విశాఖపట్నం జిల్లా బీమిలి పట్టణంలోని మీ సేవా కేంద్రాన్నిలో గత అర్థరాత్రి దుండగులు చోరీకి యత్నించారు. అందులోభాగంగా లాకర్ను డ్రిల్లింగ్ మిషన్తో ఒపెన్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ఆ క్రమంలో మీ సేవా కేంద్రంలో పెద్ద పెద్ద శబ్దాలు వెలువడ్డాయి. దీంతో నిద్ర పోతున్న స్థానికులు మెల్కొన్నారు. ఆ విషయాన్ని గ్రహించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే స్థానికులు దుండగులను వెంబడించారు. దుండగల వేగాన్ని స్థానికులు అందుకోలేకపోవడంతో వారు పారిపోయారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల మీ సేవా కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.