భీమిలి తీరంలో సముద్రం వెనక్కి వెళ్లడంతో తేలిన రాళ్లు
భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి తీరంలో సముద్రం శుక్రవారం వెనక్కి తగ్గింది. అలల ఉధృతితో ప్రతి రోజూ సముద్రం ముందుకు వస్తుంది. చాలా అరుదుగా వెనక్కి వెళ్తుంది. అయితే శుక్రవారం సముద్రం వెనక్కి వెళ్లడంతో రాళ్లు బయటపడ్డాయి. అలల ఉధృతి లేకపోవడం, హోలీ కావడంతో సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. ఇక్కడ స్నానాలు చేశారు. కాగా.. ఇక్కడి తీరం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. స్నానాలకు దిగే వారిలో చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. నీటి అడుగున ఉండే రాళ్లకు తగలడం వల్ల తీవ్రగాయాలపాలవడం, లేదా చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ బయటపడ్డ రాళ్లను చూస్తే తీరం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది.
చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం..
Comments
Please login to add a commentAdd a comment