డిండీ ప్రాజెక్టులో పడి 5గురు విద్యార్థుల మృతి | five-engineering-students-drowned-in-dindi-project | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 30 2014 3:43 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనను ఇంకా మరువకముందే.. నల్లగొండ జిల్లాలో అలాంటి విషాదమే మరొకటి చోటుచేసుకుంది. హైదరాబాద్లో చదువుతున్న ఐదుగురు యువతీ యువకులు డిండి ప్రాజెక్టు నీళ్లలో పడి మరణించారు. హైదరాబాద్కు చెందిన వీళ్లంతా సమీపం బంధువులే. వారిలో నలుగురు అన్నదమ్ముల బిడ్డలు కాగా, మరొకరు సమీప బంధువు. తమ తాతయ్య దశదిన కర్మల కార్యక్రమానికి వచ్చి, ఆ తర్వాత ఆరుగురు కలిసి దిండి ప్రాజెక్టులో ఈతకు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు. ఒక్కరు మాత్రం ముందుగానే గమనించి ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను హర్షవర్ధన్, ప్రణీత్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, దేవయాని, జ్యోత్స్నగా గుర్తించారు. నీటిమట్టం మరీ ఎక్కువగా లేకపోవడంతో అందరి మృతదేహాలు బయటపడ్డాయి. చేతికి అందివస్తున్న పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోయి నిర్జీవులుగా కనిపించడంతో బంధువులంతా కన్నీరు మున్నీరయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement