
సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. కొంతకాలం ఓ వెలుగు వెలిగిన కూడా అంతలోనే కనుమరుగైన వారు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నా.. దాన్ని నిలబెట్టుకోవాలంటే అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అలా వచ్చి ఇలా వెళ్లినవారిలో శరణ్య మోహన్ కూడా ఒకరు. తెలుగుతో పాటు తమిళంలో శరణ్య మోహన్ హీరోయిన్‌గా మెప్పించింది. అయితే తను ఇప్పుడే చేస్తోంది? ఇప్పుడెలా ఉందో ఓ లుక్కేద్దాం.
(ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..)
నేచురల్ స్టార్ నాని సరసన భీమీలి కబడ్డీ జట్టు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది శరణ్య మోహన్. ఈ చిత్రం 2010లో విడుదలైంది. అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. కల్యాణ్ రామ్ మూవీ కత్తి సినిమాలో ఆయనకు చెల్లెలిగా కనిపించింది. కానీ ఆ తర్వాత అంతే వేగంగా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్‌ను వివాహమాడింది.
ఆమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న ఈ మలయాళ కుట్టి లేటెస్ట్ ఫొటోస్‌ను షేర్ చేస్తుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు. నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఫ్యామిలీతోనే కాలం గడిపేస్తోంది.
(ఇది చదవండి: క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా?.. ఓపెన్‌గానే చెప్పేసిన హీరోయిన్!)
Comments
Please login to add a commentAdd a comment