
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద శనివారం జరిగింది. కంచికచర్లోని మిక్(ఎంఐసీ) ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పెర్రీ ఘాట్ వద్దకు వెళ్లారు. అయితే వీరిలో తొలుత ఒక విద్యార్థి స్నానం చేయడానికి కృష్ణా నదిలో దిగగా ప్రమాదశాత్తూ లోపలికి జారిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు తమ స్నేహితుడిని కాపాడేందుకు యత్నించారు. కానీ ఆ ప్రయత్నంలో ఆ ముగ్గురు బీటెక్ విద్యార్థులూ గల్లంతయ్యారు. కాగా గల్లంతైన వారి పేర్లు ప్రవీణ్(18), చైతన్య (18), శ్రీనాథ్ (19), రాజ్ కుమార్ (19). సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment