
రీటా (ఫైల్ )
సాక్షి, పీఎంపాలెం (భీమిలి): అతిగా ఫోన్లో మాట్లాడవద్దని మామయ్య మందలించడంతో ఓ యువతి అపార్టుమెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పీఎంపాలెం ఎస్‌ఐ హరికృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన రీటా (20) ఇంటర్ వరకూ చదువుకుంది. తల్లి ఇటీవల మృతి చెందగా...తండ్రి ఎక్కడున్నాడో తెలియదు.
అప్పటి నుంచి మధురవాడ భరత్‌నగర్‌లో నివాసముంటున్న మామయ్య సోబన్‌కుమార్ పాణీ సంరక్షణలో ఉంటోంది. తరుచూ ఆమె ఫోన్లో మాట్లాడడం గమనించి మందలించాడు. దీనిని అవమానంగా భావించిన రీటా బుధవారం అపార్టుమెంటు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సోబన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: ఫ్యాన్సీ స్టోర్‌లో చొరబడి.. కత్తులతో పొడిచి మహిళ హత్య
Comments
Please login to add a commentAdd a comment