
సాక్షి, హైదరాబాద్: క్రీస్తు పూర్వమే భారతీయులకు వైమానిక శాస్త్రం గురించి తెలుసా..? మహాభారత కాలం నాడే టెస్ట్ ట్యూబ్ బేబి టెక్నాలజీ వాడుకలో ఉండేదా..? జలాంతర్గాముల గురించి ఇతర ప్రపంచం కంటే ముందే మనకు తెలుసా...? వంటి విషయాలను ఇకపై ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకోనున్నారు.
బీటెక్‌లో ఎలక్టివ్ సబ్జెక్టుగా వేదిక్ సైన్స్‌ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఏఐసీటీఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వేదిక్ సైన్స్ సబ్జెక్టు కోసం భారతీయ విద్యాభవన్ ప్రచురించిన ‘భారతీయ విద్యా సార్’పుస్తకాన్ని ఎంచుకుంది. ఏఐసీటీఈ నిర్ణయంపై పలువురు విద్యావేత్తలు, మేధావుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.