌తో కాలేజికి వస్తే, గలాటా చేస్తావా..? అప్పటి నుంచి నీ కోసం వెదుకుతున్న ఇన్నాళ్లకు దొరికావురా..
ఇంజినీరింగ్ విద్యార్ధుల మధ్య గొడవ
తాడేపల్లి రూరల్ (గుంటూరు): గర్ల్‌ఫ్రెండ్‌తో కాలేజికి వస్తే, గలాటా చేస్తావా..? అప్పటి నుంచి నీ కోసం వెదుకుతున్న ఇన్నాళ్లకు దొరికావురా.. అంటు శివ సినిమా తరహాలో చేతికి ఉన్న ఇనుప కడియంతో సహా విధ్యార్థిపై, మరో ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడికి పాల్పడిన సంఘటన బుధవారం జరిగింది. తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరం కోనేరు లక్ష్మయ్య విశ్వవిధ్యాలయంలో ఫరధీన్ బీటెక్ సెకెండీయర్ చదువుతుండగా, వంశీ థర్డ్ ఇయర్ బిటెక్ చదువుతున్నాడు.. ఈ మధ్య యూనివర్సిటిలో జరిగిన సంయక్ - 2015 కార్యక్రమం జరిగింది.
ఈ ఈవెంటుకు వంశీ ఫ్రోగ్రామ్ ఇన్‌ఛార్జీ అయితే, సంయక్ - 2015 లో పాల్గోనడానికి ఫర ధ్ధీన్, వేరే కాలేజికి చెందిన తన గర్ల్‌ప్రెండ్‌తో వచ్చాడు. ఇతరులు ఎవరికి ప్రవేశం లేదంటు ఫరీధ్ధీన్‌తో వచ్చిన అమ్మాయిని లోనికి రావద్దంటు వంశీ అడ్డుకుని, అనుమతి తీసుకురావాలని కోరాడు. ఇంతలో వంశీ స్నేహితులు ఆ అమ్మాయిని లోనికి అనుమతిచ్చారు. అయితే, తన గర్ల్‌ఫ్రెండ్‌ని అడ్డుకోవడం అవమానంగా గురైన ఫరధ్ధీన్ బుధవారం యూనివర్సిటికి వచ్చి, ఒంటరిగా ఉన్న వంశీ పై దాడి చేశాడు. గాయాలపాలైన బాధితుడు తాడేపల్లి పోలిస్‌స్టేషనులో ఫిర్యాధు చేశాడు.