ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నా: సీతారామం బ్యూటీ పోస్ట్ వైరల్! | Mrunal Thakur Special Post On Hi Nanna Team Before Release - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నా: సీతారామం బ్యూటీ పోస్ట్ వైరల్!

Published Thu, Dec 7 2023 12:41 PM | Last Updated on Thu, Dec 7 2023 1:47 PM

Mrunal Thakur Special Post On Hai Nanna Team Befroe Release  - Sakshi

నేచురల్ స్టార్ నాని, సీతారామ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. అభిమానుల భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 7న థియేటర్లలోకి వచ్చింది. తండ్రీ, కూతుర్ల మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని శౌర్వువ్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. గురువారం రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ మూవీ తనకెంతో ప్రత్యేకమంటూ మృణాల్ ఠాకూర్  తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రం తనకు జీవితాంతం గుర్తుంటుదని తెలిపింది. ఈ రోజు కోసమే వేచి చూస్తున్నానని రాసుకొచ్చింది. తన జీవితంలో గుర్తుండిపోయే అవకాశమిచ్చినందుకు హాయ్ నాన్న మేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. అంతే కాకుండా హాయ్ నాన్న టీమ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement