saranya mohan
-
ఒకప్పుడు బిజీ హీరోయిన్.. నానితో హిట్ సినిమా.. ఇప్పుడేమో సొంత అకాడమీ (ఫొటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఈమె ఎవరంటే?
సినిమా హీరోయిన్లు.. ఇండస్ట్రీకి దూరమైపోతే బయట పెద్దగా కనిపించరు. ఒకవేళ వాళ్ల ఫొటోలు ఒకటో రెండో కనిపించినా సరే సడన్‌గా గుర్తుపట్టడం కాస్త కష్టమవుతుంది. ఎందుకంటే అంతలా మారిపోతారు. ఇప్పుడు కూడా అలానే ఓ బ్యూటీ కనిపించింది. ఈమె తెలుగులో నాని హిట్ సినిమాలో చేసిన హీరోయిన్. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శరణ్య మోహన్. అలెప్పీలో పుట్టిన ఈ కేరళ కుట్టి.. చిన్నప్పుడే అంటే ఎనిమిదేళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో మూడు, తమిళంలో రెండు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. టీనేజ్‌లోకి వచ్చాక సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలా కొన్నాళ్లకు హీరోయిన్ అయిపోయింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్? అసలు విషయం ఇదే) 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలో హీరోయిన్గా చేసిన శరణ్య మోహన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నాని 'భీమిలి కబడ్డీ జట్టు' మూవీలో నటించి మనసు దోచేసింది. 'కల్యాణ్ రామ్ కత్తి', 'హ్యాపీహ్యాపీగా' చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఇవి తప్పితే మరో తెలుగు మూవీలో నటించలేదు. అలా టాలీవుడ్‌కి దూరమైపోయింది. 1997 నుంచి 2014 వరకు సినిమాల్లో నటించిన శరణ్య మోహన్.. 2015లో తన చిన్నప్పటి ఫ్రెండ్ అరవింద్ కృష్ణన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈమెకి సినిమాలు చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఉంటుందేమో తెలీదు. ఇకపోతే స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన శరణ్య.. తన డ్యాన్స్ వీడియోలని సోషల్ మీడియాలో అప్పడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే హీరోయిన్గా ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. అందుకే తెలుగు ఆడియెన్స్ గుర్తుపట్టలేకపోయారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) View this post on Instagram A post shared by Saranya Mohan (@saranyamohanofficial) -
భీమిలీ కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా!
సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. కొంతకాలం ఓ వెలుగు వెలిగిన కూడా అంతలోనే కనుమరుగైన వారు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతో స్టార్డమ్ సొంతం చేసుకున్నా.. దాన్ని నిలబెట్టుకోవాలంటే అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అలా వచ్చి ఇలా వెళ్లినవారిలో శరణ్య మోహన్ కూడా ఒకరు. తెలుగుతో పాటు తమిళంలో శరణ్య మోహన్ హీరోయిన్గా మెప్పించింది. అయితే తను ఇప్పుడే చేస్తోంది? ఇప్పుడెలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..) నేచురల్ స్టార్ నాని సరసన భీమీలి కబడ్డీ జట్టు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది శరణ్య మోహన్. ఈ చిత్రం 2010లో విడుదలైంది. అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. కల్యాణ్ రామ్ మూవీ కత్తి సినిమాలో ఆయనకు చెల్లెలిగా కనిపించింది. కానీ ఆ తర్వాత అంతే వేగంగా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్‌ను వివాహమాడింది. ఆమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న ఈ మలయాళ కుట్టి లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేస్తుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు. నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఫ్యామిలీతోనే కాలం గడిపేస్తోంది. (ఇది చదవండి: క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా?.. ఓపెన్‌గానే చెప్పేసిన హీరోయిన్!) View this post on Instagram A post shared by Saranya Mohan (@saranyamohanofficial) -
మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న శరణ్యా
తమిళసినిమా: నటి శరణ్యా మోహన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. కోలీవుడ్‌లో వెన్నెలా కబడి కుళు చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అయిన కేరళా కుట్టి శరణ్యామోహన్ . ఆ తరువాత ఈరం, వేలాయుధం తదితర చిత్రాల్లో నటించారు. మాతృభాష మలయాళంతో పాటు తెలుగులోనూ వినాయకుడు తదితర చిత్రాల్లో నాయకిగా నటించారు. ఈమె హిందీలోనూ కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే సినిమా చెల్లెలిగానే ఎక్కువ గుర్తింపు పొందిన శరణ్యామోహన్ గత ఏడాది కేరళ రాష్ట్రం, తిరువనంతపురం ప్రాంతానికి చెందిన దంత వైద్యుడు అరవింద్ కృష్ణను వివాహం చేసుకుని ఎక్కువ సమయాన్ని సంసార జీవితానికే కేటాయించారు. కాగా శరణ్యామోహన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. -
పెళ్లిపీటలెక్కుతున్న హీరోయిన్
మరో హీరోయిన్ పెళ్లికూతురు కాబోతుంది. 'విలేజ్‌లో వినాయకుడు, కబడ్డీ కబడ్డీ, హ్యాపీ హ్యాపీగా' చిత్రాల్లో నటించిన ఆమె త్వరలో వివాహం చేసుకోబోతుంది. అమాయకంగా, పక్కింటి అమ్మాయిలా ఉండే శరణ్యా మోహన్ తెలుగులో కొన్ని చిత్రాల్లోనే నటించినా తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే ఆమెకు ఓ దంత వైద్యుడు అరవింద్ కృష్ణన్‌తో కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయాన్ని శరణ్యా మోహనే స్వయంగా (జులై 12న) తన ఫేస్బుక్ ద్వారా తెలిపింది. తన జీవితంలో ఇది చాలా ముఖ్యమైందని ఆమె పేర్కొంది. 'కాదలుక్కు మరియాదై' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన మలయాళీ బ్యూటీ శరణ్యామోహన్. ఆ చిత్రంలో మాదిరిగానే పలు చిత్రాల్లో చెల్లెలిగా నటించిన ఆమె అనంతరం 'వెన్నెలాకబడ్డీకుళు' చిత్రంతో కథానాయికిగా ఎదిగారు. త్వరలో వీరి వివాహం జరగనుంది. బెస్ట్ ఆఫ్ లక్ శరణ్యా మోహన్. 'I am taking this opportunity to officially announce you all about the most important day of my life that is about to come...my marriage...I got engaged today to Aravind Krishnan, Doctor by profession. Please do pray for me even after marriage. Thanking you all for the love and support' -
హీరోలతో అలా నటించను
సినిమాలో మార్కెట్ కోసం గ్లామరస్‌గా నటించనని ఖరాఖండిగా చెబుతోంది నటి శరణ్యా మోహన్. కుటుంబ కథా చిత్రాల్లోనే నటిస్తానని మొదట్లో స్టేట్మెంట్స్ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లు ఒకటి రెండు చిత్రాల తర్వాత పూర్తిగా గ్లామర్‌కు మారిపోతున్నారు. పూ చిత్రం ఫేమ్ పార్వతి, అనన్య, నజ్రినా నజిమ్ వంటి హీరోయిన్లు మాత్రం గ్లామర్ పాత్రలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఈ కోవకు చెందిన నటి శరణ్యా మోహన్. తమిళంలో వెన్నిలా కబడి కుళు చిత్రం ద్వారా హీరోయిన్గా తెరపైకి వచ్చిన ఈ మలయాళీ భామ బాలనటిగానే చిత్ర రంగ ప్రవేశం చేసింది. పలు చిత్రాల్లో హీరోలకు ముద్దుల చెల్లెలిగా నటించింది. టాలీవుడ్‌లోను హీరోయిన్గా అడపాదడపా నటిస్తున్న ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలకు మాత్రం ససేమిరా అంటోంది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ గ్లామర్‌గా నటిస్తేనే సినిమాలో కొనసాగగలమన్న విషయాన్ని నేను అంగీకరిస్తానని తెలిపారు. అందుకు గ్లామరస్ దుస్తులు అవసరమేనన్నారు. అలా నటించడానికి తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. చిత్రంలో వ్యాపార దృక్పథం కోసం హీరోలతో అత్యంత సన్నిహితంగా నటించడం తనవల్లకాదన్నారు. అదే విధంగా అరకొర దుస్తులు ధరించి నటించనని వెల్లడించారు. పక్కింటి అమ్మాయిని చూడగానే ఎంత చక్కగా ఉందనిపిస్తుందో అలాంటి మంచి కథా పాత్రల్లోనే నటిస్తానని శరణ్యా మోహన్ పేర్కొన్నారు. -
ప్రచారానికి రాకపోతే...పారితోషికంలో కోత..!
‘సినిమాలో యాక్ట్ చేస్తాం.. పబ్లిసిటీ కార్యక్రమాల్లో మాత్ర పాల్గొనం’ అంటూ కొంతమంది కథానాయికలు ముందుగానే షరతులు విధిస్తుంటారు. ఒకవేళ ఎలాంటి నిబంధనలు విధించకపోయినా.. చివరి నిమిషంలో ప్రచార కార్యక్రమాలకు హ్యాండ్ ఇస్తుంటారు కొంతమంది కథానాయికలు. ఇకనుంచీ అలాంటి పప్పులు ఉడకవ్. ఎందుకంటే కథానాయికలు ప్రచార కార్యక్రమాలకు గైర్హాజరయ్యే విషయాన్ని పలువురు నిర్మాతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయాన్ని తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఫిర్యాదుని పరిశీలించిన అనంతరం నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం గురించి కేఆర్ మాట్లాడుతూ -‘‘ఆడియో ఆవిష్కరణ వేడుకల్లోనూ పాత్రికేయుల సమావేశాల్లోనూ కొంతమంది కథానాయికలు పాలుపంచుకోవడంలేదని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, ఇకనుంచి మొత్తం పారితోషికం ముందే ఇవ్వకూడదని తెలిపాం. 80 శాతం ఇచ్చేసి, మిగతా 20 శాతాన్ని నిర్మాతల దగ్గరే ఉంచుకోవాలని చెప్పాం. 10 శాతాన్ని ఆడియో వేడుకలో పాల్గొన్నప్పుడు, మిగతా 10 శాతాన్ని ప్రెస్‌మీట్స్‌లో పాల్గొన్నప్పుడు ఇవ్వమని సూచించాం. హీరోయిన్లతో లిఖితపూర్వకంగా ఈ ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్మాతలకు చెప్పాం. ఇవాళ ప్రతి సినిమాకీ ప్రమోషన్ ఎంతో అవసరం. అయితే కొంతమంది కథానాయికలు సినిమాలు నటించడం వరకు మాత్రమే తమ బాధ్యత అని భావిస్తున్నారు. ఒకవేళ వాళ్ల మేనేజర్ల సలహా వల్లో లేక ఇతరుల సలహా మేరకో వాళ్లలా అనుకుని ఉండొచ్చు. నేనెవర్నీ తప్పుపట్టడంలేదు. అయితే, ఇకముందు కూడా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాకపోతే పారితోషికంలో కోత తప్పదు’’ అని తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాజల్ అగర్వాల్, శరణ్యమోహన్ తమ చిత్రాల పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరు కాలేదట. దాంతో ఈ ఇద్దరి ముద్దుగుమ్మలపై ఆయా చిత్ర నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. -
ఇక నన్ను చెల్లెమ్మా అనరు
బాలతారగా పరిచయమైన మలయాళి కుట్టి శరణ్యా మోహన్. సినిమా చెల్లెమ్మగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో కథానాయకిగా నటిస్తోంది. అయితే చెల్లెమ్మ పాత్రల ముద్ర ఈ బ్యూటీని వెంటాడుతోంది. తన కొత్త సినిమాల విడుదల అనంతరం ఎవరూ చెల్లెమ్మా అనరంటోన్న శరణ్యామోహన్తో చిన్న భేటీ.. ప్రశ్న : సినిమా చెల్లెమ్మ ముద్ర నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నారు? జవాబు : నిజం చెప్పాలంటే ఈ ఇమేజ్ రాత్రికిరాత్రి వచ్చింది కాదు. ఇందుకు చాలా కఠినంగా శ్రమించాను. బాల నటిగా ఉన్నప్పుడు చెల్లెలిగా అంగీకరించిన వారు ఇప్పుడు హీరోయిన్‌గానూ తప్పక ఆదరిస్తారు. ఒక్క అమ్మాయి అందరికీ చెల్లెలుగా ఉండగలదు. చెల్లెలు ప్రేమించ… కూడదా? డ్యూయెట్లు పాడరాదా? అన్నయ్యలను అభిమానించనీయండి ఇతరులు ప్రేమిస్తారు. ప్రశ్న : ప్రస్తుతం చేస్తున్న చిత్రాలేమిటి? జవాబు : ప్రస్తుతం పూర్తిగా హీరోయిన్‌గానే నటిస్తున్నాను. తమిళంలో కాదలై తవిర వేరొండ్రుమిలై్ల. కోలాహలం చిత్రంలో ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ చలాకీగా ఉండే అమ్మాయిగా నటిస్తున్నాను. ‘సుయం’ చిత్రంలో గ్రామీణ యువతి పాత్ర. ఈ చిత్రాల విడుదల తర్వాత నన్ను ఎవరూ చెల్లెమ్మా అనరు. ప్రశ్న : టాప్ హీరోలందరికీ చెల్లెలిగా నటించారు. ఇప్పుడు వారితో ఎలా జతకడతారు? జవాబు : బాలతారగా రజనీకాంత్‌తో కలసి నటించిన మీనా తర్వాత ఆయనతో జోడీ కట్టలేదా? సినిమాలో ఏదైనా సాధ్యమే. అలాగే నా విషయంలోనూ జరుగుతుంది. ప్రశ్న : మీకంటే వెనుక వచ్చిన నజ్రియా, అమలాపాల్, లకీష్మమీనన్ లాంటి వారు దూసుకుపోతుండడం ఈర్ష్య కలిగించలేదా? జవాబు : ఎందుకు ఈర్ష్యపడాలి. నాకంటే అందమైన అమ్మాయిలు సినిమాల్లోకి రాలేకపోతున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. గురువాయురప్పన్ ఎవరికి ఎలా రాసి పెట్టి ఉన్నారో అలానే జరుగుతుంది. ప్రశ్న : ఇప్పటి వరకు మీపై ఒక్క వదంతీ రాలేదే? జవాబు : అందుకు మీడియా వాళ్లకు థ్యాంక్స్. సినిమా నేపథ్యం గురించి నాకు బాగా తెలుసు. బాలతారగా ఉన్నప్పటి నుంచే చూస్తున్నాను. ఎవరితో ఎంత వరకు సన్నిహితంగా ఉండాలో ఎవరినీ ఎంత దూరంలో ఉంచాలో తెలుసు. ప్రశ్న : అయితే ప్రేమ వ్యవహారం లేనట్లేనా? జవాబు : కొందరి పట్ల నేను ఆకర్షితురాలినయ్యాను. అయితే అది ప్రేమకు దారి తీస్తుందా? అనేది తెలియదు. అదే విధంగా వారెవరూ సినిమాకు చెందిన వాళ్లు కాదు.