
మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న శరణ్యా
తమిళసినిమా: నటి శరణ్యా మోహన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. కోలీవుడ్‌లో వెన్నెలా కబడి కుళు చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అయిన కేరళా కుట్టి శరణ్యామోహన్ . ఆ తరువాత ఈరం, వేలాయుధం తదితర చిత్రాల్లో నటించారు. మాతృభాష మలయాళంతో పాటు తెలుగులోనూ వినాయకుడు తదితర చిత్రాల్లో నాయకిగా నటించారు. ఈమె హిందీలోనూ కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే సినిమా చెల్లెలిగానే ఎక్కువ గుర్తింపు పొందిన శరణ్యామోహన్ గత ఏడాది కేరళ రాష్ట్రం, తిరువనంతపురం ప్రాంతానికి చెందిన దంత వైద్యుడు అరవింద్ కృష్ణను వివాహం చేసుకుని ఎక్కువ సమయాన్ని సంసార జీవితానికే కేటాయించారు. కాగా శరణ్యామోహన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.