వెబ్ కాస్టింగ్ చేయాలంటే...
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ చేయడానికి ఆసక్తి గల ఇంజినీరింగ్ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. సొంత ల్యాప్‌టాప్ ఉన్న విద్యార్థులు www.ghmc.gov.in వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వీరికి వెబ్ కాస్టింగ్‌పై గంటసేపు శిక్షణనిస్తామని పేర్కొన్నారు.
పోలింగ్ రోజు(ఫిబ్రవరి 2) ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వెబ్ కాస్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు నగదు పారితోషకంతో పాటు ధ్రువీకరణ పత్రం కూడా ఇస్తామన్నారు. పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు ఫిబ్రవరి ఒకటిన రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.