
'విలేజ్‌లో వినాయకుడు' అనే చిన్న సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన శరణ్యా మోహన్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.

2010లో విడుదలైన 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాతో శరణ్యా మోహన్ మరింత పాపులర్ అయింది.

ఈ సినిమాలో హీరో నానితో జంటగా మెప్పించిన ఈ మలయాళ బ్యూటీ పక్కింటి అమ్మాయిగా ప్రేక్షకులను మెప్పించింది.

ఒకే ఏడాదిలో ఆమె నటించిన ఆరు సినిమాలు తమిళ్, తెలుగులో విడుదలయ్యాయి.

వాస్తవంగా ఆమె మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా మలయాళంలో తొలిసారిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

2014లో 'బద్లాపూర్ బాయ్స్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.. ఇదే ఆమెకు చివరి చిత్రం.

2015లో చిన్ననాటి స్నేహితుడు దంత వైద్యుడు అరవింద్ కృష్ణన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది

వివాహం తర్వాత ఆమె ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.

శరణ్యా మోహన్‌కు అనంతపద్మనాభన్, అన్నపూర్ణ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శరణ్యా మోహన్ భరతనాట్యంలో శిక్షణ పొందింది. తన తల్లిదండ్రులకు వైకెబి పేరుతో డాన్స్ అకాడమీ ఉంది. అందులోనే ఆమే నేర్చుకున్నారు.

నాట్యభారతి పేరుతో త్రివేండ్రంలో శరణ్య కూడా డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేసింది.

దసరా సందర్భంగా అక్టోబర్ 13 నుంచి మొదటి బ్యాచ్ ప్రారంభం అవుతుందని పేర్కొంది.

భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ సంగీతం, వయోలిన్ కర్నాటిక్, కీబోర్డ్ వెస్ట్రన్ మరియు కర్నాటిక్, డ్రాయింగ్ , పెయింటింగ్, యోగా క్లాసులు ఉంటాయని తెలిపింది.

