
సాఓఇ, బాపట్ల: నాలుగు సంవత్సరాలు కష్టపడి ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులందరూ నా దృష్టిలో సూపర్ స్టార్సేనని సినీ దర్శకుడు రావిపూడి అనీల్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థుల కలయికలో భాగంగా యంగ్ డైరెక్టర్ రావిపూడి అనీల్ విజ్ఞాన్‌లోని విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.
అనీల్ మాట్లాడుతూ అవకాశాలనేవి మన దగ్గరకు రావని.. విద్యార్థులే వాటికి ఎదురెళ్లి తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. దాని సాధించేంతవరకు కష్టపడాలన్నారు. వినూత్న ఆలోచనలకు కాసింత క్రియేటివిటీ, టెక్నాలజీను ఉపయోగించుకుంటే జీవితంలో విద్యార్థులు ముందుకు దూసుకెళ్లి పోవచ్చన్నారు. ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: (అదే నా కోరిక.. నటనకు బ్రేక్ ఇచ్చయినా ఆ విషయాలు తెలుసుకుంటా)
Comments
Please login to add a commentAdd a comment