
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. అతివేగం వల్లే కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. విద్యార్థుల అందరూ గీతం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వారిగా తెలిసింది. మృతి చెందిన విద్యార్థిని జతిన్ వర్మగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment