beas tragedy
-
వారే బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో!
హైదరాబాద్: అందరిలో ఉల్లాసం.. ప్రకృతిలో సీతాకోకచిలుకల్లా కేరింతలు.. రాళ్లు రప్పలూ.. చెట్టూ పుట్టా అన్నింటిని ముద్దాడే ఆశ.. తనివి తీరా స్పర్షించాలన్న కోరిక.. ప్రతి కొత్త చోటును కెమెరాతో తమ వద్దకు చేర్చుకునే ప్రయత్నం.. తొలుత నిర్మలంగా నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్న ఆ నది పారే మార్గంలో స్నేహితులంతా కలిసి కోలాహలంగా గంతులు వేస్తూ కెమెరాలతో వీలయినన్ని ఫొటోలతో బిజీగా ఉండగా..మొదట చినుకై ఆ తర్వాత వరదై మరికాసేపట్లో ఉప్పెనైనట్లుగా ఒక్కసారిగా గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. ముందు సెలయేరుగా మారి వారి పాదాలను ముద్దాడింది.. ఆ వెంటనే వేగం పెంచి మరో రూపాన్ని సంతరించుకుంది. దీంతో భయపడినవారంతా పారిపోయేందుకు ప్రయత్నించినా అందరినీ అమాంతం హత్తుకుని తనలో కలిపేసుకుంది. వారి కుటుంబాల్లో విషాధం నింపింది. ఘటన తీరు చూసిన అందరి కళ్లలో వరదల్లే నీరు నింపింది. ఇది సరిగ్గా ఏడాది కిందట హైదరాబాద్ శివార్లలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి నుంచి సరదాగా టూర్‌కు వెళ్లిన విద్యార్థుల విషణ్ణ వదనాల చరిత. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది వద్ద సంభవించిన ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించగా కొందరే ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే పండో డ్యామ్ తలుపులు తెరవడంతో ఆ వరద నీటికి వారంతా కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. కాస్త అప్రమత్తంగా ఉన్నా.. అనుభవజ్ఞులు పక్కన ఉన్న వారు బతికి బయటపడేవారేమో. నది ప్రవహించే మార్గంలోని రాళ్ల గుట్టలు ఎక్కి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తూ జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారే తప్ప వారి ప్రాణాలు పోతాయన్న విషయం గమనించలేదు. కాళ్ల కిందకు నీళ్లు వస్తుండగా ఒడ్డున ఉన్న స్థానికులు అప్రమత్తం చేసే ప్రయత్నం చేసి బయటకు రమ్మంటూ చేతులు ఊపినా.. వాళ్లు హాయ్ చెబుతున్నారని అనుకొని వీరు కూడా చేతులు ఊపారు తప్ప.. అపాయాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయారు. క్షణాల్లో వీరంతా రాళ్ల నుంచి నీళ్లలో పడి కొట్టుకుపోయారు. కనీసం నెల రోజులపాటు వీరి మృతదేహాల కోసం గాలింపులు జరిగాయి. ఈ ఘటనలో కళాశాల, అక్కడి డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి 24 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇకముందైనా కళాశాలలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోగలిగితే అటు తల్లిదండ్రులకు, వారి పిల్లలకు బంగారు భవితకు భరోసా ఇచ్చినట్లవుతుంది. ఏదేమైనా.. ఉజ్వల భవిష్యత్ ఉండి అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఆ 24 మంది విద్యార్థులు బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో. -
మధ్యప్రదేశ్‌లో మరో బియాస్ దుర్ఘటన
బియాస్ నదీ విషాదాన్ని మరువక ముందే అలాంటి ఘటనే పునరావృతమైంది. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని బాగ్దారి జలపాతం వద్ద 11 మంది నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించిన అధికారులు ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. మధ్యప్రదేశ్‌లోని హన్‌మాన్‌తల్ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలు సరదాగా గడపాలనుకున్నాయి. ఎంజాయ్ చేసేందుకు జబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నబాగ్దారి జలపాతాన్ని ఎంపిక చేసుకున్నాయి. అనుకున్నట్లుగానే రెండు కుటుంబాలకు చెందిన 12 మంది బాగ్దారి జలపాతానికి వెళ్లారు. కొండల మధ్య చిన్న నదీపాయను దాటి పిక్నిక్ స్పాట్‌కు చేరుకున్నారు. జలపాతం అందాలను ఆస్వాదించి సంతోషంగా గడిపారు. సరిగ్గా వాళ్లు తిరిగి ఇంటికి వెళ్దామనుకుంటున్న సమయంలో మృత్యువు కాటేసింది. నదీపాయను దాటుతున్న సమయంలో అనూహ్యంగా పెరిగిపోయిన వరద ఆ రెండు కుటుంబాలను కబళించేసింది. వరద ఉద్ధృతిలో మొదట ఓ యువకుడు పడిపోగా అతడిని రక్షించే ప్రయత్నంలో మిగతా వారంతా కొట్టుకుపోయారు. ఒక యువతి మాత్రం ప్రాణాలతో బయటపడగలిగింది. మరో యువతిని రక్షించేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నించినా అది ఫలించలేదు. ప్రమాద విషయం తెలిసిన అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సహాయ బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ఈ గాలింపులో ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు జరుగుతోంది. ఈ ఘోర విషాదంలో ప్రాణాలతో బయటపడిన యువతికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులకు లక్ష రూపాయల చొప్పున జిల్లా అధికార యంత్రాంగం ఎక్స్గ్గ్రేషియా ప్రకటించింది. వాస్తవానికి వాళ్లు ఉన్నప్పుడు ప్రవాహం అంత ఎక్కువగా లేదని, కానీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఉన్నట్టుండి ప్రవాహం ఎక్కువయ్యిందని, దాన్ని గుర్తించి అవతలి గట్టుకు వెళ్దామనుకునేలోపే ప్రవాహం ముంచుకొచ్చి 11 మంది నీళ్లలో కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. -
మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు ఆదివారం పోలీసులకు అభ్యమయ్యాయి. వాటిని కరీంనగర్‌కు చెందిన శ్రీనిధి, మరొకరు బాచుపల్లికి చెందిన నిశితారెడ్డిగా పోలీసులు గుర్తించారు. జూన్ 8న విజ్ఞానయాత్ర కోసం వెళ్లిన విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో 24 మంది లార్జీడ్యాం వరద నీటి ప్రవాహం కారణంగా బియాస్‌నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మృతదేహాలతో కలిపి ఇప్పటివరకు 23 మృతదేహాలను బయటకు తీశారు. మరో విద్యార్థి శ్రీహర్ష, టూర్ ఆపరేటర్ ప్రహ్లాద్ మృతదేహాల జాడ తెలియాల్సి ఉంది. మృతదేహాలను విమానంలో హైదరాబాద్‌కు తరలించనున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
అడియాసలు
మేడ్చల్: నదిలో గల్లంతైన తమ కుమారుడు ఎక్కడో బతికే ఉండొచ్చని భావించారు ఆ తల్లిదండ్రులు. కొడుకు వస్తాడని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వారికి గుండెకోతే మిగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన మేడ్చల్ మండలం గౌడవెల్లి విద్యార్థి బస్వరాజు సందీప్‌యాదవ్(20) మృతదేహం మంగళవారం లభ్యమైంది. కుమారుడి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ కుమారుడు వస్తాడని వేయికళ్లతో ఎదురుచూసిన వారికి చివరికి దుఃఖమే మిగిలింది. మంగళవారం ఉదయం 8 గం టల సమయంలో బియాస్ నది అడుగుభాగంలో మంచుగడ్డల మధ్య ఓ మృతదేహం అధికారులకు కనిపిం చింది. అక్కడే ఉన్న తెలంగాణ రాష్ట్ర అధికారులు, విజ్ఞాన్ జ్యోతి కళాశాల యాజమాన్యం మృతుడు సందీప్‌యాదవ్ అయి ఉండొచ్చని అనుమానించారు. దీంతో అతడి తండ్రి బస్వరాజ్ వీరేష్‌కు ఫోన్ చేసి వివరాలు తెలిపారు. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, బూట్లు, చేతికి ఉన్న ఉంగరం ఫొటోలను అధికారులు ఎంఎంఎస్ ద్వారా వీరేష్ సెల్‌ఫోన్‌కు పంపించారు. ఉంగరం ద్వారా మృతుడు సందీప్ అని తల్లిదండ్రులు, కుటుంబీకులు గుర్తించారు. శోకసంద్రంలో సందీప్ కుటుంబం మంగళవారం సందీప్ మృతి సమాచారం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు బస్వరాజ్ వీరేష్, విజయ ఇంట్లోనే కుప్పకూలిపోయారు. ‘వస్తావనుకున్న నాయక.. మమ్మల్ని విడిచిపెట్టి పోయావా.. నాన్న..’ అని ఆమె రోదించిన తీరు హృదయ విదారకం. సందీప్ తండ్రి వీరేష్ ఒంటరిగా తనలో తానే కులిమిపోయాడు. ‘ఎలాగైనా బతికి వస్తావనుకున్నాను రా..’ అని ఆయన గుండెలుబాదుకున్నాడు. సందీప్ ఇద్దరు సోదరి, ఇతర కుటుంబసభ్యుల రోదనలతో గౌడవెళ్లి శోకసంద్రంలో మునిగిపోయింది. సందీప్ మృతి సమాచారం తెలుసుకున్న గౌడవెళ్లి గ్రామస్తులు పెద్దఎత్తున అతడి ఇంటికి చేరుకొని కుటుంబీకులను ఓదార్చారు. కాగా విజ్ఞాన్ జ్యోతి కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు గత నెల 8న హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం మృతదేహం గౌడవెళ్లికి.. సందీప్ మృతదేహాన్ని బుధవారం గౌడవెళ్లికి తరలిస్తామని అధికారులు సమాచారం ఇచ్చినట్లు సందీప్ తండ్రి వీరేష్ తెలిపారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి అక్కడి నుండి విమానం లో ఢీల్లీకి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు తీసుకొస్తారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మృతదేహాన్ని గౌడవెళ్లికి తీసుకొస్తామని అధికారులు తెలిపినట్లు వీరేశ్ పేర్కొన్నారు. -
డిండీ ప్రాజెక్టులో పడి 5గురు విద్యార్థుల మృతి
-
డిండీ ప్రాజెక్టులో పడి.. ఐదుగురు విద్యార్థుల మృతి
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనను ఇంకా మరువకముందే.. నల్లగొండ జిల్లాలో అలాంటి విషాదమే మరొకటి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో చదువుతున్న ఐదుగురు యువతీ యువకులు డిండి ప్రాజెక్టు నీళ్లలో పడి మరణించారు. హైదరాబాద్‌కు చెందిన వీళ్లంతా సమీపం బంధువులే. వారిలో నలుగురు అన్నదమ్ముల బిడ్డలు కాగా, మరొకరు సమీప బంధువు. తమ తాతయ్య దశదిన కర్మల కార్యక్రమానికి వచ్చి, ఆ తర్వాత ఆరుగురు కలిసి దిండి ప్రాజెక్టులో ఈతకు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు. ఒక్కరు మాత్రం ముందుగానే గమనించి ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను హర్షవర్ధన్, ప్రణీత్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, దేవయాని, జ్యోత్స్నగా గుర్తించారు. నీటిమట్టం మరీ ఎక్కువగా లేకపోవడంతో అందరి మృతదేహాలు బయటపడ్డాయి. చేతికి అందివస్తున్న పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోయి నిర్జీవులుగా కనిపించడంతో బంధువులంతా కన్నీరు మున్నీరయ్యారు. -
మంటలా,పేలుడా...ఏది ముందు?
-
మృత్యు జ్వాల
-
పేలిన గెయిల్ గ్యాస్ పైప్‌లైన్
-
మృత్యు విస్ఫోటం
-
శ్మశానంగా మారిన నగరం
-
మృత్యుకీలలు
కోనసీమవాసులకు సుఖసంతోషాలను ఇవ్వకపోగా వారి పాలిట ఇప్పుడు పెనుగండంగా మారింది ఆ గడ్డ గర్భంలోని సంపద. కలుగుల్లోని కాలనాగుల్లా ఆ గడ్డ పొరల్లో విస్తరించిన గ్యాస్ పైపులైన్లలో ఒకటి విస్ఫోటించి 15 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో 27 మందిని మృత్యువు పిడికిట్లో ఇరికించింది. - నేలలోని గొట్టాలే.. కాలయముని హస్తాలు - తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో విరుచుకుపడ్డ చిచ్చు - 15 మంది సజీవ దహనం - మరో 27 మందికి గాయాలు - 15 మంది పరిస్థితి విషమం సాక్షి, కాకినాడ/ మామిడికుదురు : చెలరేగిన అగ్నికీలల నడుమ చిక్కుకున్న అమాయకులు కార్చిచ్చులో మొలకల్లా మాడిపోయారు. మాంసపు ముద్దల్లా మిగిలారు. కొందరు.. జరుగుతున్నది నిజమో, పీడకలో తెలియకుండా నిద్రలోనే కన్నుమూశారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన ట్రంక్ పైపులైన్ పేలిన ఘటనలో గతంలో ఎన్నడూలేని రీతిలో భారీగా ప్రాణనష్టం సంభవిం చింది. చమురు సంస్థల తీరుపై ఆగ్రహోదగ్రులైన బాధితులు గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌ను ముట్టడించి వాహనాలను ధ్వంసం చేశారు. పరామర్శకు వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమం త్రి ధర్మేంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు , హోం మంత్రి చినరాజప్పను చుట్టుముట్టి చమురు సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు మూల్యం గెయిల్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ పైపులైన్ నగరం సమీపంలో వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్‌ను ఆనుకుని పైపులైన్ జాయింట్ వద్ద జరిగిన ఈ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టించింది. పైపులైన్ పేలడంతో ఎగసిపడిన గ్యాస్ ఆ ప్రాంతమంతా ఆవరించింది. నిద్రలో ఉన్న జనం ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు విరుచుకు పడ్డాయి. జాయింట్ వద్ద పైపులైన్‌లీకైన సమయంలో గ్యాస్ మాత్రమే ఎగజిమ్మిందని, వరుసగా రెండుసార్లు సంభవించిన పేలుడుతో గ్యాస్ రాపిడికి గురై మంటలు వ్యాపిం చాయని స్థానికులు చెబుతున్నారు. లీకై న గ్యాస్ ఎగజిమ్ముతూ, పరిసరాల్లో కమ్ముకుంటున్న సమయంలోనే స్థానికులెవరో పొయ్యి వెలిగించడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనే వా దన కూడా వినిపిస్తోంది. పేలుడుతో మంటలు బ్లో అవుట్ సంభవించినప్పటి లా 30 నుంచి 40 మీటర్ల ఎత్తున ఎగసి పడ్డాయి. మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పైపులైన్ లీకైనా అధికారులు మొక్కుబడి చర్యలు మాత్రమే చేపట్టడంతో.. అందుకు మూల్యాన్ని అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. పేలుడు ధాటికి పది అడుగుల గొయ్యి ఏర్పడగా పైపులైన్‌పై కప్పిన గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. పదికి పైగా అగ్నిమాపక శకటాలు 3 గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చినా.. రాత్రి వరకూ భూమిలోం చి పొగలు, వేడిగాలులు వస్తూనే ఉన్నా యి. అధికారులు స్పందించకపోయినా గ్రామస్తులే సహాయ, పునరావాస చర్య ల్లో నిమగ్నమయ్యారు. మంటలను అదుపు చేయడంతో పాటు మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో చురుగ్గా పాల్గొన్నారు. -
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం, కేంద్ర, రాష్ర్ట మంత్రులు మామిడికుదురు/కాకినాడ క్రైం : నగరం పైపులైన్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వ పరంగా మెరుగైన వెద్యసహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్‌తో కలిసి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం మధురపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో నగరం చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓఎన్జీసీ డౌన్‌డౌన్ అంటూ సీఎం ఎదుట నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రావాల్సిందిగా బాధితులు పట్టుబట్టినప్పటికీ పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడులతో కలిసి కాకినాడ చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, బీజేపీ ఏపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తదితరులతో కలిసి కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ వారికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాలు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. స్థానికుల నిరసన ఒకే కుటుంబంలో ఐదుగురు మృత్యువాత పడిన ఇంటిని కానీ, మరో కుటుంబంలో ముగ్గురు చనిపోయిన ఇంటిని కానీ చంద్రబాబు పరిశీలించకుండానే వెనుదిరగడంపై స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఎంతో హడావిడి చేసి పోలీసు బందోబస్తు మధ్య ఎవరిని ఉద్దరించడం కోసం ఇక్కడకు వచ్చారంటూ బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెంట వచ్చిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రోడ్డుపైన కారు దిగి, రోడ్డుపైనే నిలుచుని మళ్లీ అక్కడ నుంచే వెనుదిరిగారే తప్ప సంఘటన స్థలంలో కనీసం కాలుమోపలేదు. -
మృత్యుకీలలు
కోనసీమవాసులకు సుఖసంతోషాల్నివ్వకపోగా కష్టనష్టాల పాలు చేస్తున్న ఆ గడ్డ గర్భంలోని సంపదే.. వారి పాలిట పెనుగండంగా మారింది. కలుగుల్లోని కాలనాగుల్లా ఆ గడ్డ పొరల్లో విస్తరించిన గ్యాస్ పైపులైన్లలో ఒకటి విస్ఫోటించి 15 నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. మరో 27 మందిని మృత్యువు పిడికిట్లో ఇరికించింది. పద్మవ్యూహంలో అభిమన్యుని చుట్టుముట్టిన కౌరవుల్లా.. చెలరేగిన అగ్నికీలల నడుమ చిక్కుకున్న అమాయకులు కార్చిచ్చులో మొలకల్లా మాడిపోయారు. కొందరు.. జరుగుతున్నది నిజమో, పీడకలో తెలియకుండా నిద్రలోనే కన్నుమూశారు. మరి కొందరు పగవారిలా తరిమే కీలల బారి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీసినా ఫలితం లేక విగతజీవులై నేలకొరిగారు. వేకువకు ముందే విరుచుకుపడ్డ విలయాగ్ని చివరికి పచ్చని పంటపొలాలనూ, తోటలనూ, మూగజీవాలనూ బుగ్గి చేసింది. - నేలలోని గొట్టాలే.. కాలయముని హస్తాలు - పచ్చనిసీమపై విరుచుకుపడ్డ చిచ్చు - నగరంలో విస్ఫోటించిన పైపులైన్ - 15 మంది సజీవ దహనం, 27 మందికి గాయాలు - వారిలో 15 మంది పరిస్థితి విషమం సాక్షి, కాకినాడ / మామిడికుదురు : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన ట్రంక్ పైపులైన్ పేలిన ఘటనలో గతంలో ఎన్నడూలేని రీతిలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. చమురు సంస్థల తీరుపై ఆగ్రహోదగ్రులైన బాధితులు గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌ను ముట్టడించి వాహనాలను ధ్వంసం చేశారు. పరామర్శకు వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పలను చుట్టుముట్టి చమురు సంస్థల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోనసీమలో 1993లో కొమరాడ..1995లో దేవర్లంక.. 1996లో దేవరపల్లి, 2005లో తాండవపల్లిలో బ్లో అవుట్లు సంభవించాయి. వీటిలో దేవర్లంక బ్లో అవుట్ రెండు నెలల పాటు ప్రజ్వరిల్లింది. ఈ ఘటనల్లో పచ్చని పొలాలు మాడిమసైపోయాయి. కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గయింది. ఇక పరిపాటిగా మారిన పైపులైన్ల లీకేజ్‌లతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్ని ఘటనలు జరిగినా ఇప్పటి వరకూ ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం లేదు. శుక్రవారం నాటి ఘటన కోనసీమలో చమురు కార్యకలాపాల చరిత్రలోనే తొలిసారి 15 ప్రాణాలను బలిగొంది. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక ప్రాణాలే మూల్యం.. గెయిల్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ పైపులైన్ ఉదయం 5.10 గంటల సమయంలో పేలిపోయింది. నగరం సమీపంలో వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్‌ను ఆనుకుని పైపులైన్ జాయింట్ వద్ద జరిగిన ఈ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టించింది. పైపులైన్ పేలడంతో ఎగసిపడిన గ్యాస్ ఆ ప్రాంతమంతా ఆవరించింది. నిద్రలో ఉన్న జనం ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు విరుచుకు పడ్డాయి. జాయింట్ వద్ద పైపులైన్‌లీకైన సమయంలో గ్యాస్ మాత్రమే ఎగజిమ్మిందని, వరుసగా రెండుసార్లు సంభవించిన పేలుడుతో గ్యాస్ రాపిడికి గురై మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. కాగా లీకైన గ్యాస్ ఎగజిమ్ముతూ, పరిసరాల్లో కమ్ముకుంటున్న సమయంలోనే స్థానికులెవరో పొయ్యి వెలిగించడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. పేలుడుతో మంటలు బ్లో అవుట్ సంభవించినప్పటిలా 30 నుంచి 40 మీటర్ల ఎత్తున ఎగసి పడ్డాయి. మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పైపులైన్ లీకైనా అధికారులు మొక్కుబడి చర్యలు మాత్రమే చేపట్టడంతో.. అందుకు మూల్యాన్ని అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. పేలుడు ధాటికి పది అడుగుల గొయ్యి ఏర్పడగా పైపులైన్‌పై కప్పిన గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. పదికి పైగా అగ్నిమాపక శకటాలు సుమారు మూడు గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చినా.. రాత్రి వరకూ భూమి లోంచి పొగలు, వేడిగాలులు వస్తూనే ఉన్నాయి. అధికారులు స్పందించకపోయినా గ్రామస్తులే సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు. మంటలను అదుపు చేయడంతో పాటు మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో చురుగ్గా పాల్గొన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. కోనసీమ చవి చూసిన పెనువిషాదాల్లో ఒకటి అనదగ్గ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 15 మందిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. వారంతా కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీల్లేని రీతిలో మాంసపుముద్దల్లా మిగిలారు. మరో 27మంది వరకు గాయాల పాలవగా, వారిలో 15 మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వారిని తొలుత అమలాపురం ఏరియా, కిమ్స్ ఆస్పత్రులకు తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ అపోలో, ట్రస్ట్, సేఫ్ ఆస్పత్రులకు తరలించారు. కాకినాడలో 11 మంది, రాజమండ్రిలో ఇద్దరు, అమలాపురం కిమ్స్‌లో ఏడుగురు, రాజోలులో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు హాహాకారాలతో ఆస్పత్రులు దద్దరిల్లిపోతున్నాయి. బాధ భరించలేక ‘మమ్మల్ని చంపేయండి’ అని వైద్యులకు మొర పెట్టుకుంటుంటే చూసేవారికి గుండెల్ని పిండినట్టయింది. శ్మశానాన్ని తలపించిన ఘటనాస్థలి పేలుడు జరిగిన ప్రాంతం ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలతో శ్మశానాన్ని తలపించింది. అగ్ని కీలల్లో దగ్ధమై, మాంసపుముద్దల్లా మిగిలిన మృతులు, మాడి మోడుల్లా మిగిలిన కొబ్బరిచెట్లు, మంటల్లో చిక్కుకొని బూడిదైన పక్షులు.. ఏ వైపు చూసినా కన్ను తట్టుకోలేని బీభత్సమే.. గుండె భరించలేని విధ్వంసమే. ఈ ఘటనలో క పది కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. 12 ఇళ్లు, మండల వ్యవసాయశాఖ కార్యాలయం, ఒక షాపింగ్ కాంప్లెక్స్ అగ్నికి ఆహుతయ్యాయి. 15 ఎకరాల్లో కొబ్బరి తోటలు మాడిమసైపోయాయి. ఓఎన్జీసీ మినీ రిఫైనరీ, ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటరు (జీసీఎస్), గెయిల్ కార్యాలయాలు సమీపంలో ఉండడంతో పైపులైన్ ప్రారంభంలో ఈ ఘటన జరిగి ఉంటే ఊహకందనంత పెను విధ్వంసమే జరిగేది. పేలుడు ప్రాంతానికి చేరువలోనే మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. దుర్ఘటన పగటిపూట జరిగి ఉంటే వందల్లో ప్రాణ నష్టం ఉండేదని స్థానికులు అంటున్నారు. ఉదయం 5.10 గంటలకు ఘటన జరిగితే గంటన్నర వరకూ పోలీసులు మినహా అధికారులెవరూ కన్నెత్తై చూడలేదు. ఆరున్నరకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగసిపడే మంటలను అదుపు చేసేందుకు సాహసం చేయలేకపోయారు. ఒకటి తర్వాత మరొకటిగా ప్రభుత్వ అగ్నిమాపక శకటాలతో పాటు గెయిల్, రిలయన్స్, రవ్వ, కెయిర్న్ ఎనర్జీ, జీఎస్పీసీలకు చెందిన పది శకటాలు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. కాగా పేలుడుపై కేసు నమోదు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు. భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సీఎం డౌన్..డౌన్ గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా ప్రాణ, ఆస్తినష్టాలకు కారణమైన ఓఎన్జీసీ, జీసీఎస్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్ర హోదగ్రులయ్యారు. వందల మంది జీసీఎస్ మెయిన్ గేట్‌ను చుట్టుముట్టి గ్యాస్ కలెక్షన్ సెంటర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆ సంస్థ సిబ్బంది వాహనాలను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రతో కలిసి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సీఎం డౌన్ డౌన్..ఓఎన్జీసీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం వారిని సముదాయించి దుర్ఘటనను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ జరిపించి దుర్ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరామర్శించేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌లకు బాధితులు తమ గోడు వినిపించారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు. నగరంలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కోటగుమ్మం (రాజమండ్రి) : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైపులైన్ పేలుడుతో దగ్ధమైన విద్యుత్ లైన్లను పునరుద్ధరించినట్టు ఈపీడీసీఎల్ ఎస్ఈ (ఆపరేషన్స్) ఎన్. గంగాధర్ తెలిపారు. ఈ సంఘటనలో 49 హౌస్ సర్వీసులు, 9 హెచ్‌టీ, ఎల్టీ స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయాయన్నారు. ఇళ్ల సర్వీసులు ఎవరికి వారే వేసుకోవలసి ఉన్నా మానవతా దృక్పథంతో పునరుద్ధరించడంతో పాటు కొత్త స్తంభాలు వేశామన్నారు. -
మృత్యు విస్ఫోటం
* పేలిన గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ * 16 మంది దుర్మరణం * తూర్పుగోదావరి జిల్లా ‘నగరం’ గ్రామంలో దారుణం * 27 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం * కిలోమీటర్ పరిధిలో సర్వం బుగ్గి.. కోట్లలో ఆస్తి నష్టం * విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ: కేంద్రం * మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం * తీవ్ర గాయాలైన వారికి రూ. 5 లక్షలు * బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: చంద్రబాబు అమలాపురం/మామిడికుదురు/కాకినాడ క్రైం: పచ్చని కోనసీమలో ప్రాణాంతకమైన చిచ్చు ప్రజ్వరిల్లింది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం వేకువజామున గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పైపులైన్ ఒక్కసారిగా విస్ఫోటం చెందింది. 30, 40 మీటర్ల ఎత్తులో కోరలుసాచి విరుచుకుపడ్డ దావాగ్ని కీలలు చూస్తుండగానే విధ్వంసం సృష్టించాయి. దాదాపు కిలోమీటరు పరిధిలో పచ్చని గ్రామాన్ని భస్మీపటలం చేయడమేగాక 16 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. మరో 27 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పెనుగులాడుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రచండ వేగంతో ఎత్తివచ్చిన పెను మంటల బారిన పడి పలువురు నిద్రలోనే నిస్సహాయంగా సజీవ దహనమయ్యారు. ఇంకొందరు తప్పించుకునేందుకు అటూ ఇటూ పరిగెత్తుతూనే నిలువునా కాలిపోయారు. ఇద్దరు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఉదయం 5.10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాలం చెల్లిన పైప్ లైన్ కావడంతో గ్యాస్ ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయిందని చెబుతున్నారు. మంటల ధాటికి కిలోమీటర్ పరిధిలో పచ్చని కొబ్బరి తోటలు చూస్తుండగానే నిలువునా అంటుకున్నాయి. పావుగంట వ్యవధిలో కాలిపోయి మొండి మోడులై మిగిలాయి. పదుల కొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. గ్రామంలోనూ, ఊరి మీదుగా వెళ్తున్న 218 నంబర్ జాతీయ రహదారిపైనా పలు వాహనాలు బూడిద కుప్పలుగా మిగిలాయి. పైపులైను పేలుడు జరిగిన ప్రాంతంలో ఏకంగా 10 అడుగుల గొయ్యి ఏర్పడింది. పేలుడు ధాటికి పైపులైన్‌పై కప్పిన కాంక్రీట్ గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. చివరికి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పాక కూడా చాలాసేపు భూమిలోంచి పొగలు, వేడిగాలులు వచ్చాయి. పైగా మంటలను ఒకవైపు ఆర్పుతుండగానే అవి మరోవైపు చెలరేగుతూ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలికి సమీపంలోనే ఉన్న ఓఎన్జీసీ మినీ రిఫైనరీ, ఓఎన్జీసీ జీసీఎస్‌లకు మంటలు వ్యాపిస్తే పెను విధ్వంసమే జరిగి ఊరంతా శ్మశానప్రాయంగా మారేదే! కానీ అవి జీసీఎస్ మెయిన్ గేట్ దరిదాపుల వరకూ వ్యాపించి అక్కడితో ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చడమే గాక కోట్లలో ఆస్తి నష్టం కలగజేసిన ఈ ఘోరకలి లాభార్జనే తప్ప జనం భద్రత పట్టని చమురు సంస్థల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యం పొందినవారికి రూ. 5 లక్షలు, గాయాలపాలైన వారికి రూ. 50 వేలు తక్షణ సాయంగా అందిస్తామన్నారు. బాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. తామూ హై పవర్ కమిటీ వేశామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాబు ప్రకటించారు. అంతా క్షణాల్లో పైపులైను పేలుడు సంభవించిన సమయంలో గాలి ఉధృతంగా వీస్తుండడంతో ఆ ప్రాంతానికి పశ్చిమంగా అర కిలోమీటరు మేర క్షణాల్లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో ఏం జరిగిందో తెలిసేలోపే పలువురు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మాడి మసైపోయాయి. ఆ సమయంలో స్థానికులు, రోడ్డుపై ప్రయాణిస్తున్నవారు భీతిల్లి పరుగులు తీశారు. వారిని కూడా అగ్నిగోళాల్లాంటి మంటలు వెంటాడి గాయపరిచాయి. దూరంగా ఉన్నవారు అగ్నికీలల ఉగ్రరూపాన్ని చూసి కళ్లెదుటే తోటి మనుషులు తగలబడుతున్నా దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది, మరో ఇద్దరు ఉద్యోగులు, ఇతర కుటుంబాలకు చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి, కిమ్స్ ఆస్పత్రికి, రాజోలు ఏరియా ఆస్పత్రికి, రాజమండ్రి, కాకినాడ ఆస్పత్రులకు తరలించారు. 80 శాతానికి పైగా గాయాలవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాలిన గాయాలతో వారు చేస్తున్న ఆర్తనాదాలు అందరి హృదయాలనూ కలచి వేస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక జ్యోత్స్నాదేవి అనే చిన్నారి కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విస్ఫోటం జరిగిన చోటికి సమీపంలో మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. స్కూళ్లు పనిచేస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగి ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది. 40 మీటర్ల ఎత్తుకు ఎగసిన కీలలు పైప్‌లైన్‌లో గ్యాస్ ఎగదన్నడంతో మంటలు బ్లో అవుట్ తరహాలో దాదాపు 40 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే జీసీఎస్ నుంచి గ్యాస్ సరఫరా నిలిపివేసినా అప్పటికే పైపులో ఉన్న గ్యాస్ వల్ల గంట పాటు మంటలు ఎగదన్నుతూనే ఉన్నాయి. అంతెత్తున ఎగసిపడే మంటలను పైపులైన్ వద్దకు వెళ్లి ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలాసేపటి వరకూ సాహసించలేకపోయారు. పెను విషాదంపై అలసత్వం గ్యాస్ విస్ఫోటనంపై చమురు సంస్థల అధికారులు గానీ, ప్రభుత్వాధికారులు గానీ చురుగ్గా స్పందించలేదు. ఉదయం 5.10కి ఘోరం జరిగినా 6.30 వరకూ అగ్నిమాపక శకటాలు రాలేదు. పక్కనే ఉన్న జీసీఎస్, మినీ రిఫైనరీల అగ్నిమాపక శకటాలు కూడా వెంటనే రంగంలోకి దిగకపోవడంపై స్థానికులు మండిపడ్డారు. పోలీసులు తప్ప ఏ శాఖల అధికారులూ సకాలంలో స్పందించలేదు. చివరికి అగ్నిమాపక శకటాలు వచ్చి కొన్నిచోట్ల మంటలను అదుపు చేసినా, మరికొన్నిచోట్ల రాజుకుంటూనే ఉన్న మంటలను చూసీచూడనట్టు వదిలేశాయి. స్థానిక ఎమ్మెల్యేలు మండిపడడంతో వాటిని ఆర్పేందుకు ఉపక్రమించాయి. ప్రైవేటు చమురు సంస్థలు రవ్వ, రిలయన్స్‌లకు చెందిన శకటాలు వచ్చేసరికే మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయి. ప్రమాదంపై స్థానిక అధికారులు స్పందించలేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు, కలెక్టర్ నీతూ ప్రసాద్‌లకు బాధితులు ఫిర్యాదు చేశారు. తాటిపాక ఓఎన్జీసీ జీసీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఉపద్రవం జరిగిందని, తర్వాత కూడా వారు స్పందించలేదని ఆరోపిస్తూ స్థానికులు దానిపై దాడికి యత్నించారు. మెయిన్ గేట్‌ను దాటుకుని జీసీఎస్ వైపు దూసుకుపోయారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. సిబ్బంది వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. మంటలా, పేలుడా.. ఏది ముందు? ఈ ఘోరానికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ స్టేషన్ (జీసీఎస్) నుంచి విజయవాడలోని ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు ‘గెయిల్’ సంస్థ గ్యాస్ సరఫరా చేస్తోంది. దీనికి సంబంధించిన పైపులైన్ నగరం గ్రామం వద్ద వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో పేలిపోయింది. ఆ విస్ఫోటంతో పైపులైన్ నుంచి గ్యాస్ లీకై పరిసరాల్లో వ్యాపించింది. తర్వాత కొద్ది సమయానికే పైపులైన్ మరోసారి పేలిపోయింది. అప్పటికే చుట్టూ గ్యాస్ ఆవరించి ఉండడంతో రెప్పపాటు కాలంలోనే గ్రామాన్ని మంటలు చుట్టుముట్టాయి. సెకన్‌కు 40 కేజీల ఒత్తిడితో గ్యాస్ వెళ్తుండగా పైపులైన్ పేలిందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. రెండు పైపుల మధ్య జాయింట్ వద్ద ఈ పేలుడు సంభవించింది. సరిగ్గా ఇక్కడే మూడు నెలల క్రితం పైపులైన్ లీకైందని, అయినా గెయిల్ అధికారులు పట్టించుకోనందువల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే పైపులైన్ నుంచి గ్యాస్ లీకవుతూ వచ్చిందన్నది మరో కథనం. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూనే ఉంటుందని నగరం వాసులు పెద్దగా పట్టించుకోలేదు. అటు గెయిల్ అధికారులూ లీకేజీని గుర్తించలేదు. దీంతో ఆ ప్రాంతమంతా వాతావరణంలో గ్యాస్ కమ్ముకుంది. శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఒక హోటల్ యజమాని పొయ్యి వెలిగించబోగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కొందరు అంటుండగా, ఒక మహిళ ఇంట్లో పొయ్యి వెలిగించగానే విస్ఫోటం సంభవించిందని మరికొందరం టున్నారు. లీకైన తరువాత గాలి వాలు వల్ల ఓఎన్జీసీ జీసీఎస్ వైపు గ్యాస్ ఎక్కువగా వ్యాపించింది. ఈ కారణంగానే ప్రమాద తీవ్రత అటు మళ్లింది. జీసీఎస్ ప్రధాన గోడకు 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. అదే జీసీఎస్లో జరిగి ఉంటే ఊరంతా శ్మశానంగా మారేదని స్థానికులు అంటున్నారు. పక్షులూబుగ్గయ్యాయి గ్యాస్ అలముకున్నాక మంటలు చెలరేగడంతో చెట ్లమీది పక్షులు సైతం తప్పించుకునే వీలులేక మసిబొగ్గుల్లా మిగిలాయి. 12 ఇళ్లు, ఒక సంస్థ కార్యాలయం, ఓ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దగ్ధం కాగా, మరో పది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానికుల వాహనాలతో పాటు గ్రామంగుండా వెళ్తున్న 216 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారి వాహనాలు సైతం తగలబడిపోయాయి. సుమారు 15 ఎకరాల్లో కొబ్బరి తోటలు కాలి బూడిదయ్యాయి. రూ.10 కోట్ల వరకు ఆస్తినష్టం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. -
మంటల్లో కోనసీమ
లాభాల యావే తప్ప భద్రత పట్టని చమురు కంపెనీలు అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం నుంచి అపారమైన చమురు, సహజవాయువులను తరలించుకుపోతున్న చమురు సంస్థలు అక్కడి ప్రజల భద్రతను పూర్తిగా గాలికొదిలేశాయి. స్థానికాభివృద్ధి పేరుతో అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటూ ప్రమాదాల నిరోధానికి కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించడంలేదు. దీంతో కోనసీమ ఏ క్షణమైనా పేలే మందుపాతరలా మారిపోయింది. గత రెండు దశాబ్దాల్లో ఈ ప్రాంతంలో ఐదు బ్లో అవుట్లు సంభవించాయి. పదుల సంఖ్యలో పైప్‌లైన్ లీకేజీలు జరిగాయి. ఆ ఘటనల్లో కేవలం ఆస్తి నష్టాలే జరిగాయి. తాజాగా నగరంలో శుక్రవారం సంభవించిన గ్యాస్ పైపులైన్ పేలుడులో 16 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 27 మంది క్షతగాత్రులై విషమ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆక్రోశిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రకటనలు గుప్పించడం, తరువాత ఆ విషయాన్ని గాలికి వదిలేయడం షరా మామూలైందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజల భద్రత గాలికి... కోనసీమ భూగర్భంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర చమురు సంస్థలకు చెందిన గ్యాస్ పైపులైన్లు ఉన్నాయి. 30కి పైగా చమురు బావులున్నాయి. తాటిపాకలో మినీ రిఫైనరీ, గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ఉన్నాయి. కేజీ బేసిన్ పరిధిలో తరచూ ఏదో ఒకచోట గ్యాస్ లీకవ్వడం, ఆస్తి నష్టం వాటిల్లడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఓఎన్జీసీ గతంలో ఒక అధ్యయన కమిటీని నియమించింది. ఈ ప్రాంత భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువైనందున పైపులైన్లు త్వరగా తుప్పుపట్టి పాడైపోతాయని కమిటీ తేల్చి చెప్పింది. కనీసం ప్రతి ఏడేళ్లకోసారైనా పైపులైన్లను తప్పక మార్చాలని సూచించింది. అయితే ఈ నివేదికను ఓఎన్జీసీ బుట్టదాఖలు చేసింది. ఇక ప్రైవేటు చమురు సంస్థల గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. తాటిపాక గెయిల్ టెర్మినల్ పాయింట్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ సంస్థకు పైపులైన్ ద్వారా రోజుకు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఇందుకు 18 ఎం.ఎం. ట్రంక్ పైపులతో 15 ఏళ్ల కిందట పైప్‌లైన్ వేశారు. అధ్యయన కమిటీ సూచనల మేరకు దాన్ని ఇప్పటికి రెండుసార్లు మార్చాల్సి ఉండగా అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మూడు నెలల కిందట గ్యాస్ లీకవ్వగా తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. అప్పుడే పటిష్టమైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పెనువిషాదం వాటిల్లేది కాదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బుగ్గి చేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉత్తుత్తి ఉద్యమాల్లో నాయకులు ఈ ప్రాంత సహజ సంపదతో కోట్లు ఆర్జిస్తున్న చమురు సంస్థలు నిబంధనల ప్రకారం లాభాల్లో 2 శాతం ఆ ప్రాంతం అభివృద్ధికి వెచ్చించాల్సి ఉంది. ఈ నిబంధన ను ఆ సంస్థలు ఏనాడూ నూరుశాతం అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రజలు దీనిపై పోరాటాలు చేస్తున్నా ఖాతరు చేయడంలేదు. ప్రజాప్రతినిధులు సైతం ఉత్తుత్తి ఉద్యమాలే చేసి ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
ఒకే నెలలో రెండు పెను విషాదాలు
ఒకే నెలలో సంభవించిన రెండు పెను విషాదాలు తెలుగువారికి అంతులేని ఆవేదన మిగిల్చాయి. పంచభూతాలైన నీరు, నిప్పు పగబట్టి 40 మంది తెలుగువారి ఉసురు తీశాయి. బియాస్ నది రూపంలో జలరక్కసి 24 మంది విద్యార్థులను కానరాని లోకాలకు తీసుకుపోయింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే కోనసీమ వాసులపై గ్యాస్ రూపంలో మృతువు కాటేసింది. నగరం గ్రామాన్ని నరకంగా మార్చేసి 16 మందిని మింగేసింది. విహారయాత్రకని వెళ్లిన 24 మంది విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను హిమచల్ ప్రదేశ్ లోని బియాస్ నది మింగేసింది. కులుమనాలి సమీపంలో మండిలోని తలౌటి ప్రాంత్రం వద్ద జూన్ 8న జరిగిన ఈ ఘటన విద్యార్థులకు తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది. తామెంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కంటిపాపలను క్షణాల్లో జలరక్కసి ఎత్తుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టేలోపే ప్రవాహంలోకి లాక్కుపోయింది. బియాస్ విషాదం తాలుకూ తడి ఆరకముందే తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామాన్ని శుక్రవారం (జూన్ 27న) ఉదయం మృత్యుజ్వాల కమ్మేసింది. గ్యాస్ రూపంలో 16 మందిని మసి చేసింది. నిలువెల్లా కాల్చేసి బూడిద మిగిల్చింది. అన్నెంపున్నెం ఎరుగని పల్లెవాసుల శరీరాలను ఛిద్రం చేసి 15 మందిని ఆస్పత్రి పాల్జేసింది. రక్కసి కీలలకు ఇంకా ఎంత మంది బలౌతారోనని బాధిత కుటుంబాలు భీతిల్లుతున్నాయి. బియాస్, నగరం విషాదాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. హిమచల్ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించి బియాస్ దుర్ఘటనకు కారణమయ్యారు. ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం నగరం ప్రజల పాలిట మృత్యుజ్వాలగా మారింది. బియాస్ నదిలో గల్లంతైన కొంత మంది విద్యార్థుల శవాలు ఇంకా దొరక్కపోవడం విషాదంలో విషాదం. నగరం ఘటనలో కళ్లెదుటే 16 మంది కాలి బూడిదయిపోవడం గుండెలు పిండేసే విషాదం. పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కొనసాగినంతకాలం ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. -
బియాస్ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యం
-
బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో మరొకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. బియాస్ నదిలోని పాండో రిజర్వాయర్‌లో మృతదేహన్ని ఎన్డీఆర్ఐ అధికారులు గుర్తించారు. అయితే లభ్యమైన మృతదేహం శివప్రసాద్ వర్మ మృతదేహంగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం విద్యార్థి మృతదేహన్ని హైదరాబాద్‌కు తరలించనున్నట్టు సమాచారం. -
మరో మృతదేహం లభ్యం
బియాస్ నదిలో గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో మరొకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. బియాస్ నదిలోని పండో డ్యాం బ్యాక్ వాటర్‌లో తేలిన ఆ మృతదేహం పి.వెంకట దుర్గా తరుణ్‌గా గుర్తించారు. అక్కడే దొరికిన మరో మృతదేహం స్థానికుడిదిగా తేలింది. అదేప్రాంతంలో మూడో మృతదేహం కనిపించింది. అయితే గజ ఈతగాళ్లు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలు దొరికాయని, మిగతా 15 మృతదేహాలకోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. బియాస్ నది వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి బుధవారం అక్కడినుంచే ‘సాక్షి’తో మాట్లాడుతూ 11వ రోజు గాలింపు వివరాలు తెలిపారు. ఆయన చెప్పిన మేరకు... ఉదయం ఆరు గంటల నుంచి దాదాపు 200 బోట్లతో 600 మంది ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్తోపాటు తెలంగాణకు చెందిన పోలీసు గజ ఈతగాళ్లు విస్తారంగా గాలింపు చర్యలను చేపట్టారు. పండో డ్యాం బ్యాక్ వాటర్‌లో రెండు మృతదేహాలు తేలడాన్ని గమనించి స్వాధీనం చేసుకున్నారు. మరో మృతదేహాన్ని అందుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్వాధీనం చేసుకున్న రెండు మృతదేహాలను ఒడ్డుకు తీసుకురాగా అందులో ఒకటి గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థి వెంకట దుర్గా తరుణ్‌గా అక్కడున్న కాలేజీ ఫ్యాకల్టీ గుర్తించారు. మరో మృతదేహం స్థానికుడిదిగా మండి పోలీసులు తేల్చారు. దీంతో పోస్టుమార్టం పూర్తయ్యాక తరుణ్ మృతదేహాన్ని రోడ్డుమార్గం ద్వారా ఢిల్లీలోని ఏపీ భవన్‌కు తరలించారు. అక్కడినుంచి గురువారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. చివరి మృతదేహం దొరికేంతవరకు తాను, రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ సెక్రటరీ లవ్ అగర్వాల్, అదనపు డీజీ రాజీవ్ త్రివేది, గ్రేహౌండ్స్ ఎస్పీ కార్తికేయ, ఇతర పోలీసులు ఇక్కడే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. కుప్పకూలిన తరుణ్ తల్లిదండ్రులు బియాస్ ఘటనలో తమ కుమారుడు వెంకటదుర్గ తరుణ్ మృతిచెందాడని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుంటూరు జిల్లా పిడపర్తిపాలెంకు చెందిన తరుణ్ తల్లిదండ్రులు సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులు చందానగర్‌లోని టెల్కట్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. తరుణ్ రెండవ కుమారుడు. కాగా, సీఎం కేసీఆర్‌ను డీజీపీ అనురాగ్ శర్మ బుధవారం కలిసి బియాస్ నదిలో గాలింపు చర్యలపై వివరాలను వెల్లడించారు. -
పదో రోజూ ఫలించని గాలింపు
మండీ: హిమచల్‌ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన 17 మంది విద్యార్థుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలు మంగళవారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పదో రోజూ ఫలితం శూన్యం. రోజంతా గాలించినా ఒక్క మృతదేహం కూడా దొరకలేదు. మరోవైపు ముందుగా వచ్చిన రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు గాలింపు చర్యలకు సవాల్ గా మారాయి. గల్లంతైన విద్యార్థుల కోసం పదిరోజులుగా అణువణువునా గాలించినా ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, నావికా దళానికి చెందిన సైడ్ స్కాన్ సోనార్ పరికరం ఉపయోగించి గాలింపు జరిపినా విద్యార్థుల మృతదేహాల జాడ తెలియలేదు. హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది ఈ నెల 8న బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. -
ఇసుక మాఫియా వల్లే బియాస్ విషాదం
సిమ్లా: బియాస్ నది నుంచి ఇసుక అక్రమ రవాణ సాగుతోందని, విద్యార్థులు గల్లంతు కావడానికి కొంతవరకు ఇది కూడా కారణమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖష్ అగ్నిహోత్రి ఆదివారం ప్రమాద సంఘటనను సందర్శించారు. బియాస్ నది నుంచి ఇసుక అక్రమ రవాణ అరికట్టేందుకు లింక్ రోడ్లన్నంటినీ మూసివేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నది దగ్గరకు ట్రాక్టర్లు వెళ్లేందుకు వీలుగా ఇసుక మాఫియా చిన్నచిన్న దారులను ఏర్పాటు చేసిందని అధికారులు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను తీసుకెళ్లిన బస్సు హైవే దిగిన తర్వాత ఇలాంటి మార్గంలోనే సంఘటనా స్థలానికి చేరుకుందని తెలిపారు. అంతేగాక లార్జీ డ్యామ్ నిర్వాహకులు ఇసుక మాఫియాతో చేతులు కలిపారని, అక్రమ రవాణకు వీలుగా అప్రకటిత సమయంలో డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారని అధికార వర్గాలు తెలిపాయి. విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 24 మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
విద్యార్థులది తప్పెందుకు అవుతుంది?
-
విద్యార్థులది తప్పెందుకు అవుతుంది?
హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది దుర్ఘటన విషయంలో వీఎన్ఆర్ కాలేజి యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఘెరావ్ చేశారు. ఈ సంఘటనలో విద్యార్థులదే తప్పని యాజమాన్యం భావిస్తోందని, కానీ నిజానికి వారిని పర్యటనకు తీసుకెళ్లిన ట్రావెల్స్‌కు అసలు అనుభవం లేదని, ఆ ట్రావెల్స్ కంపెనీకి లైసెన్సు కూడా లేదని వారు మండిపడ్డారు. కాలేజి ప్రధాన కార్యదర్శి డీఎన్ రావును తల్లిదండ్రులు ఈ విషయమై గట్టిగా నిలదీశారు. ఈ సంఘటనలో విద్యార్థుల తప్పు లేదని, నది పక్కనే రోడ్డు ఉండటంతో వాళ్లు లోనికి దిగారని, ఘటనలో తప్పు ఎవరిదనే విషయం విచారణలో తేలుతుందని వీఎన్ఆర్ కాలేజి ప్రధాన కార్యదర్శి డీఎన్ రావు తెలిపారు. చనిపోయిన విద్యార్థులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు తాము ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
బియాస్ విషాదం నుంచి మేల్కోవాలి
సిమ్లా: ప్రకృతి సౌందర్యానికి హిమాచల్ ప్రదేశ్ మారుపేరు. కొండలు, కోనలు, వాగులు, పర్వతాలు, జలపాతాలు, ఆహ్లాదకర వాతావరణంతో భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. అందుకే ఈ ఉత్తరాది రాష్ట్రం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అయితే అక్కడికెళ్లే పర్యాటకుల భద్రత గాలిలో దీపం వంటిది. ఇందుకు బియాస్ దుర్ఘటనే ఉదాహరణ. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు 24 మంది నదిలో గల్లంతయ్యారు. ఈ విషాదం నుంచైనా హిమాచల్ ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. పర్యాటకుల తగిన భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. హిమాచల్‌లో సట్లజ్, బియాస్, యమున, చెనాబ్, రవి నదులు, వాటి ఉపనదులు ప్రవహిస్తాయి. ఇవి ఎక్కువగా జాతీయ, రాష్ట్ర రహదారులకు సమాంతరంగా ప్రవహిస్తాయి. కొన్ని చోట్ల కొండలోయల మధ్యన నదులు ప్రవహిస్తాయి. ఇలాంటి పర్వత ప్రాంతాల్లో భయంకరమైన మలుపు మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లోకే. ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు అదుపు తప్పి లోయలు, నదుల్లోకి బోల్తాపడుతుంటాయి. తాజాగా హైదరాబాద్ విద్యార్థుల విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అయినా హిమాచల్ ప్రభుత్వం మేలుకొన్నట్టు లేదు. భద్రతకు సంబంధించి పర్యాటకులను హెచ్చరించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ చాలా మార్గాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. మనాలి ప్రాంతంలోనే ప్రతి ఏటా కనీసం ఐదారుగురు చనిపోతున్నారని పోలీసు కేసులు చెబుతున్నాయి. ఇక గాయలబారిన పడటం, చిన్న చిన్న సంఘటనలు రికార్డుల్లో ఉండవు. 'పర్యాటకులు నదులు, అక్కడి వాతావరణానికి ఆకర్షితులవుతారు. నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా నదుల్లోకి దిగుతారు. అకస్మాత్తుగా ప్రవాహం పెరగడంతో క్షణాల్లు కొట్టుకుపోతారు' అని మనాలికి చెందిన టూర్ ఆపరేటర్ చెప్పారు. ఆదివారం బియాస్ నది దుర్ఘటన కూడా ఇలాంటిదే అని విశ్లేషించారు. హిమాచల్ ప్రదేశ్‌లో చాలా హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తిని బట్టి డ్యాం గేట్లను తరచూ ఎత్తేస్తుంటారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఇలాంటి ప్రమాదాల గురించి ముందే హెచ్చరించాల్సిన అవసరముందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అంతేగాక హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఉంచడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ముళ్ల తీగలను ఏర్పాటు చేయాలని చెప్పారు. -
చిట్టచివరి నిమిషం వరకు ఆనందంగా..
ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు వరకు అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగానే ఉన్నారు. వెనక నుంచి నీటి రూపంలో వెంటాడుతూ వస్తున్న మృత్యువును ఎవరూ గుర్తించలేకపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది వద్ద సంభవించిన ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి నుంచి సరదాగా వెళ్లిన విద్యార్థులు విషణ్ణ వదనాలతో రావాల్సి వచ్చింది. తొలుత పండో డ్యామ్‌కు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులు.. రాళ్ల మధ్య నుంచి వంపులు తిరుగుతూ వెళ్తున్న నీళ్లను చూసి పరవశించిపోయారు. అడుగు లోతు కూడా లేకపోవడంతో సరదాగా లోపలకు దిగారు. వెళ్లే ముందు కూడా ఎందుకైనా మంచిదని అక్కడున్న స్థానికులను ఓసారి అడిగారు. అదంత ప్రమాదకరమైన ప్రదేశం కాదని, అయితే కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండాలని వాళ్లు చెప్పడంతో అందరూ ఉత్సాహంగా లోపలకు వెళ్లారు. చాలాసేపు ఫొటోలు తీసుకున్నారు. వీడియోలు కూడా తీశారు. ఒకరిద్దరైతే వెంటనే వాట్స్ యాప్ లాంటివాటి ద్వారా షేర్ చేశారు. రాళ్ల గుట్టలు ఎక్కి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించారు. సరదాగా జోకులు వేసుకున్నారు, నవ్వుకున్నారు. క్షణాల్లోనే కాళ్ల కిందకు నీళ్లు వచ్చేశాయి. ఒడ్డున ఉన్న స్థానికులు వీళ్లను అప్రమత్తం చేసేందుకు బయటకు రమ్మంటూ చేతులు ఊపారు. కానీ, వాళ్లు హాయ్ చెబుతున్నారని అనుకోవడంతో వీళ్లు కూడా చేతులు ఊపారు తప్ప.. అపాయాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయారు. పిల్లలు నిలబడిన చిన్నపాటి రాళ్లు కొట్టుకుపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయారు. చాలామంది నీళ్లలో కొట్టుకుపోగా.. దాదాపు సగం మంది మాత్రం మిగిలినవారి సాయంతో బయటపడ్డారు. -
మృతుల కుటుంబాలకు లక్షన్నర పరిహారం
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది. బియాస్ నదీ ప్రమాదంలో దాదాపు 24 మంది తెలుగు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీతో కూడిన బృందం కులు మనాలికి విహారయాత్ర కోసం వెళ్లి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గల్లంతైన వారి ఆచూకీ కోసం దాదాపు 550 మంది పారామిలటరీ బలగాలు అక్కడ ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
నలుగురిని కాపాడి.. కొట్టుకుపోయాడు!!
ఒకవైపు బియాస్ నదీ జలాలు ఉధృతంగా తరుముకొస్తున్నాయి.. మరోవైపు స్నేహితులు నీటిలో కొట్టుకుపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయినా ముందు తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ నలుగురు స్నేహితుల ప్రాణాలు కాపాడాడు. అతడిపేరు ముప్పిడి కిరణ్ కుమార్. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముప్పిడి వెంకటరమణ కుమారుడైన కిరణ్ తన స్నేహితులను కాపాడి, తాను మాత్రం గల్లంతైపోయాడు. ప్రమాదస్థలంలో కిరణ్‌కు సమీపంలో ప్రత్యూష అనే విద్యార్థినితో పాటు మరో విద్యార్థిని ఉన్నారు. వాళ్లిద్దరినీ కాపాడేందుకు కిరణ్ నదీ ప్రవాహంలోనే ఉండిపోయాడు. వారితో పాటు మరో ఇద్దరిని అత్యంత కష్టమ్మీద ఒడ్డుకు చేర్చాడు. తమ బృందానికి నాయకుడిగా ఉన్న అతడు.. తనను తాను మాత్రం కాపాడుకోలేకపోయాడు. ''నీటిమట్టం పెరుగుతున్నట్లు గుర్తించగానే కిరణ్ ప్రమాదాన్ని ఊహించి మమ్మల్ని ఒడ్డువైపు నెట్టేశాడు. మేమంతా ఒడ్డుకు చేరుకుని, కిరణ్ ఎక్కడున్నాడా అని చూశాం. అతడు నీళ్లలోంచి బయటకు రావడానికి కష్టపడుతున్నట్లు మాకు అర్థమైంది. కానీ అతడు ఎలాగైనా వస్తాడన్న ఆశతోనే మేం చాలాసేపు చూశాం. కానీ, కింద ఉన్న రాయి కొట్టుకుపోవడంతో కిరణ్ కూడా నీళ్లలో కొట్టుకుపోయాడు'' అని ప్రత్యూష తెలిపింది. తన కుమారుడికి ఈత బాగా వచ్చని, అతడు ఎలాగోలా ఎక్కడో ఒక చోట సురక్షిత ప్రాంతానికి చేరుకునే ఉంటాడని కిరణ్ తండ్రి వెంకటరమణ అన్నారు. ఆయనతో పాటు అతడి స్నేహితులు చాలామంది చేస్తున్న ప్రార్థనలు ఫలించి, కిరణ్ బయటపడే అవకాశాలు కూడా లేకపోలేవు!! -
నీళ్లు వదిలేటప్పుడు హెచ్చరికలేవీ: హైకోర్టు
హిమాచల్ ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బియాస్ నది ఘటనను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. లార్జి ప్రాజెక్టు అధికారులపై కూడా కోర్టు మండిపడింది. ఈ దుర్ఘటన వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందని, నీళ్లు వదిలేటప్పుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఎలా సంభవించింది, అందుకు కారణాలేంటన్న వివరాలతో ఈనెల 16వ తేదీలోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు సహాయక చర్యల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 గంటలు గడిచినా, ఇంతవరకు చాలామంది ఆచూకీ తెలియలేదని, ఆచూకీ తెలుసుకోడానికి సైన్యాన్ని రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతం సురక్షితమేనని చెప్పడం వల్లే తామంతా ఫొటోలు తీసుకోడానికి కిందకు దిగామని సురక్షితంగా బయటపడిన విద్యార్థులలో కొందరు చెప్పారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నీళ్లు పెద్ద స్థాయిలో రావడంతో ఆ సమయానికి ఏం చేయాలో కూడా తెలియలేదని అన్నారు. అది ప్రమాదకరమైన ప్రాంతం అని తమకు ఎవరూ చెప్పలేదని విద్యార్థులు తెలిపారు.