సినిమా హీరోయిన్లు.. ఇండస్ట్రీకి దూరమైపోతే బయట పెద్దగా కనిపించరు. ఒకవేళ వాళ్ల ఫొటోలు ఒకటో రెండో కనిపించినా సరే సడన్‌గా గుర్తుపట్టడం కాస్త కష్టమవుతుంది. ఎందుకంటే అంతలా మారిపోతారు. ఇప్పుడు కూడా అలానే ఓ బ్యూటీ కనిపించింది. ఈమె తెలుగులో నాని హిట్ సినిమాలో చేసిన హీరోయిన్. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శరణ్య మోహన్. అలెప్పీలో పుట్టిన ఈ కేరళ కుట్టి.. చిన్నప్పుడే అంటే ఎనిమిదేళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో మూడు, తమిళంలో రెండు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. టీనేజ్‌లోకి వచ్చాక సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలా కొన్నాళ్లకు హీరోయిన్ అయిపోయింది.
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్? అసలు విషయం ఇదే)
'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలో హీరోయిన్‌గా చేసిన శరణ్య మోహన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నాని 'భీమిలి కబడ్డీ జట్టు' మూవీలో నటించి మనసు దోచేసింది. 'కల్యాణ్ రామ్ కత్తి', 'హ్యాపీహ్యాపీగా' చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఇవి తప్పితే మరో తెలుగు మూవీలో నటించలేదు. అలా టాలీవుడ్‌కి దూరమైపోయింది.
1997 నుంచి 2014 వరకు సినిమాల్లో నటించిన శరణ్య మోహన్.. 2015లో తన చిన్నప్పటి ఫ్రెండ్ అరవింద్ కృష్ణన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈమెకి సినిమాలు చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఉంటుందేమో తెలీదు. ఇకపోతే స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన శరణ్య.. తన డ్యాన్స్ వీడియోలని సోషల్ మీడియాలో అప్పడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే హీరోయిన్‌గా ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. అందుకే తెలుగు ఆడియెన్స్ గుర్తుపట్టలేకపోయారు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్)
Comments
Please login to add a commentAdd a comment