హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నది దుర్ఘటన విషయంలో వీఎన్ఆర్ కాలేజి యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఘెరావ్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నది దుర్ఘటన విషయంలో వీఎన్ఆర్ కాలేజి యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఘెరావ్ చేశారు. ఈ సంఘటనలో విద్యార్థులదే తప్పని యాజమాన్యం భావిస్తోందని, కానీ నిజానికి వారిని పర్యటనకు తీసుకెళ్లిన ట్రావెల్స్కు అసలు అనుభవం లేదని, ఆ ట్రావెల్స్ కంపెనీకి లైసెన్సు కూడా లేదని వారు మండిపడ్డారు. కాలేజి ప్రధాన కార్యదర్శి డీఎన్ రావును తల్లిదండ్రులు ఈ విషయమై గట్టిగా నిలదీశారు.
ఈ సంఘటనలో విద్యార్థుల తప్పు లేదని, నది పక్కనే రోడ్డు ఉండటంతో వాళ్లు లోనికి దిగారని, ఘటనలో తప్పు ఎవరిదనే విషయం విచారణలో తేలుతుందని వీఎన్ఆర్ కాలేజి ప్రధాన కార్యదర్శి డీఎన్ రావు తెలిపారు. చనిపోయిన విద్యార్థులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు తాము ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.